vanguru
-
అదనపు బ్యాంకు వచ్చేనా..?
సాక్షి, వంగూరు: మండల కేంద్రంలో ఒకేబ్యాంకు ఉండడంతో మండల ప్రజలు నిత్యం ఇబ్బందులకు గు రవుతున్నారు. పంట రుణాలు, పాల బిల్లులు, పింఛన్లు, పంట నష్టపరిహారం, బంగారు రుణా లు తదితర లావాదేవీలన్నీ బ్యాంకు ద్వారానే జరపాల్సి ఉండడంతో ఖాతాదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రంలో ఉన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో వ్యవసాయ, వా ణిజ్య ఖాతాలు కలిపి దాదాపుగా పది వేల ఖా తాలు ఉన్నట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. నోట్ల రద్దు తర్వాత.. నోట్ల రద్దు తర్వాత ప్రజలు బ్యాంకు లావాదేవీలు జరపడం తప్పని సరైంది. పది రోజులకోసారి వ చ్చే పాలబిల్లును బ్యాంకు నుంచి డ్రా చేసుకునేం దుకు పాడి రైతులకు ఒకరోజు టైం పడుతుంది. బంగారు రుణం తీసుకోవాలన్నా ఇబ్బందిగానే ఉంది. ఇప్పుడున్న తీవ్ర కరువు పరిస్థితులతో రై తులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. వ్యవసాయ పంట రుణాలు రెన్యూవల్ చేసుకోవడం తలకు మించిన భారంగా మారింది. పంట రుణం చెల్లిస్తే మళ్లీ రుణం తీసుకునేందుకు 15 నుంచి నెలరోజు ల సమయం పడుతుంది. మండలంలోని 17 పంచాయతీలు.. మండలంలో 20 పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 17 పంచాయతీలు ఐఓబీ బ్యాంకుపరిధిలోనే లావాదేవీలు జరుపుతున్నారు. ఇంతకు మించి వృ ద్ధులు బ్యాంకుల వద్దకు వచ్చి పింఛన్ పొందడం కష్టంగా మారింది. ఇంత పెద్దమొత్తంలో లావాదేవీలు ఉన్నప్పటికీ ఇక్కడ అదనపు బ్యాంకు ఏర్పా టు చేసేందుకు నేతల కృషి శూన్యమయ్యింది. ఒకవైపు అంతా ఆన్లైన్ సేవలు, బ్యాంకుల ద్వారానే లావాదేవీలు జరపాలని చెబుతున్నప్పటికీ మండల కేంద్రంలో ఇతర ఏదైనా బ్యాంకు ఏర్పాటు చేస్తే ప్రజలకు లావాదేవీలు జరపడం సులువవుతుంది. నిత్యం రద్దీగా ఉండడంతో.. బ్యాంకు నిత్యం ఖాతాదారులతో రద్దీగా ఉండడంతో సబ్సిడీ రుణాలు, వాణిజ్య రుణాలు, ఇతర కా ర్పొరేషన్ రుణాలు ఇచ్చేందుకు బ్యాంకు అధికారులు ముందుకు రావడంలేదు. ఉన్న బ్యాంకు పక్కనే ఏర్పాటు చేసిన ఏటీఎం ఎప్పుడూ పని చేయదు. బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బు డ్రా చేయాలంటే రెండు గంటలకు పైగానే క్యూలైన్లో నిల్చోవాల్సి వస్తుంది. కొందరు ఖాతాదారులు వామ్మో ఈ బ్యాంకులో లావాదేవీలు జరపడం కష్టమంటున్నారు. పట్టించుకోని ప్రజాప్రతినిధులు గతంలో వంగూరు గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉ పాధ్యాయుడు విష్ణుమూర్తి ఎస్బీఐ శాఖ ఏర్పాటు చేయాలని కేంద్ర కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కానీ ప్రజాప్రతినిధులు పెద్దగా ప ట్టించుకోకపోవడంతో బ్యాంకు అధికారుల నుంచి స్పందన కరువైంది. గ్రామీణ బ్యాంకు ఏర్పాటు చే స్తే మహిళా సంఘాలు, రైతులకు సులువుగా పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వడానికి అవకాశం ఉం టుందని కొందరు నాయకులు రెండేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలితం రావడంలేదు. పంచాయతీల తీర్మానాలతో.. మండలంలోని అన్ని గ్రామపంచాయతీల సర్పం చ్‌లు పంచాయతీ తీర్మానాలతో ఆయా బ్యాంకుల కేంద్ర కార్యాలయాలను సంప్రదిస్తే బ్యాంకు వచ్చే అవకాశాలు ఉన్నాయని పలువురు అంటున్నారు. కానీ అటుగా ప్రయత్నం చేసే సర్పంచ్‌లు కనిపించడంలేదు. ఏదేమైనా వంగూరులో మరో శాఖకు సంబం«ధించిన బ్యాంకు ఏర్పాటు చేస్తే అదనపు రుణాలు దొరకడంతోపాటు బ్యాంకులో రద్దీ కూడా తగ్గుంది. వ్యాపారపరంగా కూడా మండల కేంద్రం అభివృద్ధి చెందుతుంది. మరో బ్యాంకు ఏర్పాటు చేయాలి వంగూరు మండల కేంద్రంలో ఎస్బీఐ కానీ సంగమేశ్వర గ్రామీణ బ్యాంకు లేదా ఆంధ్రా బ్యాంకు ఏర్పాటు చేస్తే ప్రజలకు కొంత ఉపయోగంగా ఉంటుంది. ఇందుకోసం నేతలు తీవ్ర ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మండల కేంద్రంలో మరో బ్యాంకు ఏర్పాటు చేయాలి. – బాల్‌రెడ్డి, వంగూరు -
3సెం.మీ.ల వర్షపాతం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురవడంతో వాతావరణం చల్లబడింది. గత 24 గంటల్లో మహబూబ్‌నగర్ జిల్లాలోని వంగూరులో 3సెం.మీ.ల అత్యధిక వర్షపాతం నమోదైంది. యాచారం, అశ్వారావుపేట, కల్వకుర్తి, తిమ్మాజీపేట, అచ్చంపేట, డోర్నకల్, ముల్కలపల్లి, ఇబ్రహీంపట్నం, రంజల్, ఆర్మూర్, జడ్చర్ల, మోర్తాడ్, జూలూరుపాడు, కొణిజర్లలో 2సెం.మీ.ల చొప్పున వర్షపాతం నమోదైంది. చాలాచోట్ల 1సెం.మీ. వర్షపాతం నమోదవడంతో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తగ్గాయి. -
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
వంగూరు(పెదవేగి రూరల్) : దీర్ఘకాలిక వ్యాధి బాధిస్తుండడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. పెదవేగి మండలం వంగూరుకు చెందిన బొల్లి శ్రీనివాసరావు(45) కొంతకాలంగా దీర్ఘకాలిక వ్యాధికి చికిత్స తీసుకుంటున్నాడు. ఆరేళ్ల కిందట అతని భార్య కూడా అతని నుంచి విడాకులు తీసుకుని వెళ్లిపోయింది. వ్యాధి రోజురోజుకూ కుంగదీస్తుండడంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీనివాసరావు మంగళవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శవపంచనామా నిమిత్తం మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై రాఘవరావు చెప్పారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారుల మృతి
వంగూరు : మహబూబ్‌నగర్ జిల్లా వంగూరు మండలం కోనేటిపూర్ స్టేజీ వద్ద హైదరాబాద్ - శ్రీశైలం ప్రధాన రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆగి ఉన్న టిప్పర్‌ను డిండి నుంచి కల్వకుర్తి వైపు వస్తోన్న ఆటో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోట చేసుకుంది. క్షతగాత్రులను కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
వాంతులు, విరేచనాలుతగ్గితే ఒట్టు!
వంగూరు, న్యూస్‌లైన్: పక్షం రోజులుగా చారకొండ గ్రామస్తులను ముప్పుతిప్ప లు పెడుతున్న వాంతులు, విరేచనాలు ఏ మాత్రం తగ్గడం లేదు. రెండురోజులుగా అతిసార మళ్లీ విజృంభించడంతో స్థానికులకు ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. వైద్యశిబిరం ఏర్పాటుచేసి చికిత్సలు అందజేసినా వ్యాధి ఎంతమాత్రం అదుపులో కి రావడం లేదు. కడుపుకు తిండిలేక.. ఒంట్లో సత్తువలేక బాధితులు స్థానిక వై ద్యం శిబిరంలో చికిత్స పొందుతున్నారు. పదుల సంఖ్యలో కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రికి వెళ్తున్నారు. మరికొందరు నేరుగా హైదరాబాద్‌కు వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారు. శనివారం మరో ఎనిమిది మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీ రిలో రఘు, లక్ష్మణ్, లక్ష్మమ్మ, బుజ్జి, తేజ స్విని, ధోని, నిఖిల్, శివప్రసాద్ ఉన్నారు. వీరు స్థానిక శిబిరంలో వైద్యచికిత్సలు పొందుతున్నారు. ఇదిలాఉండగా, గతరెండు రోజులుగా వ్యాధి బారినపడిన 11 మంది కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రిలో చికి త్స పొందుతున్నారు. ప్రధానంగా చారకొండ పరిసర గ్రామాలైన మర్రిపల్లి, రాంపూర్, తుర్కలపల్లి, శాంతిగూడెం, సిరసనగండ్ల గ్రామాల్లోనే అతిసారవ్యాధి తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. గ్రా మంలో ఏర్పాటుచేసిన వైద్యశిబిరం కొనసాగుతూనే ఉంది. తాగునీటి సరఫరాలో జాగ్రత్తలు తీసుకోండి: డీఎంహెచ్ఓ ప్రధానంగా తాగునీరు కలుషితం కావ డం వల్లే అతిసారవ్యాధి వ్యాప్తి చెందుతుందని, చారకొండ గ్రామంలోని స్కీం బోర్ల నుంచి గాని, వాటర్ ట్యాంకుల నుంచి గాని నీటిని సరఫరా చేయకుండా నేరుగా ట్యాంకర్ల ద్వారానే ప్రజలకు సరఫరా చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారిణి(డీఎంహెచ్ఓ) రుక్మిణమ్మ అ ధికారులకు సూచించారు. శనివారం ఆ మె చారకొండ గ్రామాన్ని సందర్శించి వై ద్యశిబిరంలో చికిత్సపొందుతున్న రోగులను పరీక్షించారు. అనంతరం గ్రామ శి వారులో పైప్లైన్ల లీకేజీలతో ఏర్పడిన మురుగుకాల్వలను పరిశీలించారు. ఆ త రువాత స్థానికులు, బాధితులతో మాట్లాడారు. కలుషితమైన నీటిని తాగడం, ఆ హారలోపాల వల్లే అతిసార ప్రబలుతుం దన్నారు. చారకొండతోపాటు చుట్టుపక్క ల గ్రామాల్లో ఉన్న తాగునీటి బోర్లు, ఫి ల్టర్ వాటర్ప్లాంట్ల నీటి శాంపిల్స్‌ను ప రీక్షించేందుకు ఆదివారం జిల్లాకేంద్రం నుంచి ప్రత్యేకబృందం వస్తుందని ఆమె వివరించారు. వైద్యులు పట్టించుకోవడంలేదు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గుై రె వైద్య శిబిరం వద్దకు వస్తే ఇక్కడ ఉన్న సిబ్బంది, డాక్టర్లు ఏమాత్రం పట్టించుకోవడం లేదని అతిసార బాధితులు, గ్రామస్తులు డీఎంహెచ్ఓకు ఫిర్యాదుచేశారు. రెండుమందు గోళీలు ఇచ్చి రెఫర్ టు క ల్వకుర్తి అంటూ 108 ద్వారా కల్వకుర్తి ప్ర భుత్వాసుపత్రికి పంపిస్తున్నారని స్థానికు లు వాపోయారు. దీంతో ఆమె సిబ్బం దిపై అసహనం వ్యక్తంచేశారు. అవసరమైతే మరికొంత మంది సిబ్బందిని ఏ ర్పాటు చేసుకుని ఇక్కడికివచ్చే రోగులకు ఇక్కడే వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. వ్యాధి తీవ్రత ఉంటే తప్ప రె ఫర్ చేయడానికి వీల్లేదని హెచ్చరించారు. వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే తనకు ఫోన్ చేయమని గ్రామస్తులకు సూ చించారు. డీఎంహెచ్ఓను కలిసిన వారి లో చారకొండ సర్పంచ్ శిల్పాదేవీలాల్, గ్రామస్తులు శ్రీనివాస్‌గౌడ్, వెంకట్‌రెడ్డి, శ్రీను తదితరులు ఉన్నారు.