కర్నూలు మీదుగా వాస్కోడిగామకు రైలు
– ప్రతి గురు, శనివారాల్లో రాకపోకలు
కర్నూలు(రాజ్‌విహార్): హైదరాబాదు నుంచి వాస్కోడిగామకు కొత్తగా ఎక్స్‌ప్రెస్ రైలు నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు. ఈ రైలు ప్రతి గురు, శనివారాల్లో రాకపోకలు సాగించనుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతాకు రాకపోకలు సాగించే ప్రయాణికులకు ఇది ఎంతో ఉపయోగపడనుంది. ఇది కర్నూలు మీదుగా నడిచే తొలి రైలు కావడం గమనార్హం. వీటిలో టికెట్లు పొందేందుకు ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.
రైళ్లు వివరాలు:
– వాస్కోడిగామకు:
హైదరాబాదు (నాంపల్లి స్టేషన్) నుంచి ఈ రైలు (నంబర్ 17021) ప్రతి గురువారం ఉదయం 9:20 గంటలకు బయలుదేరుతుంది. సికింద్రబాదులో 9:55కి, కాచిగూడలో 10:22లకు, షాద్ నగర్ 11:06, మహబూబ్ నగర్ మధ్యాహ్నం 12గంటలకు, గద్వాలలో 1 గంటకు బయలుదేరి కర్నూలుకు 14:10గంటలకు (మధ్యాహ్నం 2:10)కి వచ్చి రెండు నిమిషాలు ఆగి కదులుతుంది. డోన్‌లో 15:55గంటలకు బయలుదేరి గుంతకల్‌కు 17:00గంటలకు చేరుకుంటుంది. 18:00 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి తిరుపతికి చేరుకుంటుంది. ఇక్కడి నుంచి వాస్కోడిగామకు వెళ్లే రైలు (నంబర్ 17419)కు ఈ బోగీలను అనుసంధానం చేస్తారు. మరుసటి రోజు శుక్రవారం ఉదయం 6 గంటలకు వాస్కోడిగామకు చేరుకుంటుంది.
– కర్నూలు మీదుగా హైదరాబాదుకు:
వాస్కోడిగామ నుంచి రైలు (నంబర్ 17420) శుక్రవారం ఉదయం 9 గంటలకు బయలుదేరి అదేరోజు రాత్రి 21:00గంటలకు గుంతకల్‌కు చేరుకుంటుంది. అక్కడి నుంచి 10బోగీలతో 17022 నంబరు రైలుగా రాత్రి 21:10గంటలకు బయలుదేరి డోన్‌కు అర్ధరాత్రి 12:25కి, కర్నూలుకు శనివారం తెల్లవారుజామున 2:10కి, గద్వాలకు 3:14, మహబూబ్ నగర్‌కు 4:20, షాద్ నగర్‌కు 05:05, కాచికూడకు 6:00, హైదరాబాదు (నాంపల్లి)కు ఉదయం 7:40గంటలకు చేరుకుంటుంది.