vadarevu
-
కడలికీ కప్పం..!
చీరాల: పెద్ద ఎత్తున మత్స్య ఎగుమతులతో పాటు పర్యాటకుల తాకిడి అధికంగా ఉండే బాపట్ల జిల్లాలోని వాడరేవు వద్ద టోల్గేట్ పేరుతో కూటమి సర్కారు ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తోంది. మినీ గోవాగా రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాంతంలో నిత్యం వందలాది వాహనాలు తిరుగుతుంటాయి. కనువిందు చేసే కడలి సోయగాలను ఆస్వాదించేందుకు రాష్ట్రంతోపాటు తెలంగాణ, ఇతర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు భారీగా తరలి వస్తుంటారు. ఆదాయంపై కన్నేసిన సర్కారు వాడరేవు, కీర్తివారిపాలెం గ్రామాల అభివృద్ధి కోసం టోల్ గేట్ ఏర్పాటు చేసినట్లు చెబుతుండటంపై పర్యాటకులు, మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ కీర్తివారిపాలెం వద్ద 2017లో టీడీపీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఇక్కడ టోల్‌గేట్‌ను ప్రారంభించగా వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే మాజీ ఎమ్మెల్యే కరణం బలరామ కృష్ణమూర్తి దాన్ని తొలగించారు. తాజాగా కూటమి ప్రభుత్వం రాగానే మళ్లీ టోల్గేట్ ఏర్పాటైంది. గ్రామ ప్రజల అభిప్రాయం, పంచాయతీ తీర్మానాన్ని పట్టించుకోకుండా చీరాల ఎమ్మెల్యే ఎం.ఎం.కొండయ్య స్వయంగా టోల్‌గేట్‌ను ప్రారంభించడం గమనార్హం. తీర ప్రాంతాల్లో గ్రామాల్లో ఎక్కడా టోల్గేట్లు ఉండవు. జాతీయ రహదారిల్లో మాత్రమే ఉండే టోల్గేట్లు చిన్న గ్రామాల్లోకి రావడంతో జనం విస్తుపోతున్నారు.వసూళ్లు భారీగానే.. కార్తీక మాసంతో పాటు శని, ఆదివారాలు, ఇతర సెలవు రోజుల్లో వాడరేవు పర్యాటకులతో కళకళలాడుతుంది. కీర్తివారిపాలెం టోల్గేట్ ద్వారా ఏటా రూ.14 లక్షల ఆదాయం పొందేలా కూటమి నాయకులు స్కెచ్ వేశారు. కారుకు రూ.50, ట్రాక్టర్‌కు రూ.50, నాలుగు చక్రాల లారీకి రూ.100, వినాయకుడి విగ్రహం ట్రాక్టర్‌కు రూ.100, లారీకి రూ.200, రొయ్యలు, చేపలు రవాణా చేసే వాహనాలకు రూ.100, టూరిస్ట్ బస్‌కు రూ.200 చొప్పున టోల్ చార్జీలు నిర్ణయించి వసూలు చేసేందుకు ముగ్గురు సిబ్బందిని నియమించారు. టోల్గేట్ 24 గంటలు పనిచేసేలా ఏర్పాట్లు చేశారు. సీఎం చంద్రబాబు చెబుతున్నట్లు సంపద సృష్టించడం అంటే ఇదేనా? అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.డీపీవో ఆదేశాలతో ఏర్పాటు పర్యాటకులు అధికంగా వచ్చే వాడరేవులోని కీర్తివారిపాలెంలో గ్రామ పంచాయతీ తీర్మానం, డీపీవో ఆదేశాలతో టోల్గేట్ ఏర్పాటు చేశారు. డీపీవో ఉత్తర్వుల్లో ఏముందో తెలుసుకుంటాం. – పి.శ్రీనివాసరావు, ఇన్చార్జి ఎంపీడీవో, చీరాల పర్యాటకం వెలవెల.. వాడరేవు నుంచి కఠారిపాలెం వరకు తీరప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఏపీతోపాటు తెలంగాణ, ఇతర‡ప్రాంతాల నుంచి కూడా సేద తీరేందుకు పర్యాటకులు వస్తుంటారు. గతంలో కూడా ఈ టోల్ గేట్‌ను అక్రమంగా ప్రారంభిస్తే మేం అధికారంలో ఉన్నప్పుడు తొలగించాం. మత్స్య సంపదను లారీలు, ఆటోల్లో ఇతర ప్రాంతాలకు తరలించే వారి వద్ద రూ.100 ట్యాక్స్ వసూలు చేయడం దారుణం. టోల్గేట్ తొలగించి ప్రజలపై భారం పడకుండా చూడాలి. లేదంటే పర్యాటకం కళ తప్పే ప్రమాదం ఉంది. – కరణం వెంకటేష్, వైఎస్సార్ సీపీ ఇన్చార్జి చీరాల -
ఇలాంటి వింత చేపను ఎప్పుడూ చూడలేదు..!
చీరాలటౌన్: చీరాల వాడరేవు సముద్ర తీర ప్రాంతానికి గురువారం వింత చేప కొట్టుకువచ్చింది. తెల్లని రంగులో మూడు కళ్లుతో కేజీన్నర బరువు ఉన్న ఈ చేప రబ్బరులా సాగుతోంది. వాడరేవు సముద్ర తీరం ఒడ్డున వింత ఆకారంలో ఉన్న చేప కనిపించడంతో మత్స్యకారులు భయ్చాందోళన చెందారు. గతంలో ఎన్నడూ ఇలాంటి ఆకారంతో వింతగా ఉన్న చేపలను తాము చూడలేదని తెలిపారు. కిలోన్నర బరువుతో వింతగా మూడు కళ్లుతో ఉన్న చేపను తిలకించేందుకు మత్స్యకారులతో పాటుగా చాలామంది తీరానికి చేరుకున్నారు. ఇలాంటి వింత చేపను తామెన్నడూ చూడలేదని చీరాల మత్య్సశాఖ అధికారి లక్ష్మానాయక్ తెలిపారు. చదవండి: ఇవేం పాడు పనులు.. కానిస్టేబుల్‌కు దేహశుద్ధి ప్రముఖ వస్త్ర వ్యాపారి ఆత్మహత్య -
వాడరేవు థర్మల్ ప్లాంట్ నిలిపివేత
సాక్షి, హైదరాబాద్: ఐదేళ్లుగా ఒక్క కొత్త విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టని రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టుకు కూడా నీళ్లొదిలింది. ప్రకాశం జిల్లా వాడరేవు సమీపంలో రూ.20 వేల కోట్లతో చేపట్టిన 4 వేల మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు(యూఎంపీపీ) నిర్మించరాదని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ కార్యదర్శికి రాష్ట్ర ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.సాహు కొద్దిరోజుల క్రితం లేఖ రాశారు. గతంలో జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్ కాలపరిమితి తీరిపోవడంతో పాటు భూసేకరణ కష్టంగా మారడమూ ఇందుకు కారణమని తెలుస్తోంది. ఫలితంగా రాష్ట్ర విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపకల్పన చేసిన 4 వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంటు ఏర్పాటు పనులు నిలిచిపోయాయి. మరోవైపు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన విద్యుత్ యజ్ఞానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఆయన హయాంలో నిర్మాణ పనులు ప్రారంభించిన వరంగల్ జిల్లా భూపాలపల్లి సమీపంలోని 600 మెగావాట్ల కాకతీయ థర్మల్ ప్లాంటుతోపాటు వైఎస్సార్ జిల్లా ముద్దనూరు వద్ద ప్రారంభించిన 600 మెగావాట్ల విద్యుత్ ప్లాంటు పనులూ సాగడం లేదు. బొగ్గు బ్లాకులను మళ్లించారు వాస్తవానికి వాడరేవు యూఎంపీపీకి బొగ్గు మంత్రిత్వశాఖ తాజాగా బొగ్గు బ్లాకులను కూడా కేటాయించింది. ఒడిశా తాల్చేరు బొగ్గు గనిలోని సర్పాల్-నౌపర్హా బ్లాకును కేటాయించింది. ఈ బొగ్గు బ్లాకుల్లో ఏకంగా 701.16 మిలియన్ టన్నుల బొగ్గు ఉందని అంచనా. వాడరేవు యూఎంపీపీని చేపట్టకపోవడంతో ఈ బ్లాకుల నుంచి వెలికితీసే బొగ్గును విజయవాడ, కొత్తగూడెంలలో నిర్మించే చెరో 800 మెగావాట్లతో పాటు సత్తుపల్లిలో నిర్మించే 600 మెగావాట్ల ప్లాంటుకు మళ్లించాలని బొగ్గు మంత్రిత్వశాఖకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది.