ప్రశాంత్, వరుణ్ గౌడ్ పరిస్థితి అత్యంత విషమం
హైదరాబాద్ మెదక్ జిల్లా మాసాయిపేటలో జరిగిన ఘోర దుర్ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్యంపై యశోదా ఆస్పత్రి వైద్యులు మంగళవారం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. అభినంద్, శివకుమార్‌లు కోలుకున్నారని, వారిని ఈరోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. ఇక ప్రశాంత్, వరుణ్ గౌడ్ పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, శరత్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
కాగా చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందిన తరుణ్, వైష్ణవి మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించారు. తరుణ్ మృతదేహాన్ని గుండ్రెడ్డిపల్లికి, వైష్ణవి మృతదేహాన్ని ఇస్లాంపూర్‌కు తరలించారు. విద్యార్థులు కుటుంబ సభ్యులు...కన్నీటితో వారికి అంత్యక్రియలు నిర్వహించారు.