Vandana Katariya
-
పేదరికం.. ఎన్నో అవమానాలు.. ఇప్పుడు దేశం గర్వించదగ్గ హాకీ ప్లేయర్
భారత దేశంలో నేటికి కొన్ని ప్రాంతాల్లో అమ్మాయిలు వివక్షను ఎదుర్కొంటూనే ఉన్నారు. ప్రతి విషయంలో వారిపై అంక్షల పర్వం కొనసాగుతూనే ఉంది. వారు మనసు నచ్చిన ఏ పనిని స్వేచ్ఛగా చేయలేకపోతున్నారు. తల్లిదండ్రులు మద్దతు ఉన్నా, సమాజం ప్రతి విషయంలో వారిని కుళ్ళబొడుస్తూనే ఉంది. ఇలాంటి అనుభవాలనే భారత దేశం గర్వించదగ్గ మహిళా హాకీ ప్లేయర్ వందనా కటారియా కూడా ఎదుర్కొంది. తనకు ఎంతో ఇష్టమైన క్రీడను (హాకీ) ఆడే క్రమంలో ఆమె ఎన్నో అవమానాలను ఎదుర్కొంది. అబ్బాయిలు ఆడే ఆటలు అమ్మాయిలకు ఎందుకని చుట్టుపక్కల వాళ్లు చులకన చేశారు. అబ్బాయిల్లా పొట్టి పొట్టి నిక్కర్లు వేసుకోవడమేంటని అవహేళన చేశారు. ఈ విషయంలో ఆమె తల్లిదండ్రులను కూడా నిందించారు. ఓ దశలో అమ్మాయిగా ఎందుకు పుట్టానా అని ఆమె బాధపడింది. అసలే పేదరికంతో బాధపడుతుంటే చుట్టుపక్కల వాళ్లు సూటిపోటీ మాటలతో మరింత వేధించారు. ఇలాంటి సమయంలోనే ఆమె గట్టిగా ఓ నిర్ణయం తీసుకుంది. తన ఆటతోనే విమర్శకుల నోళ్లు మూయించాలని డిసైడైంది. ఆ క్రమంలో ఒక్కోమెట్టు ఎక్కుతూ ప్రస్తుతం యావత్ భారత దేశం గర్వించదగ్గ క్రీడాకారిణిగా పేరు తెచ్చుకుంది. ఈ మధ్యే 300వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన వందన కటారియా.. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జన్మించిన వందన.. భారత మహిళా హాకీ జట్టులో ఫార్వర్డ్ ప్లేయర్‌గా కొనసాగుతుంది. భారత్ తరఫున జూనియర్ వరల్డ్‌కప్ స్థాయి నుంచి ఒలింపిక్స్ వరకు ప్రాతినిథం వహించిన ఆమె.. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ సాధించడం ద్వారా తొలిసారి దేశవ్యాప్త గుర్తింపు దక్కించుకుంది. అయితే అదే ఒలింపిక్స్ వందనతో పాటు ఆమె కుటుంబానికి కూడా చేదు అనుభవాలను మిగిల్చింది. టోక్యో ఒలింపిక్స్ సెమీఫైనల్స్‌లో భారత్.. అర్జెంటీనా చేతిలో ఓడిపోవడంతో వందన, ఆమె కుటుంబం కులపరమైన దూషణలను ఎదుర్కొంది. ఒలింపిక్స్‌లో పాల్గొన్న జట్టులో వందన లాంటి చాలా మంది దళితులు ఉన్నందున సెమీస్‌లో భారత్ ఓడిందని కొందరు అగ్రవర్ణ పురుషులు ఆమె కుటుంబాన్ని దుర్భాషలాడారు. ఇలాంటి అవమానాలను తన 14 ఏళ్ల కెరీర్లో అనునిత్యం ఎదుర్కొన్న వందన.. మహిళల హాకీలో అత్యున్నత శిఖరాలను అధిరోహించి, విమర్శకుల నోళ్లు మూయించింది. 31 సంవత్సరాల వందన.. తన అక్కను చూసి హాకీ పట్ల ఆకర్శితురాలైంది. కనీసం బూట్లు కూడా కొనలేని స్థితి నుంచి నేడు దేశం గర్వించదగ్గ స్టార్‌గా ఎదిగింది. హాకీ స్టిక్ కొనే ఆర్ధిక స్థోమత లేకపోవడంతో ఆమె చెట్ల కొమ్మలతో సాధన చేసి ఈ స్థాయికి చేరింది. ఓ పక్క పేదరికంతో బాధపడుతూ.. మరోపక్క అవమానాలను దిగమింగుతూ సాగిన వందన ప్రస్తానం భారత దేశ మధ్యతరగతి అమ్మాయిలకు ఆదర్శంగా నిలుస్తుంది. -
అదరగొట్టిన భారత మహిళల హాకీ జట్టు.. వరుసగా రెండో విజయం
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత మహిళల హాకీ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. పూల్-ఏలో భాగంగా వేల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ మహిళల జట్టు 3-1 తేడాతో ఘన విజయం అందుకుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ శనివారం అర్థరాత్రి జరిగింది. ఈ విజయంతో భారత మహిళల జట్టు ఆరు పాయింట్లతో పూల్-ఏలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. భారత్ తరపున వందనా కటారియా(ఆట 26, 48వ నిమిషం), గుర్జీత్ కౌర్(ఆట 28వ నిమిషం)లో గోల్స్ చేయగా.. వేల్స్ తరపున గ్జెన్నా హ్యూజెస్(ఆట 45వ నిమిషం) గోల్ చేసింది. ఇక భారత్ తమ తర్వాతి మ్యాచ్ ఆగస్టు 2న ఇంగ్లండ్‌తో ఆడనుంది. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నప్పటికి భారత మహిళల జట్టు నాలుగో స్థానంలో నిలిచి తృటిలో పతకం చేజార్చుకుంది. కానీ ఈసారి ఎలాగైనా పతకం సాధించాలనే దృడ సంకల్పంతో ఉంది. మరోవైపు ఎలాగైనా స్వర్ణం సాధించాలని బరిలోకి దిగన భారత పురుషుల హాకీ జట్టు ఇవాళ ఘనాతో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల జట్టు కాంస్యం గెలిచిన సంగతి తెలిసిందే. GOAL! And the avalanche of goals continues with #TeamIndia's third goal. IND 3:1 WAL #IndiaKaGame #HockeyIndia #B2022 #Birmingham2022 @CMO_Odisha @sports_odisha @IndiaSports @Media_SAI — Hockey India (@TheHockeyIndia) July 30, 2022 -
Hockey World Cup 2022: భారత్‌ను ఆదుకున్న వందన కటారియా
ప్రపంచకప్ మహిళల హాకీ టోర్నీలో భారత జట్టు వరుసగా రెండో లీగ్ మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించింది. నెదర్లాండ్స్‌లో చైనా జట్టుతో మంగళవారం జరిగిన పూల్ ‘బి’ లీగ్ మ్యాచ్‌ను భారత్ 1–1తో ‘డ్రా’ చేసుకుంది. చైనా తరఫున జియాలి జెంగ్ (26వ నిమిషంలో) గోల్ చేయగా... 45వ నిమిషంలో వందన కటారియా గోల్‌తో భారత్ స్కోరును సమం చేసింది. -
ఒలింపిక్స్ విజేతల సందడి: వందనా కటారియా భావోద్వేగం
సాక్షి, న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ లో అద్భుత ప్రదర్శన చూపించిన సొంతగడ్డపై అడుగిడిన క్రీడాకారులను ఘన స్వాగతం లభించింది. నగదు పురస్కారాలు, సత్కారాలతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వారి గౌరవించాయి. ముఖ్యంగా ఒడిశా ముఖ్యమంత్ర నవీన్ పట్నాయక్ రాష్ట్రానికి చెందిన పురుషులు, మహిళా హాకీ క్రీడాకారులను సన్మానించారు. బీరేంద్ర లక్రా, అమిత్ రోహిదాస్‌కు 2.5 కోట్ల నగదు పురస్కారాన్ని, అలాగే దీప్ గ్రేస్ ఎక్కా నమితా టోపోలకు ఒక్కొక్కరికి రూ .50 లక్షల నగదు బహుమతిని అందజేశారు. మరోవైపు టోక్యో 2020 లో పాల్గొన్న మహిళల హాకీ జట్టు సభ్యులు సలీమా టేట్, నిక్కీ ప్రధాన్ తమ సొంత రాష్ట్రానికి చేరుకున్న రాంచీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో అభిమానులు షేర్ చేస్తున్నారు. పంజాబ్‌కు చెందిన పురుషులు మహిళల హాకీ క్రీడాకారుల లుకూడాఅమృత్సర్ చేరుకున్నారు. కామన్వెల్త్ ఆసియన్ గేమ్స్ వచ్చే నెల నుండి శిక్షణను ప్రారంభిస్తామని, హాకీ జట్టు ఆటగాడు గుర్జంత్ సింగ్ వెల్లడించారు. ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ గోల్స్ కొట్టిన తొలి ఇండియన్ ప్లేయర్‌కు వందన కటారియాకు డెహ్రాడూన్ విమానాశ్రయంలోనూ, గ్రామంలోనూ వాయిద్యాలతో గ్రామస్తులు గ్రాండ్ వెల్కం చెప్పారు. ఈ సందర్భంగా ఇటీవల తండ్రిని కోల్పోయిన వందనా భావోద్వేగానికి లోనయ్యారు. ఇంటికి చేరినపుడు తనను తాను ఎలా నిభాయించుకోవాలో అర్థంకాలేదని పేర్కొన్నారు. అటు ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్‌లో రజత పతకాన్ని సొంతం చేసుకున్న మీరా బాయి చాను టెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ను కలిసారు. Amid 'dhols', Indian Women Hockey team's Vandana Katariya receives a warm welcome at Dehradun Airport, Uttarakhand. "We were broken after losing the bronze medal match, didn't win a medal but have won hearts. The team performed well at #Tokyo2020, " she says pic.twitter.com/VEa5jv8mLs — ANI (@ANI) August 11, 2021 Odisha CM Naveen Patnaik felicitated Men and Women hockey players from the state- Deep Grace Ekka, Namita Toppo, Birendra Lakra and Amit Rohidas for their performance at #Tokyo2020; handed over a cash award of Rs 2.5 crores to Birendra Lakra & Amit Rohidas. pic.twitter.com/Wt6ks6gYsC — ANI (@ANI) August 11, 2021 Family members of Indian men and women hockey players from Punjab receive them at Amritsar "We'll start training from next month. We have a busy year ahead due to Commonwealth & Asian Games. Confidence of team is high," says men's hockey team player Gurjant Singh pic.twitter.com/CpZDqXmSPr — ANI (@ANI) August 11, 2021 -
హ్యాట్రిక్ గర్ల్‌కు ప్రభుత్వ భారీ నజరానా
డెహ్రాడూన్: హాకీ క్రీడాకారిణి, హ్యాట్రిక్ గర్ల్ వందన కటారియాకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శనకుగాను ఆమెకు రూ. 25 లక్షల నగదు బహుమతిని ఇవ్వనున్నట్టు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి వెల్లడించారు. అలాగే ఆటలలో ప్రతిభను పెంపొందించేందుకు త్వరలోనే ఒక ఆకర్షణీయమైన కొత్త స్పోర్ట్స్ పాలసీని తీసుకురానున్నామని కూడా ఆయన చెప్పారు. టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల హాకీలో భారత అత్యుత్తమ ప్రదర్శనలో వందన కటారియా పోషించిన అద్భుతమైన పాత్ర తమకు గర్వకారణమని సీఎం ఆమెను ప్రశంసించారు. మరోవైపు టోక్యో ఒలింపిక్స్ లో సెమి ఫైనల్లో ఓటమికి వందన కటారియానే కారణమంటూ కులంపేరుతో దూషించిన కేసులో ఇద్దరు వ్యక్తులనుపోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఒక నేషనల్ హాకీ ప్లేయర్ అని సమాచారం. తెలుస్తోంది. అతడిపై భారత హాకీ సమాఖ్య తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.భారత మహిళా హాకీ జట్టు అర్జెంటీనాపై 1-2 తేడాతో ఓడిపోయిన నేపథ్యంలో వందన కటారియా వల్లనే ఓడి పోయిందంటూ దారుణమైన ట్రోలింగ్‌కు పాల్పడ్డారు. కొందరు ఆమె నివాసం వద్ద నిరసనకు దిగారు. దీనిపై వందన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఉత్తరాఖండ్ హరిద్వార్‌లోని రోష్నాబాద్ గ్రామానికి చెందిన హాకీ క్రీడాకారిణి వందనా కటారియా. టోక్యో ఒలింపిక్స్‌లో దక్షిణాఫ్రికాపై హ్యాట్రిక్ గోల్స్ కొట్టి సరికొత్త రికార్డు సాధించింది. భారత మహిళా హాకీ ప్లేయర్ ఇలా హ్యాట్రిక్ గోల్స్ కొట్టడం ఇదే తొలిసారి.ఈ మ్యాచ్‌లో 4-3 తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. శుక్రవారం నాటి హోరా హోరీ కాంస్య ప్లే-ఆఫ్ మ్యాచ్‌లో గ్రేట్ బ్రిటన్ చేతిలో 3-4 తేడాతో ఓటమి పాలైంది. ముఖ్యంగా చివరి క్వార్టర్లో ఫలితం తారుమారుకావడంతో తొలి ఒలింపిక్ పతకాన్ని సాధించాలనే భారత మహిళల హాకీ జట్టు ఆశ ఫలించకుండా పోయింది. -
మహిళల హాకీ జట్టు ఎట్టకేలకు!
