ప్రేమకథకు ఫుల్‌స్టాప్ పడ్డట్టేనా? | Hansika's love story in breakup? | Sakshi
Sakshi News home page

ప్రేమకథకు ఫుల్‌స్టాప్ పడ్డట్టేనా?

Published Mon, Nov 25 2013 12:54 AM | Last Updated on Sat, Sep 2 2017 12:57 AM

ప్రేమకథకు ఫుల్‌స్టాప్ పడ్డట్టేనా?

ప్రేమకథకు ఫుల్‌స్టాప్ పడ్డట్టేనా?

 హన్సిక, శింబుల ప్రేమ కొండెక్కేసిందా? కోలీవుడ్ వర్గాలు అవుననే అంటున్నాయి. శింబు, నయనతారల ప్రేమబంధం మళ్లీ చిగురిస్తోందని కోలీవుడ్ మీడియా ఓ వైపు కథనాలు కూడా ప్రసారం చేస్తోంది. ఈ ఊహాగానాలను  శింబు కానీ, నయన కానీ, హన్సిక గానీ ఖండించకపోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లయ్యింది. శింబు, హన్సికల వివాహానికి శింబు తండ్రి టి.రాజేందర్ కూడా అంగీకరించిన విషయం తెలిసిందే. ఇక వీరిద్దరూ పెళ్లి పీటలెక్కడం ఖాయం అని అందరూ అనుకుంటున్న సమయంలో వీరి ప్రేమకథకు అర్ధంతరంగా ఫుల్‌స్టాప్ పడటం కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. హన్సిక మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ప్రస్తుతం సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్నారు.
 
  ప్రస్తుతం ఈ బొద్దుగుమ్మ చేతిలో ఎనిమిది చిత్రాలున్నాయి. అందులో ఆరు తమిళం కాగా, రెండు తెలుగు సినిమాలు. ‘‘సినిమాల గురించి తప్ప ప్రేమ, పెళ్లి, ఎఫైర్ల గురించి ఆలోచించే టైమ్ నాకు లేదు’’ అని తన సన్నిహితులకు హన్సిక నిర్మొహమాటంగా చెప్పేశారని వినికిడి. శింబు, నయనతార కలిసి ఓ సినిమాలో చేయడం వల్లే ఇలాంటి ఊహాగానాలు మొదలయ్యాయనేది మరో వెర్షన్. నయనతో కలిసి శింబు నటించడం హన్సికకు అస్సలు ఇష్టం లేదట. అయినా  శింబు పట్టించుకోకపోవడంతో హన్సిక అలకపాన్పు ఎక్కారనేది మరో సమాచారం. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement