
నేడు వట్లూరులో జగన్ ‘జనభేరి’
ఏలూరు, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం దెందులూ రు నియోజకవర్గంలో ‘వైఎస్సార్ జనభేరి’ నిర్వహించనున్నారు. పెదపాడు మండలం వట్లూరు రైల్వే గేటువద్ద సభలో ఆయన ప్రసంగిస్తారు. ఉదయం 9.30 గంటలకు రైల్వే గేటు సమీపంలోని సీఆర్‌ఆర్ పాలిటెక్నిక్ కాలేజీకి హెలికాప్టర్‌లో వైఎస్ జగన్ చేరుకుంటారు. సభలో మాట్లాడిన తరువాత నెల్లూరు జిల్లాకు వెళతారు. వైఎస్ జగన్ ‘జనభేరి’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థి తోట చంద్రశేఖర్, దెందులూరు ఎమ్మెల్యే అభ్యర్థి కారుమూరి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.