వోల్టాస్‌కు ‘మంత్రి పినాకిల్ ’ ఆర్డర్
హైదరాబాద్: బెంగళూరులోని మంత్రి డెవలపర్స్ నిర్మిస్తున్న పినాకిల్ అపార్ట్మెంట్లలో వీఆర్ఎఫ్ల ఏర్పాటుకు సంబంధించిన కాంట్రాక్ట్ వోల్టాస్ కంపెనీకి దక్కింది. దక్షిణ భారత్‌లోనే అత్యంత పొడవైన (152 మీటర్లు) రెసిడెన్షియల్ టవర్-మంత్రి పినాకిల్‌లో మొత్తం 133 అపార్ట్మెంట్లలో వేరియబుల్ రిఫ్రిజిరెంట్ ఫ్లో సిస్టమ్స్(వీఆర్ఎఫ్) ఏర్పాటు చేస్తామని టాటా గ్రూప్‌కు చెందిన వోల్టాస్ ప్రకటన తెలిపింది. మొత్తం 4,13,850 చదరపుటడుగుల విస్తీర్ణంలో వోల్టాస్ వెర్వ్ సిరీస్ ఇన్వర్టర్ స్క్రోల్ వీఆర్ఎఫ్ సిస్టమ్స్‌ను ఏర్పాటు చేస్తామని సీవోవో ఎం. గోపీకృష్ణ పేర్కొన్నారు. వీఆర్ఎఫ్ సిస్టమ్‌ల వల్ల 35% వరకూ ఇంధన వ్యయాలు ఆదా అవుతాయని తెలిపారు.