Vatluru
-
ముగిసిన అథ్లెటిక్ పోటీలు
వట్లూరు (పెదపాడు) : సర్ ïసీఆర్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న ఆంధ్రా యూనివర్సిటీ అథ్లెటిక్ చాంపియన్ షిప్ పోటీలు బుధవారంతో ముగిశాయి. వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహించి విజేతలను ప్రకటించారు. కళాశాల యాజమాన్య కమిటీ ఉపాధ్యక్షుడు వీవీ బాల కృష్ణారావు, కార్యదర్శి ఎంవీకే దుర్గారావు, డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ యూఎం ఎస్.రామప్రసాద్, యాజమాన్య కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. విజేతల వివరాలు ఇలా ఉన్నాయి. ∙మహిళల పోటీలు 100మీ విభాగంలో కె.విజయలక్షి్మ(విశాఖపట్నం), 5 కిమీ విభాగంలో ఎం. మౌనిక విజయనగరం, 5 కిమీ నడక విభాగంలో డి.శేషారత్నం(ఏలూరు), 100 మీ హార్డిల్స్‌లో ∙కె.సుశీల (విజయనగరం), 400 మీ రిలే విభాగంలో సీహెచ్ వెంకటలక్ష్మి, కె.రమాదేవి, కె.విజయలక్ష్మి, సీహెచ్ వాణి(విశాఖపట్నం), షాట్‌పుట్ విభాగంలో సీహెచ్ ఉమ (విజయనగరం), ∙జావెలిన్ త్రోలో బి.సంధ్యారాణి(విశాఖపట్నం), హై జంప్ విభాగంలో ఒ.భవానీ(విశాఖపట్నం), ∙హెఫ్తాలాన్ విభాగంలో ఎం.లావణ్య (బొబ్బిలి) విజేతలుగా నిలిచారు. ∙పురుషుల 100 మీ విభాగంలో ఎల్.జనార్దనరావు(విశాఖపట్నం), 5 కిమీ విభాగంలో టి.అప్పారావు (విశాఖపట్నం), 20 కిలోమీటర్ల నడక విభాగంలో ఎస్ రాజు (విశాఖపట్నం), 400 మీ.హార్డిల్స్‌లో టి.వెంకటరావు (బొబ్బిలి), 100 మీ రిలే విభాగంలో ఎల్ జనార్దనరావు పీడీవై తేజ, ఎన్.గౌతమ్‌రెడ్డి, ఆర్కుమార్ నాయక్(విశాఖపట్నం), 400 రిలే విభాగంలో కె.కృష్ణమూర్తి, ఎల్.సాయికుమార్, బి.మురళీరాధ, ఎస్.వంశీకృష్ణ(విశాఖపట్నం), జావెలిన్‌త్రో విభాగంలో పి.రామకృష్ణ(కొత్తవలస), హమ్మర్ త్రో విభాగంలో ఎల్.కిరణ్‌కుమార్, హై జంప్ ఎన్.సింహాచలం (కొత్తవలస), డెకత్లాన్ పోటీలలో ఎ.అప్పన్న(విశాఖపట్నం) విజేతలుగా నిలిచారు. ఓవరాల్ చాంపియన్‌గా ఎస్వీవీపీవీఎంసీ డిగ్రీ కళాశాల విశాఖపట్నం నిలిచింది. ఇదే కళాశాలకు చెందిన ఎల్.జనార్దనరావు పాస్టెస్టు మన్ అవార్డు పొందాడు. -
రైలు ఢీకొని వ్యక్తి మృతి
ఏలూరు అర్బ¯ŒS : గుర్తు తెలియని రైలు ఢీకొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని వట్లూరు గ్రామానికి చెందిన పఠా¯ŒS బాజీ (45) అనే వ్యక్తి ఆదివారం బహిర్భూమికి వెళ్లేందుకు వట్లూరు రైల్వేస్టేçÙ¯ŒS సమీపంలో పట్టాల వద్దకు వచ్చాడు. అదేసమయంలో అటుగా వెళ్లిన గుర్తుతెలియని రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే కన్నుమూశాడు. రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేశారు. మృతుని బంధువులను రప్పించి వారి వివరణ మేరకు కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. -
కబడ్డీ జిల్లా జట్టు ఎంపిక
వట్లూరు (పెదపాడు) : రాష్ట్రస్ధాయి కబడ్డీ పోటీలకు జిల్లా జట్లను ఎంపిక చేసినట్టు జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం జిల్లా కార్యదర్శి మరడాని అచ్యుతరావు తెలిపారు. వట్లూరులో వారం రోజులుగా నిర్వహిస్తున్న కబడ్డీ క్రీడాకారుల శిక్షణా కార్యక్రమం బుధవారంతో ముగిసింది. తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలో ఈ నెల 6,7,8 తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొనే జిల్లా స్త్రీ, పురుష కబడ్డీ జట్లను ఎంపిక చేశారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచిన వారిని జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారని అచ్యుతరావు తెలిపారు. అనంతరం క్రీడాకారులకు క్రీడా దుస్తులు, సామాగ్రి అందించారు. స్థానిక నాయకులు కొమ్మన లక్ష్మణ మోహన్, బసవయ్య, పీఈటీలు పీఎన్ మల్లేశ్వరరావు, ఎం.చిన రంగారావు, కొమ్మంటి రంగారావు తదితరులు పాల్గొన్నారు. -
నేడు వట్లూరులో జగన్ ‘జనభేరి’
ఏలూరు, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం దెందులూ రు నియోజకవర్గంలో ‘వైఎస్సార్ జనభేరి’ నిర్వహించనున్నారు. పెదపాడు మండలం వట్లూరు రైల్వే గేటువద్ద సభలో ఆయన ప్రసంగిస్తారు. ఉదయం 9.30 గంటలకు రైల్వే గేటు సమీపంలోని సీఆర్ఆర్ పాలిటెక్నిక్ కాలేజీకి హెలికాప్టర్లో వైఎస్ జగన్ చేరుకుంటారు. సభలో మాట్లాడిన తరువాత నెల్లూరు జిల్లాకు వెళతారు. వైఎస్ జగన్ ‘జనభేరి’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థి తోట చంద్రశేఖర్, దెందులూరు ఎమ్మెల్యే అభ్యర్థి కారుమూరి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.