త్రిష. లేకపోతే నయనతార! | Trisha. If not sick! | Sakshi
Sakshi News home page

త్రిష. లేకపోతే నయనతార!

Published Thu, Mar 20 2014 1:02 AM | Last Updated on Sat, Sep 2 2017 4:55 AM

త్రిష. లేకపోతే నయనతార!

త్రిష. లేకపోతే నయనతార!

‘‘నయనతార వేండామ్.. ఆండ్రియా వేండామ్.. నీమట్టుమ్ పోదుమ్’’... ఏంటీ అర్థం కావడంలేదా? తమిళ చిత్రం ‘వాలు’లోని పాట ఇది. ‘నయనతార వద్దు.. ఆండ్రియా వద్దు.. నువ్వే చాలు’ అనేది దీనర్థం. ఆ సినిమాలో హన్సికను ఉద్దేశించి శింబు పాడే పాట అది. ఈ మధ్యకాలంలో కోలీవుడ్‌లో ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తోంది.

తాజాగా, ఈ పాట స్థాయిలో ఓ సినిమా టైటిల్ హల్‌చల్ చేస్తోంది. అదే... ‘త్రిష... ఇల్లేనా నయనతార’. ‘త్రిష... లేకపోతే నయనతార’ అనేది అర్థం. సంగీత దర్శకునిగా బిజీగా ఉన్న జీవీ ప్రకాష్‌కుమార్ ఈ చిత్రంలో హీరో. ఇప్పటికే ఆయన ‘పెన్సిల్’ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. తన రెండో సినిమాకి ‘త్రిష ఇల్లేనా నయనతార’ అని పెట్టారు కాబట్టి, ఈ ఇద్దరు నాయికలూ సమ్మతిస్తారా? అనే చర్చ సాగుతోంది. అయితే, ఈ ఇద్దరిలో ఒక నాయిక అనుమతి తీసేసుకున్నారట. మరో నాయిక నుంచి గ్రీన్ సిగ్నల్ పుచ్చుకునే పనిలో ఉన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement