Varanasi Loksabha
-
40 మంది డిపాజిట్లు కొల్లగొట్టిన మోదీ!
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఎన్నికల్లో వారణాసి నుంచి పోటీ చేస్తున్నారు.ఇతర రాజకీయ పార్టీల అభ్యర్ధులే కాకుండా మాజీ సైనికుడు, మాజీ న్యాయమూర్తి వంటి వారు ఓ పది మంది వరకు మోదీపై పోటీ చేస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణకు చెందిన 45 మంది పసుపు రైతులు కూడా మోదీకి వ్యతిరేకంగా ఈ నియోజకవర్గంలో బరిలో దిగుతున్నారు.వీరందరినీ కలిపితే మోదీ ఈ సారి 50–60 మందితో తలపడాల్సి ఉంటుంది.బహుశా ఈ ఎన్నికల్లో అనేక మంది పోటీ చేస్తున్న నియోజకవర్గంగా వారణాసి చరిత్ర సృష్టించినా ఆశ్చర్యం లేదు. అయితే, గత ఎన్నికల్లో దేశం మొత్తం మీద రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లో మాత్రమే 42 మంది పోటీ చేశారు. వాటిలో ఒకటి మోదీ పోటీ చేసిన వారణాసి కాగా రెండోది తమిళనాడులోని దక్షిణ చెన్నై నియోజకవర్గం. ఆ ఎన్నికల్లో మోదీతో తలపడిన 41 మందిలో 40 మంది డిపాజిట్లు కోల్పోయారు. ఆప్ అభ్యర్థి కేజ్రీవాల్‌కు 2 లక్షల ఓట్లు వచ్చాయి. మోదీకి వచ్చిన 5.81 లక్షల ఓట్లలో ఇవి సగం కూడా లేవు. ఇక చెన్నై సౌత్ నియోజకవర్గంలో అన్నాడీఎంకే తరఫున పోటీ చేసిన జె.జయవర్ధన్ కూడా తనతో తలపడిన 41 మందిని ఓడించి 1.35 లక్షల ఓట్ల ఆధిక్యతతో గెలిచారు.ఈ సారి కూడా ఆయన చెన్నై సౌత్‌నుంచే పోటీ చేస్తున్నారు. -
నేను ఫకీర్ ను..మోడీ 5 లక్షల కోట్లు సంపాదిస్తాడు!
వారణాసి: నేను ఫకీర్ ను, ప్రచారాన్ని నా స్వంత డబ్బులతోనే నిర్వహిస్తున్నాను అని ఆమ్ ఆద్మీ పార్టీ నేత కేజ్రీవాల్ అన్నారు. మోడీ అధికారంలోకి వస్తే 5 లక్షల కోట్ల సంపాదించుకుంటారని కేజ్రీవాల్ ఆరోపించారు. ప్రచార ప్రకటనలకు మోడీ 5 వేల కోట్లు ఖర్చు పెట్టారన్నారు. రాహుల్ గాంధీ కూడా పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు పెడుతున్నారన్నారు. టెలివిజన్, న్యూస్ పేపర్స్, హోర్డింగ్ లతోపాటు ఎక్కడ చూసినా వీరిద్దరి ప్రకటనలే కనిపిస్తున్నాయన్నారు. కుటుంబ సభ్యుడిలాంటి తనను ఎన్నుకుంటే అభివృద్ది చేస్తానని, మోడీ, రాహుల్ లను నమ్ముకుంటే మోసం చేస్తారని ప్రజలకు కేజ్రీవాల్ విజ్క్షప్తి చేశారు. ప్రజలను, వారి సమస్యలను దగ్గర నుంచి చూసే అవకాశం వారికి లేదని.. వాళ్లెప్పుడూ హెలికాఫ్టర్ లో గాలిలో తిరుగుతుంటారని కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు. -
కాశీ ప్రజలు మోసపోకూడదు: కేజ్రీవాల్
వారణాసి: బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్రమోడీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ మరోసారి నిప్పులు చెరిగారు. మోడీ, రాహుల్ తో వారణాసి ప్రజలు మోసపోకూడదని కేజ్రీవాల్ సూచించారు. వారణాసి లోకసభకు నామినేషన్ దాఖలు చేసేముందు కేజ్రీవాల్ ర్యాలీ నిర్వహించారు.ఎన్నికల ర్యాలీలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. నామినేషన్ కార్యక్రమానికి తాను సాదాసీదా ఓ వాహనంలో వస్తుంటే, మోడీ గురువారం హెలికాఫ్టర్ లో వస్తున్నారు అని ఆరోపించారు. గత కొన్ని సంవత్సరాలుగా అమేథిలో ప్రజలను మోసగిస్తున్న రాహుల్ ను చూసి కాశీ ప్రజలు మోసపోకూడదని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలను పంచుకునే నేత అవసరం వారణాసి ప్రజలకు ఉందని కేజ్రీవాల్ తెలిపారు. వారణాసి లోకసభకు మే 12 తేదిన జరుగనున్న ఎన్నికల్లో బీజేపీ తరపున మోడీ, కాంగ్రెస్ నుంచి అజయ్ రాయ్, ఆప్ నుంచి కేజ్రీవాల్ పోటీ పడుతున్న సంగతి తెలిసిందే.