'పటేల్ సర్'గా జగ్గుభాయ్ : ఫస్ట్ లుక్ | jagapathi Babu Patel SIR first look | Sakshi
Sakshi News home page

'పటేల్ సర్'గా జగ్గుభాయ్ : ఫస్ట్ లుక్

Published Sat, Jul 1 2017 10:25 AM | Last Updated on Tue, Sep 5 2017 2:57 PM

'పటేల్ సర్'గా జగ్గుభాయ్ : ఫస్ట్ లుక్

'పటేల్ సర్'గా జగ్గుభాయ్ : ఫస్ట్ లుక్

ప్రస్తుతం టాలీవుడ్లో బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉన్న జగపతిబాబు మరోసారి హీరోగా తన మార్క్ చూపించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే గతంలో చేసినట్టుగా లవర్ బాయ్, ఫ్యామిలీ హీరో టైప్ సినిమాలు కాకుండా.. ఓ యాక్షన్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వాసు పరిమిని దర్శకుడిగా పరిచయం చేస్తూ వారాహి చలన చిత్రం బ్యానర్పై సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

షూటింగ్ ప్రారంభించిన రోజే సినిమా థీమ్తో ఓ టీజర్ను రిలీజ్ చేసిన చిత్రయూనిట్ తాజాగా జగపతిబాబు ఫస్ట్ లుక్ ను రివీల్ చేశారు. డిఫరెంట్ మేకోవర్లో జగపతి బాబు టఫ్ అండ్ స్టైలిష్గా కనిపిస్తున్నాడు. రాజమౌళి తనయుడు కార్తీకేయ లైన్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు డీజే వసంత్ సంగీతం అందిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement