Vaishno Devi pilgrims
-
వైష్ణో దేవి యాత్ర మార్గంలో విరిగిపడ్డ కొండచరియలు.. ఒకరు మృతి
జమ్మూ కశ్మీర్‌లోని రియాసి జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. మాతా వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే యాత్ర మార్గంలో సోమవారం కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఓ యాత్రికుడు మరణించగా.. మరో ఇద్దరు గాయపడ్డారు.పంచి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భారీ బండరాళ్లు ఒక్కసారిగా కిందపడటంతో ఓవర్ హెడ్ ఐరన్ స్ట్రక్చర్ దెబ్బతింది. సమాచారం అందుకున్న వైష్ణోదేవి ఆలయ బోర్డుకు చెందిన డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందం వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది.ప్రమాదంలో గాయపడిన యాత్రికులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటన నేపథ్యంలో వైష్ణో దేవి మార్గంలో రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. యాత్ర సమయంలో యాత్రికులు జాగ్రత్తగా ఉండాలని, పరిస్థితులను అంచనా వేస్తూ ముందుకు సాగాలని సూచించారు. -
యాత్రికులతో వెళ్తున్న బస్సులో అగ్ని ప్రమాదం... నలుగురు మృతి
న్యూఢిల్లీ: వైష్టోదేవి యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సులో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు సజీవ దహనమవ్వగా..సుమారు 22 మంది గాయపడ్డారు. ఈ బస్సు కత్రా నుంచి జమ్మూకి వెళ్తున్నప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. కత్రా నుంచి 1.5 కి.మీ దూరంలోని ఖర్మల్ సమీపంలో బస్సులో మంటలు చెలరేగాయని పోలీసులు తెలిపారు. బస్సు ఇంజిన్ ప్రాంతం నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సు మొత్తం చుట్టుముట్టాయని వెల్లడించారు. ఇద్దరు మాత్రం అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటనలో గాయపడిన 22 మందిని చికిత్స నిమిత్తం కత్రాకు తరలించామని, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని జమ్మూ ఏడీజీపీ తెలిపారు. ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలికి వచ్చి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. (చదవండి: లిఫ్ట్ పేరుతో టీచర్‌పై లైంగిక దాడి.. వీడియోలు తీసి ఆ తర్వాత.) -
వైష్ణోదేవి భక్తులకు శుభవార్త..!
జమ్ముః వైష్ణోదేవి యాత్రికులకు శుభవార్త! భక్తులకు యాత్ర మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు వీలుగా కత్రానుంచి అర్థకువారి వరకు నవరాత్రి నాటికి మరో కొత్త ప్రయాణ మార్గాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వైష్ణోదేవి ష్రైన్ బోర్డు వెల్లడించింది. నవరాత్రి నాటికి వైష్ణోదేవి యాత్రకు సుమారు 7 కిలోమీటర్ల పొడవున మరో కొత్త మార్గాన్ని ప్రారంభించనున్నట్లు ఆలయ బోర్డు తెలిపింది. త్వరలో పనులు, షెడ్స్ నిర్మాణం పూర్తిచేసి మార్గాన్ని తెరిచేందుకు ముందు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అయితే కొత్త మార్గానికి వ్యతిరేకంగా పల్లకీలు, గుర్రాల యజమానులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ కొత్త మార్గం కేవలం నడచి వెళ్ళే భక్తులకోసం మాత్రమేనని, ఏ ఇతర ప్రయాణ సౌకర్యాలకు ఈ మార్గంలో అనుమతి లేదని దేవాలయ బోర్డు సీఈవో స్సష్టం చేశారు. ఈ నూతన మార్గం 500 మీటర్లే ఉన్నప్పటికీ విస్తృతంగా ఉంటుందని, అత్యవసర సమయాల్లో అంబులెన్స్ సులభంగా అక్కడకు చేరుకునే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. అర్థకువారీ హతీమాతా ప్రాంతంలో ఈ రూటులో నిటారుగా అధిరోహించాల్సి ఉంటుందని, ఈ ప్రదేశంలో జారకుండా ఉండేట్లుగా టైల్స్ ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వచ్చే యేడాది నాటికి వైష్ణోదేవి భక్తులకోసం రోప్ వే సేవలను కూడా అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు ష్రైన్ బోర్డ్ వెల్లడించింది. అత్యవసర సమయాల్లో భక్తులకు హెచ్చరికలు జారీచేసేందుకు ఆడియో సిస్టమ్ తో పాటు, మొత్తం మార్గమంతా చిన్న చిన్న రాళ్ళతో కూడిన పై కప్పును నిర్మిస్తున్నట్లు బోర్డు వెల్లడించింది. మరోవైపు వైష్ణోదేవి ఆలయానికి చేరుకునేందుకు అటు భక్తులు, ఇటు బోయీలకు సౌకర్యవంతంగా ఉండేందుకు వీలుగా ఐఐటీ ముంబై కొత్త చెక్క పల్లకీలను కూడా డిజైన్ చేసింది.