
జగపతిబాబు హీరోగా 'పటేల్ సర్'
ప్రస్తుతం టాలీవుడ్లో బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉన్న సీనియర్ హీరో జగపతిబాబు మరో హీరోగా తన మార్క్ చూపించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే గతంలో చేసినట్టుగా లవర్ బాయ్, ఫ్యామిలీ హీరో టైప్ సినిమాలు కాకుండా.. ఓ యాక్షన్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వాసు పరిమిని దర్శకుడిగా పరిచయం చేస్తూ వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
ఈ రోజు వారాహి చలన చిత్రం ఆఫీస్ లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్టార్ దర్శకుడు రాజమౌళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమా థీమ్ తెలిసే ఓ టీజర్ ను రిలీజ్ చేశారు. డిఫరెంట్ మేకోవర్ లో జగపతి బాబు క్రూయల్ గా కనిపిస్తున్నాడు. రాజమౌళి తనయుడు కార్తీకేయ లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు డీజే వసంత్ సంగీతం అందిస్తున్నాడు.