VCK
-
వీసీకే అధినేతను సీఎంను చేయడానికి సంప్రదింపులు జరిగాయా?
చెన్నై: కులం-ముఖ్యమంత్రి పదవి గురించి విదుతలై చిరుతైగల్ కచ్చి (వీసీకే) అధినేత తొల్ తిరుమావళవన్ ఇటీవల చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. తమిళనాడు ఎన్నికల్లో 2 స్థానాలు గెలిచి, ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకేకు వీసీకే మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. టీవీకే అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు కూటమి ఏర్పాటు జరిగితే తనను ముఖ్యమంత్రిని చేస్తామంటూ అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు సంప్రదించాయంటూ వచ్చిన వార్తలను తిరుమావళవన్ ఖండించారు. తాను చేసిన వ్యాఖ్యల అర్థాన్ని వక్రీకరించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయొద్దని తిరుమావళవన్ మీడియాను కోరారు. “మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయాలని కొందరు ప్రయత్నించారని వార్తలు వస్తున్నాయి. ఆ ప్రయత్నాన్ని కాంగ్రెస్ అడ్డుకుందని అంటున్నారు” అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించారని తిరుమావళవన్ తెలిపారు. దానికి తాను స్పందిస్తూ.. “అలాంటి ప్రయత్నం జరిగిందని నాకు కూడా సమాచారం వచ్చింది” అని అన్నారు.ఎవరూ నన్ను సంప్రదించలేదు తనకు పరిచయం ఉన్న కొంతమంది స్నేహితులు వచ్చి తనను ముఖ్యమంత్రిగా చేసే ప్రయత్నాల గురించి మాట్లాడారని తెలిపారు. అంతేగానీ, డీఎంకే, ఏఐఏడీఎంకే నుంచి అధికారికంగా ఎవరూ తనను ముఖ్యమంత్రి విషయంపై సంప్రదించలేదని, తానూ ఈ విషయం గురించి ఎవరితోనూ చర్చించలేదని చెప్పారు. ఆ ప్రశ్నకు తాను వివరణ ఇచ్చానని.. కానీ, దానికి వేరే అర్థం వచ్చేలా శీర్షికలు పెట్టి వార్తలు ప్రచారం చేసి సంచలనం సృష్టించడం మీడియాకు సరికాదని తెలిపారు. నిన్న, ఇవాళ దీని గురించి మీడియాలో నిర్ధారణ కాని వార్తలు వస్తూనే ఉన్నాయని తెలిపారు. తమిళనాడులో దళిత సమాజానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రిని చేసేందుకు తమిళ సమాజం ఇంకా సిద్ధంగా లేదన్నది అందరికీ తెలిసిన చేదు నిజమని చెప్పారు.భారతదేశంలో ఉత్తరప్రదేశ్, ఆంధ్ర, మహారాష్ట్ర, బిహార్, పంజాబ్ రాష్ట్రాల్లో దళితులు ముఖ్యమంత్రులుగా పాలనా పీఠంపై నిలిచిన చరిత్ర ఉందని తెలిపారు. కానీ, తమిళనాడులో ఇంకా 100 సంవత్సరాలు గడిచినా అది కలగానే మిగులుతుందని తనకు తెలుసని చెప్పారు. అయినా, నేటి రాజకీయ పరిస్థితుల్లో అలాంటి చర్చ జరిగిందని చెప్పారు. దాన్ని వక్రీకరించి వేరే అర్థం వచ్చే ఉద్దేశంతో కొన్ని మాధ్యమాలు వార్తలు ప్రచారం చేయడం బాధ కలిగిస్తోందని తిరుమావళవన్ చెప్పారు. కాగా, టీవీకేకు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్ మద్దతు ఉంది. కాంగ్రెస్‌కు ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. సీపీఐ, సీపీఐ(ఎం), వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలకు తలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎన్నికల్లో టీవీకే 108 అసెంబ్లీ స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచింది. -
గేమ్‌చేంజర్ తిరుమావళవన్.. జీవితగాధ వింటే గూస్బంప్స్
చెన్నై: కొందరు నేతలు దళితుల కోసం పనిచేస్తున్నామని చెప్పుకుంటారు. కానీ, దళితుల కోసం చేసేది ఏమీ ఉండదు. కొందరు నేతలు మాత్రం దళితుల కోసం అహర్నిశలు కష్టపడతారు. వారి జీవితాల్లో వెలుగులు నింపుతారు. రాజకీయాల్లోకీ వారిని తీసుకొస్తారు. వారి వెనక ఉండి గెలిపిస్తారు. దళితులు ఏ ప్రాంతంలో సమస్యలు ఎదుర్కొంటున్నా, ఏ ప్రాంతంలో మోసాలకు, అణచివేతలకు గురవుతున్నా అక్కడికి వెళ్లి మరీ వారి సమస్యలను పరిష్కరిస్తుంటారు. అటువంటి నేతే తిరుమావళవన్.తిరుమావళవన్ దళితుల హక్కుల కోసం తమిళనాడులో దీర్ఘకాలంగా ఉద్యమాలు చేపట్టిన నాయకుడిగా గుర్తింపు పొందారు. 1990లలో తమిళనాడులో దళితులపై జరుగుతున్న అణచివేతకు వ్యతిరేకంగా తిరుమావళవన్ నిర్వహించిన సభలు, నిరసనలు పెద్ద ఎత్తున దళిత యువతను రాజకీయంగా చైతన్యపరిచాయి. కుల వివక్ష నిర్మూలన, సామాజిక న్యాయం, రాజకీయ ప్రాతినిధ్యం అంశాలను ఆయన నిరంతరం ముందుకు తెచ్చారు. హిందుత్వ రాజకీయాలు దళితులపై ప్రభావం చూపుతున్నాయని విమర్శిస్తూ, దళితుల రాజకీయ ఐక్యత అవసరమని పిలుపునిచ్చారు. కుల హింస ఘటనల్లో బాధితులకు మద్దతుగా నిలుస్తూ ప్రభుత్వ చర్యలు కోరారు. శ్రీలంక తమిళ శరణార్థుల సమస్యపైనా తిరుమావళవన్ గళం విప్పారు. ఎన్నికల్లో పోటీ చేసి, 2001లో ఎమ్మెల్యేగా అయ్యారు. 2009, 2019, 2024లో చిదంబరం లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు.రిజర్వ్ స్థానాలకే దళిత రాజకీయ నాయకులు, పార్టీలను పరిమితం చేసే రాజకీయ వ్యవస్థలో.. ప్రభుత్వాలకు బయట నుంచి మద్దతు ఇవ్వడమే కాదు, అధికార భాగస్వామ్యంలో కూడా దళిత పార్టీలకు స్థానం ఉండాలన్న తిరుమావళవన్ దీర్ఘకాల డిమాండ్ ఇప్పుడు నెరవేరుతోంది.తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటు వేళ టీవీకే విజయ్‌కు మద్దతు ఇచ్చి ఆ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించింది విదుతలై చిరుతైగల్ కట్చి (వీసీకే) పార్టీ. ఈ పార్టీ మొదట “దళిత్ పాంథర్స్ ఆఫ్ ఇండియా” పేరుతో 1982లో ఉద్యమంగా ప్రారంభమై, తర్వాత “విదుతలై చిరుతైగళ్ కచ్చి”గా రాజకీయ పార్టీగా మారింది. తమిళనాడు రాజకీయాలను మార్చిన దళిత పార్టీగా వీసీకే నిలిచింది. ఈ పార్టీని స్థాపించిన వారు ఎం.మలల్చామి, డి.అముకురాజా. ప్రస్తుత వీసీకే ఛైర్‌పర్సన్‌గా తోల్ తిరుమావళవన్ , ప్రధాన కార్యదర్శిగా డి.రవికుమార్ ఉన్నారు.దళితుల ఆశాజ్యోతి తమిళనాడులో దళితుల కోసం తిరుమావళవన్ చేసిన కృషి అంతాఇంతా కాదు. ఇప్పటిది కాదు. 1996లో చిదంబరం దక్షిణ కార్ వీధిలో నిలబడి తిరుమావళవన్ నినాదాలు చేస్తూ దళితుల్లో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అణచివేతను మౌనంగా భరించేందుకు అలవాటు పడ్డ అనేక మంది దళిత యువతలో అది రాజకీయ చైతన్యానికి నాంది పలికింది.వీసీకే రాజకీయాల్లోకి 1999లో అధికారికంగా అడుగుపెట్టింది. 2024లో వీసీకే తమిళనాడులో అతిపెద్ద దళిత పార్టీగా ఎదిగింది. తాజా ఎన్నికల్లో రెండు స్థానాలు మాత్రమే గెలుచుకున్నా.. వీసీకే ఇప్పుడు కూటమిలో కీలక భాగస్వామిగా మారింది. 2026 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు వేళ విజయ్ టీవీకేకు మద్దతు ఇచ్చి, తమిళనాడు రాజకీయాల్లో కింగ్‌మేకర్‌గా ఎదిగింది. వీసీకే ప్రస్తుత అవకాశాలు, భవిష్యత్ దిశ ఇప్పటికీ ప్రధానంగా తిరుమావళవన్ వ్యక్తిత్వం, రాజకీయాలపైనే ఆధారపడి ఉన్నాయి.దళితుల సామాజిక న్యాయం, సాధికారతపై అంబేద్కర్ భావజాలం, హేతువాదం, సామాజిక సంస్కరణ, కుల వ్యతిరేక ఉద్యమంపై పెరియార్ భావజాలం, పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకత, కార్మిక విముక్తిపై మార్క్స్ భావజాలం.. వీటన్నింటినీ సమ్మిళితం చేశారు తిరుమావళవన్. అణచివేత, అసమానతల అనేక పార్శ్వాలను ఎదుర్కొన్నప్పుడే విముక్తి సాధ్యమని ఆయన నమ్ముతా. వాటినే తిరుమావళవన్ ముందుకు తీసుకువెళ్తూ దళితుల జీవితాల్లో మార్పులు తీసుకువస్తున్నారు.దళితులు, అట్టడుగు వర్గాల ప్రజలు తిరుమావళవన్‌ను తమ ఏకైక ఆశగా భావిస్తున్నారు. హిందుత్వ శక్తులకు వ్యతిరేకంగా చురుకుగా పోరాడుతున్న తమిళనాడులోని ఏకైక కుల వ్యతిరేక పార్టీ వీసీకేనని వారు చెబుతున్నారు.ఇటీవల ముగిసిన 2026 అసెంబ్లీ ఎన్నికల్లో వీసీకే ఎనిమిది స్థానాల్లో పోటీ చేసి రెండు స్థానాల్లో గెలుచుకుంది. 2026 అసెంబ్లీ ఎన్నికలు తిరుమావళవన్ నేతృత్వంలోని వీసీకే రాజకీయ ప్రయాణంలో కొత్త దశకు నాంది పలికాయి. తిరుమావళవన్ కృషి ఎన్నికల తర్వాత దాని ప్రాధాన్యం మరింత పెరిగింది. తమిళనాడులో హంగ్ రావడంతో ప్రభుత్వం ఏర్పాటు వేళ వీసీకే కీలక పాత్ర పోషిస్తోంది. -
అడుగు దూరంలో TVK విజయ్.. బిగ్ ట్వీస్ట్.. తమిళనాడు సీఎంగా VCK ఎమ్మెల్యే
-
CM విజయ్ 121 చేరిన TVK బలం..
-
తొలగిన అడ్డంకులు విజయ్ కు సంపూర్ణ మద్దతు
-
విజయకి మరో షాక్.. చివరి నిమిషంలో మెలిక పెట్టిన VCK
-
టెన్షన్ టెన్షన్ విజయ్ కు VCK మద్దతు!
