vacate seat
-
మర్యాదగా తప్పుకోకుంటే అవిశ్వాసమే!
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్ యడియూరప్ప ప్రమాణస్వీకారం చేసి 24 గంటలు కూడా కాకముందే బీజేపీ జోరుపెంచింది. కాంగ్రెస్ నేత, కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ కె.ఆర్.రమేశ్ కుమార్ వెంటనే బాధ్యతల నుంచి తప్పుకోవాలని సందేశాన్ని పంపింది. స్వచ్ఛందంగా తప్పుకోకుంటే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి బలవంతంగా సాగనంపాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ మేరకు బీజేపీ తరఫు ప్రతినిధి ఒకరు ఈ విషయాన్ని నేరుగా స్పీకర్‌కు చేరవేసినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈ విషయమై బీజేపీ సీనియర్ నేత ఒకరు మాట్లాడుతూ.. ‘రమేశ్ కుమార్ స్వచ్ఛందంగా తప్పుకోకుంటే ఆయనపై అవిశ్వాసం పెట్టక తప్పదు. అయితే మా తొలిప్రాధాన్యం సోమవారం అసెంబ్లీలో బలపరీక్ష నెగ్గడం, ఆర్థిక బిల్లుకు ఆమోదం తెలపడమే. ఇది పూర్తయ్యాక స్పీకర్ విషయమై నిర్ణయం తీసుకుంటాం’ అని చెప్పారు. కాంగ్రెస్–జేడీఎస్ కూటమికి లబ్ధి చేకూర్చేలా స్పీకర్ వ్యవహరించవచ్చన్న అనుమానంతోనే బీజేపీ దూకుడు పెంచినట్లు తెలుస్తోంది. మరోవైపు యడియూరప్ప ప్రభుత్వానికి తాము మద్దతిచ్చే ప్రసక్తే లేదని జేడీఎస్ చీఫ్ దేవెగౌడ చెప్పారు. అనర్హతపై రెబెల్స్ న్యాయపోరాటం.. స్పీకర్ అనర్హతవేటు వేసిన నేపథ్యంలో ముగ్గురు కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలు న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. స్పీకర్ నిర్ణయంపై సుప్రీంకోర్టుతో పాటు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాలని ఎమ్మెల్యేలు రమే శ్ జార్కిహోళి, మహేశ్ కుమటహళ్లి, శంకర్లు నిర్ణయించారు. సుప్రీంలో రమేశ్, మహేశ్‌ల పిటిషన్లు ఇప్పటికే పెండింగ్‌లో ఉన్నందున స్పీకర్ కనీసం నోటీసు ఇవ్వకుండా, తమ వివరణ తీసుకోకుండా అనర్హులను చేయడంపై వీరిద్దరూ అఫిడవిట్లు దాఖలు చేస్తారని సమాచారం. స్వతంత్ర ఎమ్మెల్యే ఆర్.శంకర్‌ను కాంగ్రెస్ సభ్యుడిగా పరిగణిస్తూ స్పీకర్ అనర్హతవేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శంకర్ సోమవారం హైకోర్టును ఆశ్రయిస్తారని తెలుస్తోంది. తాను స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలుపొందినందున ఫిరాయింపుల చట్టం కింద వేటువేయడం కుదరదని శంకర్ చెబుతున్నారు. తమిళనాడులో 18 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడినప్పటికీ, 6 నెలల్లోపు జరిగిన ఉపఎన్నికల్లో పోటీచేసేందుకు సుప్రీంకోర్టు, ఈసీ అనుమతించిన విషయా న్ని గుర్తుచేస్తున్నారు. కాబట్టి అసెంబ్లీ ముగిసేవరకూ (2023) అనర్హత వేటేస్తూ స్పీకర్ ఇచ్చిన ఉత్తర్వులు కోర్టులో నిలబడవని స్పష్టం చేస్తున్నారు. -
కలెక్టరేట్ ఖాళీ
సాక్షి, శ్రీకాకుళం : కలెక్టరేట్లో ఈనెలాఖరుకు పలు సీట్లు ఖాళీ కానున్నాయి. ఇప్పటికే అరకొర సిబ్బందితో నడుస్తున్న కలెక్టరేట్‌కు ఆగస్టు ఒకటి నుంచి మరింత సమస్య ఎదురుకానుంది. ఇప్పటికే పలు సెక్షన్లలో సూపరింటెండెంట్లు లేరు. జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, డిప్యూటీ తహసీల్దార్ల కొరత ఉంది. ఈనెలాఖరుతో ఈ సమస్య మరింత పెరగనుంది. జిల్లా కలెక్టరేట్లో పనులు చకచక జరిగితేనే డివిజన్, మండల స్థాయిలో పనులు వేగవంతం అవుతాయి. జిల్లా కేంద్రంలో ఉన్నత కార్యాలయంలోనే సిబ్బంది కొరత వేధిస్తుంటే.. ఇక దిగువస్థాయిలో పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇటీవల జరిగిన బదిలీల ఫలితంగా కలెక్టరేట్లోని ఎనిమిది సెక్షన్లలో ఆరు ఖాళీ అయ్యాయి. తహసీల్దార్లు ఆర్.గోపాలరావు, కృష్ణప్రసాద్‌లు ఇన్చార్జిలతో ఈ సెక్షన్లను నడిపించారు. వారు కూడా ఈనెలాఖరుకు పదవీ విరమణ చేయనున్నారు. దీంతో అన్ని సెక్షన్లు ఖాళీ కా నున్నాయి. వీరితోపాటుగా రెవెన్యూ విభాగంలో తహసీల్దారు కేడరులో ఉన్న మరో ఇద్దరు.. జె.గోపాలరావు, ఎన్.సరళలు కూడా పదవీ విరమణ చేస్తున్నారు. దీంతో తహసీల్దారు కేడర్‌లో పది పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరమేర్పడింది. డీపీసీ అక్టోబర్ వరకు లేనట్టే.. జిల్లాలో తహసీల్దార్ల కొరత తీరాలంటే ఉన్న వారికి పదోన్నతులు ఇవ్వాలి. ప్రస్తుతం డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) అమలు చేసే పరిస్థితి లేదు. సార్వత్రిక ఎన్నికల ముందు మార్చి నెలలో డీపీసీ సూచన ప్రకా రం పదోన్నతులు ఇచ్చారు. దీంతో జిల్లాలో 9 మందికి ప్రమోషన్లు వచ్చాయి. కొత్తగా డీపీసీ నిర్వహించాలంటే ప్రస్తుతం ప్రో డీటీలు ఉన్నారు. సెప్టెంబర్ నెలలో వారి ప్రొబేషన్ పీరియడ్ పూర్తవుతుంది. ఆ తరవాత డీపీసీ ఇచ్చే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో గల సీనియారిటీ ప్రాప్తికి ఇప్పటికి ఉన్న డిప్యూటీ తహసీల్దార్లకు పదోన్నతి కల్పించవలసివుంది. అయితే ఈ డీపీసీ అక్టోబర్ వరకు లేదని రెవెన్యూ వర్గాలు చెపుతున్నాయి. అడ్‌హక్ తప్పనిసరి రెగ్యులర్ విధానంలో తహసీల్దార్లు లేనప్పుడు పరి పాలనా సౌలభ్యం కోసం ఉన్న డిప్యూటీ తహసీల్దార్లలో సీనియర్లకు తాత్కాలిక పద్ధతిలో పదోన్నతులు ఇచ్చి తహసీల్దారు బాధ్యతలు నిర్వహించేందుకు అనుమతులు ఇస్తారు. ప్రస్తుతం మన జిల్లాలో ఈ పరిస్థితి ఏర్పడింది. జూలై 31 నాటికి పదవీ విరమణ చేయనున్న తహసీల్దార్ స్థానంతో కలిపి 10మంది తహసీల్దార్లు కావాలి. ఈ పోస్టులకు అడ్‌హక్ పదోన్నతులు ఇచ్చే అకాశం ఉంది. ‘ఎ’ సెక్షన్ సూపరింటెండెంట్ కీలకం కలెక్టట్లో ‘ఎ’ సెక్షన్ కీలకంగా ఉంటుంది. ఈ సెక్షన్ అధికారిని పరిపాలనాధికారి (ఏవో) అంటారు. జిల్లా రెవిన్యూ విభాగంలో ఉద్యోగులు, ఇతర అంశాలకు సంబంధించిన కీలక ఫైళ్లన్నీ ఈ విభాగం నుంచే కదులుతాయి. అందుకే ఈ సెక్షన్ సూపరింటెండెంట్‌కి అనుభవం ఉండాలి. సాధారణంగా జీవోలపై అవగాహన ఉన్న సీనియర్ తహసీల్దారుకు, పనులు వేగంగా నిర్వహించే వారికి ఈ సీటును కేటాయిస్తారు. అయితే ప్రస్తుతం ఉన్న సీనియర్ తహసీల్దార్లందరినీ వివిధ మండలాలకు కేటాయించారు. ఇక అడ్హక్లో భర్తీ అయిన అత్యంత జూనియర్ తహసీల్దారుకు ఈ పోస్టును కేటాయించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సెక్షన్‌లోని సిబ్బందిలో ఒకరిద్దరిపై అవినీతి ఆరోపణలు, అధికారులను