వెంకన్న హుండీల ఆదాయం రూ.18 లక్షలు
వాడపల్లి(ఆత్రేయపురం) :
కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి వేంకటేశ్వరస్వామి వారి హుండీలను సోమవారం ఆలయ ఆవరణలో లెక్కించారు. స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి, ఉదయం సుప్రభాత సేవ, నీరాజన మంత్రపుష్పం, కల్యాణం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు స్వామి వారికి మొక్కుబడులు చెల్లించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఏర్పాట్లను ఆలయ ఈవో బీహెచ్వీ రమణ మూర్తి పర్యవేక్షించారు. ఆలయ ఆవరణలో హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని రాజమండ్రి దేవాదాయ ధర్మదాయ శాఖ ఈవో ఆర్వీ చందన ఆధ్వర్యంలో హుండీలను తెరిచారు. హుండీలను లెక్కించగా 40 గ్రాముల బంగారం 244 గ్రాముల వెండి, హుండీల ద్వారా రూ 18,05,732 ఆదాయం సమకూరింది. అలాగే అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి ఆలయం వద్ద హుండీ ద్వారా రూ.57,861 ఆదాయం సమకూరినట్టు ఈవో బీహెచ్వీ రమణ మూర్తి తెలిపారు. 34 రోజులకుగాను ఈ ఆదాయం వచ్చినట్టు వివరించారు.