Vaaraahi Chalana Chitram
-
కన్నడలో అది ఒక్కడికే సాధ్యమైంది!
కన్నడ పరిశ్రమలో ఇప్పటివరకు సాధ్యంకాని ఫీట్‌ను యువ సంచలనం యశ్ సాధించబోతున్నాడు. కె.జి.యఫ్తో అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా దూసుకుపోతున్నాడు. మాస్‌ను కట్టిపడే అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా వసూళ్ల పరంగా రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రాన్ని తమిళ, హిందీ, తెలుగు భాషల్లో రిలీజ్ చేశారు. బాలీవుడ్లో జీరో సినిమా నిరాశపరచగా.. కె.జి.యఫ్ వసూళ్లలో దుమ్ముదులుపుతోంది. ఇక ఈ సినిమా వారాంతానికి వంద కోట్ల క్లబ్లో చేరనుందని మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమాతో యశ్.. కన్నడ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఏ హీరోకు సాధ్యం కాని అరుదైన ఫీట్‌ను సాధించనున్నాడు. వంద కోట్లను కొల్లగొట్టిన హీరోగా రికార్డులను క్రియేట్చేయనున్నాడు. ఈ సక్సెస్‌ను ఎంజాయ్‌చేస్తున్న వారాహి చిత్రయూనిట్ డిసెంబర్ 26న తిరుపతి, వైజాగ్, విజయవాడలో అభిమానులను కలిసి సందడి చేయనుంది. -
'పటేల్ సర్'గా జగ్గుభాయ్ : ఫస్ట్ లుక్
ప్రస్తుతం టాలీవుడ్లో బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఉన్న జగపతిబాబు మరోసారి హీరోగా తన మార్క్ చూపించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే గతంలో చేసినట్టుగా లవర్ బాయ్, ఫ్యామిలీ హీరో టైప్ సినిమాలు కాకుండా.. ఓ యాక్షన్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వాసు పరిమిని దర్శకుడిగా పరిచయం చేస్తూ వారాహి చలన చిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. షూటింగ్ ప్రారంభించిన రోజే సినిమా థీమ్‌తో ఓ టీజర్‌ను రిలీజ్ చేసిన చిత్రయూనిట్ తాజాగా జగపతిబాబు ఫస్ట్ లుక్ ను రివీల్ చేశారు. డిఫరెంట్ మేకోవర్‌లో జగపతి బాబు టఫ్ అండ్ స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. రాజమౌళి తనయుడు కార్తీకేయ లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు డీజే వసంత్ సంగీతం అందిస్తున్నాడు. -
జగపతిబాబు హీరోగా 'పటేల్ సర్'
ప్రస్తుతం టాలీవుడ్లో బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉన్న సీనియర్ హీరో జగపతిబాబు మరో హీరోగా తన మార్క్ చూపించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే గతంలో చేసినట్టుగా లవర్ బాయ్, ఫ్యామిలీ హీరో టైప్ సినిమాలు కాకుండా.. ఓ యాక్షన్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వాసు పరిమిని దర్శకుడిగా పరిచయం చేస్తూ వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ రోజు వారాహి చలన చిత్రం ఆఫీస్ లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్టార్ దర్శకుడు రాజమౌళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమా థీమ్ తెలిసే ఓ టీజర్ ను రిలీజ్ చేశారు. డిఫరెంట్ మేకోవర్ లో జగపతి బాబు క్రూయల్ గా కనిపిస్తున్నాడు. రాజమౌళి తనయుడు కార్తీకేయ లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు డీజే వసంత్ సంగీతం అందిస్తున్నాడు. -
జగపతిబాబు హీరోగా 'పటేల్ సర్'
-
తుంగభద్ర మూవీ స్టిల్స్