తప్పుతోవ పట్టిస్తారని అభియోగాలు ఉన్నాయి. ఈ తరుణంలో జూనియర్ అడహక్ తహసీల్దారును ఈ సీటులో కూర్చోబెడితే ఈ సెక్షన్ పరిస్థితి దారుణంగా తయారయ్యే ప్రమాదం ఉంది. పదోన్నతులు ఇచ్చినా చేరేవారేరి? కలెక్టరేట్లో వివిధ సెక్షన్లకు అడ్‌హక్ విధానంలో తహసీల్దారుగా పదోన్నతులు కల్పించినా, ఆ పదో న్నతులు తీసుకొనే పరిస్థితి ప్రస్తుతం రెవిన్యూ విభా గంలో లేదు. ప్రస్తుతం పదోన్నతులు పొందిన వారు కలెక్టరేట్లో పనిచేయాల్సి ఉంటుంది. కలెక్టరేట్లో పని అంటే ఒత్తిడితోపాటు.. రాత్రి పగలు పనులు, ఉన్నతాధికారులకు ప్రతి విషయంలో సమాధానం చెప్పకో వాల్సిన పరిస్థితి ఉంటుంది. అందువలన ఈ సెక్షన్ సూపరిం టెండెంట్ పోస్టులకు చాలా మం ది సుముఖంగా లేనట్టు తెలు స్తోంది. పదోన్నతి ఇస్తే, తహసీ ల్దారుగా పనిచేయడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నా, కలెక్టరేట్ సెక్షన్లో పనిచేసేందుకు ముం దుకు వచ్చిన పరిస్థితి లేదు. దీంతో ఈ అడ్‌హక్ పదోన్నతులపై సందేహలు చోటు చేసుకొంటున్నాయి. ఏది ఏమైనా పదోన్నతులు ఇస్తే తప్ప కలెక్టరేట్లో సెక్షన్ సూపరింటెండెంట్ల సమస్యకు పరిష్కారం లేనట్టే. -
ఈ సీటు సీఎం కోసమంటూ లాలూను లేపారు
-
ఈ సీటు సీఎం కోసమంటూ లాలూను లేపారు
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సాధారణంగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను ఎక్కడికి వెళ్లినా పెద్దన్నా అని సంబోధిస్తుంటారు. ముఖ్యంగా బిహార్ ఎన్నికలప్పటి నుంచి ఈ పిలుపు దాదాపుగా ఆయన మాట్లాడిన ప్రతి చోట వినిపిస్తోంది. ఎందుకంటే 2015 ఎన్నికల్లో అనూహ్య సీట్లు సొంతం చేసుకున్న లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఆ తర్వాత నితీశ్‌కు అండగా నిలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు సహాయపడింది. దీంతో అప్పటి నుంచి లాలూ పట్ల నితీశ్ కాస్తంత గౌరవంగానే ఉంటున్నారు. అయితే, ఆదివారం ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. పట్నాలో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో వేదికపైకి వెళ్లిన లాలూ అనుకోకుండా ముఖ్యమంత్రి నితీశ్‌కు ఏర్పాటుచేసిన సీటులో కూర్చున్నారు. ఇది గమనించిన కార్యక్రమ నిర్వాహకులు అది ముఖ్యమంత్రి కోసం ఏర్పాటుచేసిన సీటు అని, వేరే సీట్లో కూర్చోవాలని చెప్పారు. దీంతో ఎలాంటి ఆగ్రహానికి లోనవ్వకుండానే లాలూ మర్యాదగా వెళ్లి పక్క సీట్లో కూర్చున్నప్పటికీ ఆ చర్య ఆయనకు కొంత ఇబ్బందిని కలిగించినట్లు కనిపించారు. అనంతరం ముఖ్యమంత్రి నితీశ్ వచ్చి ఆయన సీట్లో కూర్చోగా వీఐపీ సీట్ల వరుసలో లాలూ కూర్చున్నారు. ఇప్పటికే నితీశ్ తగిన గౌరవాన్ని ఇవ్వడం లేదని ఆర్జేడీ నేతలు తెగ మదనపడుతున్నారు. ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ సిక్కు గురు గోవింద్ సింగ్ 350వ జయంతికి వచ్చిన సందర్భంగా కూడా మోదీతో కేవలం నితీశ్ మాత్రమే వేదికను పంచుకోవడం కూడా ఆర్జేడీ నేతలు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోయారు. అయితే, తమ మధ్య అలాంటి వైరుధ్యాలు లేవంటూ లాలూ, నితీశ్ స్పష్టం చేశారు.