రద్దీగా ఉన్న బ్యాంకు (ఫైల్), మూతపడిన ఏటీఎం
సాక్షి, వంగూరు: మండల కేంద్రంలో ఒకేబ్యాంకు ఉండడంతో మండల ప్రజలు నిత్యం ఇబ్బందులకు గు రవుతున్నారు. పంట రుణాలు, పాల బిల్లులు, పింఛన్లు, పంట నష్టపరిహారం, బంగారు రుణా లు తదితర లావాదేవీలన్నీ బ్యాంకు ద్వారానే జరపాల్సి ఉండడంతో ఖాతాదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రంలో ఉన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో వ్యవసాయ, వా ణిజ్య ఖాతాలు కలిపి దాదాపుగా పది వేల ఖా తాలు ఉన్నట్లు బ్యాంకు అధికారులు తెలిపారు.
నోట్ల రద్దు తర్వాత..
నోట్ల రద్దు తర్వాత ప్రజలు బ్యాంకు లావాదేవీలు జరపడం తప్పని సరైంది. పది రోజులకోసారి వ చ్చే పాలబిల్లును బ్యాంకు నుంచి డ్రా చేసుకునేం దుకు పాడి రైతులకు ఒకరోజు టైం పడుతుంది. బంగారు రుణం తీసుకోవాలన్నా ఇబ్బందిగానే ఉంది. ఇప్పుడున్న తీవ్ర కరువు పరిస్థితులతో రై తులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. వ్యవసాయ పంట రుణాలు రెన్యూవల్ చేసుకోవడం తలకు మించిన భారంగా మారింది. పంట రుణం చెల్లిస్తే మళ్లీ రుణం తీసుకునేందుకు 15 నుంచి నెలరోజు ల సమయం పడుతుంది.
మండలంలోని 17 పంచాయతీలు..
మండలంలో 20 పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 17 పంచాయతీలు ఐఓబీ బ్యాంకుపరిధిలోనే లావాదేవీలు జరుపుతున్నారు. ఇంతకు మించి వృ ద్ధులు బ్యాంకుల వద్దకు వచ్చి పింఛన్ పొందడం కష్టంగా మారింది. ఇంత పెద్దమొత్తంలో లావాదేవీలు ఉన్నప్పటికీ ఇక్కడ అదనపు బ్యాంకు ఏర్పా టు చేసేందుకు నేతల కృషి శూన్యమయ్యింది. ఒకవైపు అంతా ఆన్‌లైన్ సేవలు, బ్యాంకుల ద్వారానే లావాదేవీలు జరపాలని చెబుతున్నప్పటికీ మండల కేంద్రంలో ఇతర ఏదైనా బ్యాంకు ఏర్పాటు చేస్తే ప్రజలకు లావాదేవీలు జరపడం సులువవుతుంది.
నిత్యం రద్దీగా ఉండడంతో..
బ్యాంకు నిత్యం ఖాతాదారులతో రద్దీగా ఉండడంతో సబ్సిడీ రుణాలు, వాణిజ్య రుణాలు, ఇతర కా ర్పొరేషన్ రుణాలు ఇచ్చేందుకు బ్యాంకు అధికారులు ముందుకు రావడంలేదు. ఉన్న బ్యాంకు పక్కనే ఏర్పాటు చేసిన ఏటీఎం ఎప్పుడూ పని చేయదు. బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బు డ్రా చేయాలంటే రెండు గంటలకు పైగానే క్యూలైన్‌లో నిల్చోవాల్సి వస్తుంది. కొందరు ఖాతాదారులు వామ్మో ఈ బ్యాంకులో లావాదేవీలు జరపడం కష్టమంటున్నారు.
పట్టించుకోని ప్రజాప్రతినిధులు
గతంలో వంగూరు గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉ పాధ్యాయుడు విష్ణుమూర్తి ఎస్‌బీఐ శాఖ ఏర్పాటు చేయాలని కేంద్ర కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కానీ ప్రజాప్రతినిధులు పెద్దగా ప ట్టించుకోకపోవడంతో బ్యాంకు అధికారుల నుంచి స్పందన కరువైంది. గ్రామీణ బ్యాంకు ఏర్పాటు చే స్తే మహిళా సంఘాలు, రైతులకు సులువుగా పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వడానికి అవకాశం ఉం టుందని కొందరు నాయకులు రెండేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలితం రావడంలేదు.
పంచాయతీల తీర్మానాలతో..
మండలంలోని అన్ని గ్రామపంచాయతీల సర్పం చ్‌లు పంచాయతీ తీర్మానాలతో ఆయా బ్యాంకుల కేంద్ర కార్యాలయాలను సంప్రదిస్తే బ్యాంకు వచ్చే అవకాశాలు ఉన్నాయని పలువురు అంటున్నారు. కానీ అటుగా ప్రయత్నం చేసే సర్పంచ్‌లు కనిపించడంలేదు. ఏదేమైనా వంగూరులో మరో శాఖకు సంబం«ధించిన బ్యాంకు ఏర్పాటు చేస్తే అదనపు రుణాలు దొరకడంతోపాటు బ్యాంకులో రద్దీ కూడా తగ్గుంది. వ్యాపారపరంగా కూడా మండల కేంద్రం అభివృద్ధి చెందుతుంది.
మరో బ్యాంకు ఏర్పాటు చేయాలి
వంగూరు మండల కేంద్రంలో ఎస్‌బీఐ కానీ సంగమేశ్వర గ్రామీణ బ్యాంకు లేదా ఆంధ్రా బ్యాంకు ఏర్పాటు చేస్తే ప్రజలకు కొంత ఉపయోగంగా ఉంటుంది. ఇందుకోసం నేతలు తీవ్ర ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మండల కేంద్రంలో మరో బ్యాంకు ఏర్పాటు చేయాలి.
– బాల్‌రెడ్డి, వంగూరు
Comments
Please login to add a commentAdd a comment