మాడ్రిడ్ : స్పెయిన్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత మహిళల హాకీ జట్టు తొలి విజయాన్ని నమోదు చేసింది. మూడో మ్యాచ్‌లో భారత్ 3-2 తేడాతో స్పెయిన్‌పై ఘన విజయం సాధించింది. కీలక సమయంలో టీమిండియా కెప్టెన్ రాణి రాంపాల్ గోల్ సాధించడంతో భారత్ విజయాన్ని అందుకుంది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో చివరకు భారత్‌నే విజయం వరించింది. ఆట ప్రారంభమైన మూడో నిమిషంలోనే స్పెయిన్ క్రీడాకారిణి మారియా లోపెజ్ గోల్ చేసి భారత్ జట్టుకు షాక్ ఇచ్చారు. అనంతరం పుంజుకున్న భారత జట్టు నాలుగు నిమిషాల వ్యవధిలో వరుసగా రెండు గోల్స్ (గుర్జీత్ కౌర్, నవనీత్) చేసి 2-1తో లీడ్‌లోకి వచ్చింది. అయితే ఆట 58వ నిమిషంలో స్పెయిన్ ప్లెయర్ లోలా రియిరా మరో గోల్ చేసి స్కోర్ సమం చేశారు. ఇక మ్యాచ్ డ్రా అవుతుందనుకున్న సమయంలో రాణి రాంపాల్ (59వ నిమిషంలో) గోల్ చేసి భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో 3-0తో స్పెయిన్ గెలవగా, రెండో మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. ఇక టీమిండియా నాలుగో మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్ కోల్పోయే ప్రమాదం నుంచి తప్పించుకుంటుంది. వందన అరుదైన ఘనత ఫార్వర్డ్ క్రీడాకారిణి వందన కటారియా అరుదైన ఘనత సాధించారు. స్పెయిన్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మూడో మ్యాచ్ ఆడుతున్న వందనకు 200వ అంతర్జాతీయ మ్యాచ్. ఈ అరుదైన మ్యాచ్‌లో 42వ నిమిషంలో గోల్ చేసే అవకాశం వందనాకు వచ్చినా దాన్ని ఆమె తృటిలో మిస్ చేసుకున్నారు. 2009లో అరంగేట్రం చేసిన ఈ 26 ఏళ్ల ఉత్తర ప్రదేశ్ క్రీడాకారిణి.. గతంలో టీమిండియాకు నేతృత్వం కూడా వహించారు. అద్భుత ఫార్వర్డ్ క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్నారు. -
వందనకు కీలక బాధ్యతలు
న్యూఢిల్లీ: భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్ గా ఫార్వర్డ్ క్రీడాకారిణి వందన కటారియా నియమితురాలైంది. ఆసియా చాంపియన్స్ ట్రోఫికి 18 మందితో కూడిన జట్టును మంగళవారం ప్రకటించారు. ఉత్తరాఖండ్ ప్లేయర్ సునీత లక్రా వైస్ కెప్టెన్ గా ఎంపికైంది. ఆసియా చాంపియన్స్ ట్రోఫి ఈ నెల 29 నుంచి నవంబర్ 5 వరకు సింగపూర్ లో జరగనుంది. జపాన్, భారత్, చైనా, కొరియా, మలేసియా జట్లు ఈ టోర్నమెంట్ లో ఆడనున్నాయి. కెప్టెన్ గా ఎంపిక కావడం పట్ల వందన సంతోషం వ్యక్తం చేసింది. "ఇది నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. జట్టు బలాలు, బలహీనతల గురించి మాకు తెలుసు. సమిష్టిగా, వ్యక్తితంగా మా ఆటను మెరుగుపరుచుకుని సత్తా చాటాలని భావిస్తున్నామ'ని వందన చెప్పింది. శాయ్ ఆధ్వర్యంలో భోపాల్ లో ప్లేయర్స్ కు శిక్షణ శిబిరం నిర్వహిస్తామని చీఫ్ కోచ్ నీల్ హాగూడ్ తెలిపారు. మహిళల హాకీ జట్టు వందన కటారియా(కెప్టెన్), సునీత లక్రా(వైస్ కెప్టెన్), సవితా, రజనీ(గోల్ కీపర్స్), దీప గ్రేస్ ఎక్కా, రేణుకా యాదవ్, నమితా టోప్పో, రాణి రాంపాల్, నిక్కీ ప్రదాన్, నవజ్యోత్ కౌర్, మోనిక, పూనం రాణి, అనురాధ దేవి, ప్రీతి దూబే, పూనం బార్లా, హైనియలామ్ లాల్ రౌత్ ఫెలి