నేను ఫకీర్ ను..మోడీ 5 లక్షల కోట్లు సంపాదిస్తాడు!
వారణాసి: నేను ఫకీర్ ను, ప్రచారాన్ని నా స్వంత డబ్బులతోనే నిర్వహిస్తున్నాను అని ఆమ్ ఆద్మీ పార్టీ నేత కేజ్రీవాల్ అన్నారు. మోడీ అధికారంలోకి వస్తే 5 లక్షల కోట్ల సంపాదించుకుంటారని కేజ్రీవాల్ ఆరోపించారు.
ప్రచార ప్రకటనలకు మోడీ 5 వేల కోట్లు ఖర్చు పెట్టారన్నారు. రాహుల్ గాంధీ కూడా పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు పెడుతున్నారన్నారు. టెలివిజన్, న్యూస్ పేపర్స్, హోర్డింగ్ లతోపాటు ఎక్కడ చూసినా వీరిద్దరి ప్రకటనలే కనిపిస్తున్నాయన్నారు.
కుటుంబ సభ్యుడిలాంటి తనను ఎన్నుకుంటే అభివృద్ది చేస్తానని, మోడీ, రాహుల్ లను నమ్ముకుంటే మోసం చేస్తారని ప్రజలకు కేజ్రీవాల్ విజ్క్షప్తి చేశారు. ప్రజలను, వారి సమస్యలను దగ్గర నుంచి చూసే అవకాశం వారికి లేదని.. వాళ్లెప్పుడూ హెలికాఫ్టర్ లో గాలిలో తిరుగుతుంటారని కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు.