
వరుస సినిమాలతో జోరు మీదున్న దిగంగన సూర్యవంశీ హీరోయిన్‌గా నిర్మితమవుతున్న రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘వలయం’, లక్ష్య చదలవాడ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రమేశ్ కడుముల దర్శకత్వం వహించాడు. చదలవాడ పద్మావతి నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇప్పటికే విడుదలైన ‘నిన్ను చూశాకే’ అంటూ వచ్చిన రొమాంటిక్ వీడియో సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్న విషయం తెలిసిందే. అనురాగ్ కులకర్ణి ఆలపించిన ఈ సాంగ్ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది.
తాజాగా ‘వలయం’ మూవీ ట్రైలర్‌ను చిత్ర బృందం కాసేపటి క్రితం విడుదల చేసింది. 103 సెకన్ల నిడివి గల ఈ ట్రైలర్ తొలుత హీరో హీరోయిన్లు ఒకరినొకరు పరిచయం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. తర్వాత కొన్ని రొమాంటిక్ సీన్స్ వెంటనే యాక్షన్ అండ్ సస్పెన్స్ అంశాలను ట్రైలర్‌లో జోడించారు. దీంతో అన్ని వర్గాలను ఆకట్టుకుంటున్న ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శేఖర్ చంద్ర సంగీతమందించిన ఈ చిత్రం నితిన్ ‘భీష్మ’కు పోటీగా ఫిబ్రవరి 21న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment