valu
-
శింబుకు బాసటగా నిలిచిన హన్సిక
ఒక పక్క శింబుపై కుట్ర జరుగుతోంది. తన చిత్రాలను విడుదల కాకుండా సమస్యలు సృష్టిస్తున్నారు అంటూ ఆయన తండ్రి సీనియర్ నట,దర్శక నిర్మాత టి.రాజేంద్రన్ ఆవేదన వ్యక్తం చేస్తుంటే మరో పక్క ఒకే ఒక్క వ్యక్తి శింబు జయించాలని కోరుకుంటే బహిరంగంగా ఈ విషయాన్ని వ్యక్తం చేయడం విశేషం. ఆ వ్యక్తి ఎవరబ్బా అని ఆశ్చర్యపోతున్నారా? ఎవరో అయితే న్యూస్ ఏముంది. అలా కోరుకుంటోంది నటుడు శింబు మాజీ ప్రియురాలు హన్సిక. శింబు,హన్సిక జంటగా నటించిన చిత్రం వాలు. ఈ చిత్ర షూటింగ్ సమయంలోనే వీరి మధ్య లవ్ మొదలై బ్రేక్అప్ అయ్యింది. చిత్ర నిర్మాణం పలు సమస్యలతో సుదీర్ఘ కాలం సాగింది.ఇంకా ఒక్క సాంగ్ చిత్రీకరణ బ్యాలెన్స్ ఉండటంతో నిర్మాత కష్టాలకు,మాజీ ప్రియుడి బాధకు కరిగిపోయి,జాలి కలిగి మళ్లీ పాట చిత్రీకరణకు కాల్షీట్స్ ఇచ్చారని కోలీవుడ్ వర్గాల టాక్. అసలు విషయం ఏమిటంటే ఈ చిత్ర యూనిట్ తో శింబు సక్సెస్ అవ్వాలనే ఆకాంక్షను హన్సిక వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇదే గనుక నిజం అయితే ఆమె వ్యాఖ్యలు శింబుకు చాలా ఉపశమనాన్ని కలిగించినట్లే. ఇదంతా బాగానే ఉంది. శింబు వాలు చిత్ర ప్రచారాన్ని మొదలెట్టారు. ఆ ప్రచారంలో ఈ మాజీ ప్రియురాలు పాలు పంచుకుంటారా? అన్నదే ఆసక్తిగా మారింది. -
హన్సికతో శింబు మళ్లీ రొమాన్స్!
తమిళ హీరో శింబు తన మాజీ ప్రియురాలు బబ్లీ బ్యూటీ హన్సికతో మళ్లీ రొమాన్స్ కొనసాగిస్తున్నాడు. ఇదంతా సినిమా కోసమేలేండి. వీరిద్దరూ జంటగా 'వాలు' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అసలు ఈ చిత్రం ప్రారంభమైన తరువాతే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని చెబుతారు. 2012లో మొదలైన ఈ సినిమా షూటింగ్ ఇప్పటి వరకు పూర్తి కాలేదు. ఈ మధ్యలో శింబు-హన్సిక ఒకరి ఒకరు దగ్గరవడం. పెళ్లి చేసుకోవాలనుకోవడం. ఇందు కోసం శింబు కొత్త ఇల్లు కూడా కట్టించాలను కోవడం. అంతలోనే వారి ప్రేమాయణం బెడిసి కొట్టడం. హన్సిక కక్షతీర్చుకోవలనుకోవడం.... అన్నీ వెంటవెంటనే జరిగిపోయాయి. ఆ తరువాత శింబుతో నటించడానికి హన్సిక ఇష్టపడలేదు. పాటల చిత్రీకరణకు హాజరుకాలేదు. దాంతో సినిమా నిర్మాణం ఆగిపోయింది. శింబుతో నటించే ఇతర అవకాశాలను కూడా ఈ బొద్దు బొమ్మ వదులుకుంది. ఒక పక్క వీరి వ్యవహారం ఇలా జరిగితే, ఇక 'వాలు' నిర్మాత పరిస్థితి చూడండి. వారికి సినిమా కష్టాలు మొదలయ్యాయి. ఈ విషయంలో హీరో శింబు కూడా ఏమి చేయలేకపోయాడు. అసలు గొడవ వచ్చిందే అతనితో కదా. నిర్మాతలు తమిళ ఫిలిం ఛాంబర్లో ఫిర్యాదు చేశారు. హన్సికతో అనేక సార్లు చర్చలు జరిపారు. తమ కష్టాలు చెప్పారు. ఎట్టకేలకు ఆ సినిమా పూర్తి చేయడానికి హన్సిక అంగీకరించింది. మిగిలిన సీన్లు పూర్తి చేయడానికి, మూడు పాటల చిత్రీకరణకు డేట్స్ ఇచ్చింది. నిజజీవితంలో ప్రేమికులైన వీరి రొమాన్స్ వెండితెరపై చూడాలని సినిమా ప్రేక్షకులు ఉవ్విళ్లూరుతున్నారు. 'వాలు' అంటే తెలుగులో చిలిపి అని అర్ధం. ఈపేరు వినగానే సినిమాలో ఎలా నటిస్తాడో అర్ధం చేసుకోవచ్చు. రొమాంటిక్ కామెడీగా రూపొందుతున్న వాలు చిత్రం షూటింగ్ మళ్లీ మొదలైంది. 30 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు విజయ్ చందర్ దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ స్వరాలు కూరుస్తున్నారు. అడ్డంకులు తొలగి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చే నవంబర్‌లో విడుదల చేయాలని నిర్మాతలు అనుకుంటున్నారు. శింబుతో ప్రేమ బెడిసికొట్టినా పాటలలో హన్సిక అదరగొట్టిందని చెబుతున్నారు. ఆ రొమాన్స్ దృశ్యాలు చూడాల్సిందే అంటున్నారు. ఈ సినిమా నిర్మాణం వెనుక ఇంత కథ ఉండటం దీనికి డిమాండ్ పెరిగింది. ఆ విధంగా నిర్మాతలు లాభపడే అవకాశం ఉంది. - శిసూర్య -
త్రిష. లేకపోతే నయనతార!
‘‘నయనతార వేండామ్.. ఆండ్రియా వేండామ్.. నీమట్టుమ్ పోదుమ్’’... ఏంటీ అర్థం కావడంలేదా? తమిళ చిత్రం ‘వాలు’లోని పాట ఇది. ‘నయనతార వద్దు.. ఆండ్రియా వద్దు.. నువ్వే చాలు’ అనేది దీనర్థం. ఆ సినిమాలో హన్సికను ఉద్దేశించి శింబు పాడే పాట అది. ఈ మధ్యకాలంలో కోలీవుడ్‌లో ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తోంది. తాజాగా, ఈ పాట స్థాయిలో ఓ సినిమా టైటిల్ హల్చల్ చేస్తోంది. అదే... ‘త్రిష... ఇల్లేనా నయనతార’. ‘త్రిష... లేకపోతే నయనతార’ అనేది అర్థం. సంగీత దర్శకునిగా బిజీగా ఉన్న జీవీ ప్రకాష్‌కుమార్ ఈ చిత్రంలో హీరో. ఇప్పటికే ఆయన ‘పెన్సిల్’ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. తన రెండో సినిమాకి ‘త్రిష ఇల్లేనా నయనతార’ అని పెట్టారు కాబట్టి, ఈ ఇద్దరు నాయికలూ సమ్మతిస్తారా? అనే చర్చ సాగుతోంది. అయితే, ఈ ఇద్దరిలో ఒక నాయిక అనుమతి తీసేసుకున్నారట. మరో నాయిక నుంచి గ్రీన్ సిగ్నల్ పుచ్చుకునే పనిలో ఉన్నారు