valayam
-
వలయం ట్రైలర్ బాగుంది
‘‘స్నేహం, బంధుత్వం కన్నా నేను ప్యాషన్నే ఎక్కువ నమ్ముతాను. ఆ ప్యాషన్ ఉంటేనే ఇండస్ట్రీలో మనందరం ఉంటాం అని నమ్ముతాను’’ అన్నారు అడవి శేష్. లక్ష్, దిగంగనా సూర్యవంశీ జంటగా రమేష్ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వలయం’. చదలవాడ శ్రీనివాసరావు సమర్పణలో పద్మావతి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. ట్రైలర్ను విడుదల చేసిన అడవి శేష్ మాట్లాడుతూ– ‘‘లక్ష్లో ప్యాషన్ ఉంది. అది ట్రైలర్లో కనిపిస్తోంది.. ‘వలయం’ ట్రైలర్ నచ్చింది. సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘వలయం’ అనేది సమిష్టి కృషి. మా నాన్న నాకు ఓ చాన్స్ ఇచ్చారు. ఆయన సపోర్ట్ లేకపోతే మళ్లీ వచ్చేవాణ్ని కాదు. నా మిత్రుడు శేష్ అడుగుజాడల్లో నడవాలనుకుంటున్నాను’’ అని లక్ష్ అన్నారు. ‘‘లక్ష్ పెద్ద హీరోగా పేరు తెచ్చుకుంటే సంతోషం.. మంచి కొడుకుగా ఉంటే ఇంకా సంతోషం’’ అన్నారు చదలవాడ శ్రీనివాసరావు. ‘‘అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, లక్ష్కు థ్యాంక్స్’’ అన్నారు రమేష్ కుడుముల. దర్శకులు కేయస్ నాగేశ్వరరావు, నాగు గవర, చంద్ర మహేశ్, నిర్మాత శోభారాణి, నటుడు రవి ప్రకాశ్, సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర మాట్లాడారు. -
‘నా వైఫ్ దిశ.. తను కనిపించట్లేదు సర్’
వరుస సినిమాలతో జోరు మీదున్న దిగంగన సూర్యవంశీ హీరోయిన్గా నిర్మితమవుతున్న రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘వలయం’, లక్ష్య చదలవాడ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రమేశ్ కడుముల దర్శకత్వం వహించాడు. చదలవాడ పద్మావతి నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇప్పటికే విడుదలైన ‘నిన్ను చూశాకే’ అంటూ వచ్చిన రొమాంటిక్ వీడియో సాంగ్కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్న విషయం తెలిసిందే. అనురాగ్ కులకర్ణి ఆలపించిన ఈ సాంగ్ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా ‘వలయం’ మూవీ ట్రైలర్ను చిత్ర బృందం కాసేపటి క్రితం విడుదల చేసింది. 103 సెకన్ల నిడివి గల ఈ ట్రైలర్ తొలుత హీరో హీరోయిన్లు ఒకరినొకరు పరిచయం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. తర్వాత కొన్ని రొమాంటిక్ సీన్స్ వెంటనే యాక్షన్ అండ్ సస్పెన్స్ అంశాలను ట్రైలర్లో జోడించారు. దీంతో అన్ని వర్గాలను ఆకట్టుకుంటున్న ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శేఖర్ చంద్ర సంగీతమందించిన ఈ చిత్రం నితిన్ ‘భీష్మ’కు పోటీగా ఫిబ్రవరి 21న విడుదల కానుంది. చదవండి: అఘోరాగా బాలకృష్ణ సామజవరగమన పాట అలా పుట్టింది.. -
‘వలయం’లో హాసికాదత్
టీనగర్: నటి హాసికాదత్కు అనేక అవకాశాలు వస్తున్నా చిత్రాల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ‘ఒరు పందు నాలు రన్ ఒరు వికెట్’ చిత్రం ద్వారా తమిళ చిత్రరంగానికి కథానాయకిగా పరిచయమయ్యారు హాసికాదత్. మొదటి చిత్రంలోనే క్యారెక్టర్, కామెడీలతో పాటు దెయ్యం పాత్రంలో నటించి తనకు అన్ని కథాపాత్రల్లో నటించే సత్తావుందని నిరూపించారు. ఈమె ప్రతిభను గమనించి అనేక చిత్రావకాశాలు తలుపు తడుతున్నా నచ్చిన కథ, కథాపాత్రలను ఆచితూచి ఎన్నుకుంటున్నారు. ఆ విధంగా ఆమె ఎంపిక చేసుకున్న కొత్త చిత్రం ‘వలయం’. ఈ చిత్రం తమిళం, తెలుగు, కన్నడం అనే మూడు భాషల్లో రూపొందుతోంది. జీవితంలో ప్రతి వ్యక్తిని సంఘర్షణకు గురిచేసే సమస్యలు అనేకం ఉంటాయి. ఇటువంటి సమస్యల వలయంలో చిక్కుకోకుండా సమస్యలను ఎదుర్కొని సాధించే వ్యక్తుల కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. -
వలయంలో చిక్కుకుంటే....!
ప్రేమకథలో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ తెరకెక్కనున్న చిత్రం ‘వలయం’. నివాస్ అనంతనేని, హరిణి జంటగా పి. శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం గురువారం హైదరాబాద్లో ప్రారంభమైంది. ఈ నెల 6 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతామని, కథ,కథనాలు చాలా వైవిధ్యంగా ఉంటాయనిదర్శక, నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ముజీబ్, సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి.