customers rush
-
సీబీడీసీ పైలట్ ప్రాజెక్టులోకి 1.7 లక్షల మంది వ్యాపారులు
ముంబై: అధికారిక సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) పైలట్ ప్రాజెక్టులో 1 లక్ష మంది కస్టమర్లు, 1.7 లక్షల మంది పైచిలుకు వ్యాపారులు భాగమైనట్లు ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంకు వెల్లడించింది. కస్టమర్ల నుంచి ఈ–రూపీల రూపంలో చెల్లింపులను స్వీకరించడంలో వ్యాపారవర్గాలకు ఉపయోగపడేలా యూపీఐ క్యూఆర్ కోడ్ను ఆవిష్కరించినట్లు వివరించింది. ఇది ప్రస్తుతం ఆండ్రాయిడ్ 10 పైగా వెర్షన్లలో పని చేస్తుందని, త్వరలో ఐవోఎస్ కోసం కూడా అందుబాటులోకి తేనున్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పేమెంట్స్ విభాగం హెడ్ పరాగ్ రావు తెలిపారు. పెద్ద మెట్రో నగరాలు మొదలుకుని విశాఖ, విజయవాడ వంటి 26 నగరాల్లో ఈ–రూపీ చెల్లింపుల సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం రోజుకు రూ. 5,000 – 10,000 గా ఉన్న డిజిటల్ రూపాయి లావాదేవీల పరిమితిని ఈ ఏడాది ఆఖరు నాటికి రోజుకు రూ. 10 లక్షల స్థాయికి పెంచే యోచనలో ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ డిప్యుటీ గవర్నర్ టి. రబి శంకర్ ఇటీవలే వెల్లడించారు. -
అదనపు బ్యాంకు వచ్చేనా..?
సాక్షి, వంగూరు: మండల కేంద్రంలో ఒకేబ్యాంకు ఉండడంతో మండల ప్రజలు నిత్యం ఇబ్బందులకు గు రవుతున్నారు. పంట రుణాలు, పాల బిల్లులు, పింఛన్లు, పంట నష్టపరిహారం, బంగారు రుణా లు తదితర లావాదేవీలన్నీ బ్యాంకు ద్వారానే జరపాల్సి ఉండడంతో ఖాతాదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రంలో ఉన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో వ్యవసాయ, వా ణిజ్య ఖాతాలు కలిపి దాదాపుగా పది వేల ఖా తాలు ఉన్నట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. నోట్ల రద్దు తర్వాత.. నోట్ల రద్దు తర్వాత ప్రజలు బ్యాంకు లావాదేవీలు జరపడం తప్పని సరైంది. పది రోజులకోసారి వ చ్చే పాలబిల్లును బ్యాంకు నుంచి డ్రా చేసుకునేం దుకు పాడి రైతులకు ఒకరోజు టైం పడుతుంది. బంగారు రుణం తీసుకోవాలన్నా ఇబ్బందిగానే ఉంది. ఇప్పుడున్న తీవ్ర కరువు పరిస్థితులతో రై తులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. వ్యవసాయ పంట రుణాలు రెన్యూవల్ చేసుకోవడం తలకు మించిన భారంగా మారింది. పంట రుణం చెల్లిస్తే మళ్లీ రుణం తీసుకునేందుకు 15 నుంచి నెలరోజు ల సమయం పడుతుంది. మండలంలోని 17 పంచాయతీలు.. మండలంలో 20 పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 17 పంచాయతీలు ఐఓబీ బ్యాంకుపరిధిలోనే లావాదేవీలు జరుపుతున్నారు. ఇంతకు మించి వృ ద్ధులు బ్యాంకుల వద్దకు వచ్చి పింఛన్ పొందడం కష్టంగా మారింది. ఇంత పెద్దమొత్తంలో లావాదేవీలు ఉన్నప్పటికీ ఇక్కడ అదనపు బ్యాంకు ఏర్పా టు చేసేందుకు నేతల కృషి శూన్యమయ్యింది. ఒకవైపు అంతా ఆన్లైన్ సేవలు, బ్యాంకుల ద్వారానే లావాదేవీలు జరపాలని చెబుతున్నప్పటికీ మండల కేంద్రంలో ఇతర ఏదైనా బ్యాంకు ఏర్పాటు చేస్తే ప్రజలకు లావాదేవీలు జరపడం సులువవుతుంది. నిత్యం రద్దీగా ఉండడంతో.. బ్యాంకు నిత్యం ఖాతాదారులతో రద్దీగా ఉండడంతో సబ్సిడీ రుణాలు, వాణిజ్య రుణాలు, ఇతర కా ర్పొరేషన్ రుణాలు ఇచ్చేందుకు బ్యాంకు అధికారులు ముందుకు రావడంలేదు. ఉన్న బ్యాంకు పక్కనే ఏర్పాటు చేసిన ఏటీఎం ఎప్పుడూ పని చేయదు. బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బు డ్రా చేయాలంటే రెండు గంటలకు పైగానే క్యూలైన్లో నిల్చోవాల్సి వస్తుంది. కొందరు ఖాతాదారులు వామ్మో ఈ బ్యాంకులో లావాదేవీలు జరపడం కష్టమంటున్నారు. పట్టించుకోని ప్రజాప్రతినిధులు గతంలో వంగూరు గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉ పాధ్యాయుడు విష్ణుమూర్తి ఎస్బీఐ శాఖ ఏర్పాటు చేయాలని కేంద్ర కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కానీ ప్రజాప్రతినిధులు పెద్దగా ప ట్టించుకోకపోవడంతో బ్యాంకు అధికారుల నుంచి స్పందన కరువైంది. గ్రామీణ బ్యాంకు ఏర్పాటు చే స్తే మహిళా సంఘాలు, రైతులకు సులువుగా పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వడానికి అవకాశం ఉం టుందని కొందరు నాయకులు రెండేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలితం రావడంలేదు. పంచాయతీల తీర్మానాలతో.. మండలంలోని అన్ని గ్రామపంచాయతీల సర్పం చ్లు పంచాయతీ తీర్మానాలతో ఆయా బ్యాంకుల కేంద్ర కార్యాలయాలను సంప్రదిస్తే బ్యాంకు వచ్చే అవకాశాలు ఉన్నాయని పలువురు అంటున్నారు. కానీ అటుగా ప్రయత్నం చేసే సర్పంచ్లు కనిపించడంలేదు. ఏదేమైనా వంగూరులో మరో శాఖకు సంబం«ధించిన బ్యాంకు ఏర్పాటు చేస్తే అదనపు రుణాలు దొరకడంతోపాటు బ్యాంకులో రద్దీ కూడా తగ్గుంది. వ్యాపారపరంగా కూడా మండల కేంద్రం అభివృద్ధి చెందుతుంది. మరో బ్యాంకు ఏర్పాటు చేయాలి వంగూరు మండల కేంద్రంలో ఎస్బీఐ కానీ సంగమేశ్వర గ్రామీణ బ్యాంకు లేదా ఆంధ్రా బ్యాంకు ఏర్పాటు చేస్తే ప్రజలకు కొంత ఉపయోగంగా ఉంటుంది. ఇందుకోసం నేతలు తీవ్ర ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మండల కేంద్రంలో మరో బ్యాంకు ఏర్పాటు చేయాలి. – బాల్రెడ్డి, వంగూరు -
నోట్ల దెబ్బకు ఐ ఫోన్ సేల్స్...
డీమానిటైజేషన్ ఎఫెక్ట్ ప్రముఖ మొబైల్ సంస్థ యాపిల్ కు బాగా ఉపయోగపడింది. విక్రయాలను పెంచుకోవడానికి మల్లగుల్లాలు పడుతున్న యాపిల్ కు కాలం కలిసి వచ్చింది. రూ.500, రూ.1000 చలామణిని కేంద్రం రద్దు చేయడంతో ఐ ఫోన్లకు డిమాండ్ పుట్టింది. దీంతో భారతదేశంలో మిలియన్ ఐ ఫోన్ల్ అమ్మాలనే టార్గెట్ వైపు వేగంగా దూసుకుపోతోంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత దొడ్డిదారిన (పాత తేదీ రసీదులతో) ఐఫోన్ అమ్మకాలు ఊపందుకున్నాయి కేవలం మూడు రోజుల్లో లక్ష ఖరీదైన ఐ ఫోన్లను అమ్మినట్టు తెలుస్తోంది. ఇది నెల వారీ అమ్మకాల సగటులో నాలుగు రెట్లు అధికమని ట్రేడ్ పండితులు చెపుతున్నారు. నవంబర్ 8 అర్ధరాత్రి వరకూ తాను అనేక దుకాణాల్లో ఐఫోన్ విక్రయాలు జోరందుకున్నట్టు ఢిల్లీలో ప్రముఖ మొబైల్ దుకాణం యజమాని చెప్పారు. రద్దయిన కరెన్సీ నోట్ల ద్వారా ఖరీదైన హ్యాండ్సెట్లు కొనుగోలు చేసినట్టు తెలిపారు. నిజానికి ప్రీమియం రేటుతో (అసలు ధర కంటే ఎక్కువకు) ఈ కొనుగోళ్ల జరిపినట్టు వెల్లడించారు. మరోవైపు మొత్తంగా స్మార్ట్ ఫోన్ అమ్మకాల్లో 20-30శాతంపెరుగుదల అంచనావేసినప్పటికీ..సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే అమ్మకాలు పడిపోయినట్టు పరిశ్రమ వర్గాల విశ్లేషణ. డీమానిటైజేషన్ కారణంగా దేశీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్ అక్టోబర్-డిసెంబర్ కాలంలో10 శాతం క్షీణించిందని హాంకాంగ్ కౌంటర్ పాయింట్ టెక్నాలజీ మార్కెట్ రీసెర్చ్ సీనియర్ విశ్లేషకుడు తరుణ్ పాఠక్ తెలిపారు. క్యాష్ ఆన్ డెలివరీ సేవలు నిలిపివేయడం కూడా ప్రభావితం చేసిందన్నారు. అయితే ఆపిల్ ఇండియా మాత్రం మిలియన్ ఐఫోన్ల సేల్ టార్గెట్ కు చేరువలో ఉందని పేర్కొన్నారు. కౌంటర్ పాయింట్ ప్రకారం, యాపిల్ అక్టోబర్ లో4 లక్షల స్మార్ట్ ఫోన్లను డెలివరీ చేసింది. రూ 60,000 , రూ 92,000 కు ధర పలికే ఐఫోన్ 7 , ఐఫోన్ 7 ప్లస్ లకు భారతదేశ మార్కెట్లో డిమాండ్ బాగా ఉందని సంగీత మొబైల్ మేనేజింగ్ డైరెక్టర్ సుభాష్ చంద్ర తెలిపారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో బంగారం, ఇతర లగ్జరీ వస్తువులు, అధిక విలువగల స్మార్ట్ ఫోన్లకు పెరుగుతున్న డిమాండ్ ను ప్రతిబింబిస్తూ ఐ ఫోన్ అమ్మకాలు కూడా పైకి ఎగబాకాయి.