-
టీవీకే పార్టీకి వీసీకే సంపూర్ణ మద్దతు
చెన్నై: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డంకులు తొలిగాయి. టీవీకేకు వీసీకే సంపూర్ణ మద్దతు ప్రకటించింది. వీసీకే నుంచి మద్దతు లేఖ టీవీకే బృందం అందుకుంది. వీసీకే మద్దతుతో టీవీకే బలం 118కి చేరింది. ఐయూఎంఎల్ కూడా మద్దతు ఇవ్వడంతో విజయ్‌కు ఎమ్మెల్యేల మద్దతు పెరిగింది. 121కి టీవీకే బలం చేరింది. ఇప్పటికే టీవీకేకు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు మద్దతు ఇచ్చాయి.మరోసారి గవర్నర్ అపాయింట్మెంట్ను విజయ్ కోరారు. ఎమ్మెల్యేల మద్దతు లేఖను గవర్నర్‌కు అందజేశారు. వీసీకే చీఫ్‌కు డిప్యూటీ సీఎం పదవి, పార్టీ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వనున్నట్లు సమాచారం.కాగా, తమిళనాడు రాజకీయాలు గత నాలుగు రోజులుగా సస్పెన్స్ థ్రిల్లర్‌ని తలపించాయి. నరాలు తెగే ట్విస్టులు చోటు చేసుకున్నాయి. ప్రమాణ స్వీకారానికి విజయ్ సిద్ధమయ్యారన్న సంకేతాలు టీవీకే వర్గాల్లో జోష్‌ను నింపి సంబరాల్లో ముంచెత్తాయి. అదే సమయంలో మద్దతు ఇచ్చామని చెప్పి, తర్వాత యూ టర్న్ తీసుకున్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్), విడుదలై చిరుతైగళ్ కట్చి(వీసీకే) రూపంలో దళపతి విజయ్‌కు పెద్ద షాక్ తప్పలేదు.సీపీఎం, సీపీఐలు బయటి నుంచి మద్దతు ఇస్తూ అధికారికంగా లేఖలు ఇవ్వగా, ఐయూఎంఎల్, వీసీకే మాత్రం ఇంకా లేఖలు ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారాయి. తెరవెనుక బేరసారాల కోసమే మద్దతు విషయంలో వీసీకే తన అభిప్రాయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇవాళ(శనివారం) వీసీకేతో పాటు ఐయూఎంఎల్ కూడా మద్దతు ఇచ్చింది. దీంతో టీవీకే విజయ్‌కు ఎమ్మెల్యేల మద్దతు పెరిగింది. 121కి టీవీకే బలం చేరింది. -
టీవీకే సర్కార్ ఏర్పాటుపై ట్విస్ట్.. పళనిస్వామి సంచలన పోస్ట్
చెన్నై: తమిళనాడు రాజకీయాలు సస్పెన్స్ థ్రిల్లర్‌ని తలపిస్తున్నాయి. ఇప్పటికి మద్దతు లెక్కలు తేలలేదు. విజయ్ ప్రమాణ స్వీకారంపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే నేత పళనిస్వామి పోస్ట్ వైరల్‌గా మారింది. ఆ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ.. పళనిస్వామి కీలక పోస్ట్‌తో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీకి అభినందనలు అంటూ ఎడప్పాడి పళనిస్వామి ట్వీట్ చేశారు. దీంతో విజయ్‌తో వీసీకే పొత్తు ఖాయమైందంటూ ప్రచారం జరుగుతోంది.తమిళనాడు ఎన్నికల తర్వాత ప్రతిష్టంభన ఒక కొలిక్కి వస్తున్నట్లు కనిపిస్తున్న తరుణంలో పళనిస్వామి వ్యూహాత్మక పోస్ట్ కొత్త చర్చకు దారితీసింది. తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి విజయ్‌కు అవసరమైన మద్దతు లభించిందా? అనే కోణంలో రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. ఏ పార్టీ పేరునూ నేరుగా ప్రస్తావించకుండానే.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న పార్టీకి పళనిస్వామి అభినందనలు తెలిపారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తమిళ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారాయి.మొత్తం 234 స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో మెజారిటీ మార్కు 118. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 107 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, స్పష్టమైన మెజారిటీకి కొద్దిగా దూరంలో నిలిచింది. ఈ ఉత్కంఠభరిత వాతావరణంలో ఈపీఎస్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను నివారించడానికి.. అలాగే బీజేపీ పరోక్ష జోక్యాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్, సీపీఐ, CPI(M) పార్టీలు ఇప్పటికే విజయ్‌కు మద్దతు ప్రకటించాయి. ఇప్పుడు అందరి దృష్టి తోల్ తిరుమావళవన్ నేతృత్వంలోని వీసీకే (విడుతలై చిరుతైగల్ కట్చి) పార్టీపై పడింది. ఆ పార్టీ తీసుకునే నిర్ణయమే విజయ్ మెజారిటీ మార్కును దాటడానికి అత్యంత కీలకం కానుంది.తెరవెనుక విజయ్‌కు అవసరమైన పూర్తి మద్దతు లభించిందనే బలమైన నమ్మకం విపక్ష కూటమిలో వ్యక్తమవుతోందని.. అందుకే పళనిస్వామి ఈ తరహా వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత రెండు రోజులుగా తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటుపై తీవ్ర సస్పెన్స్ కొనసాగుతోంది. వీసీకే పార్టీ తన తుది నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. -
తమిళనాడులో హై డ్రామా VCK చీఫ్ తో విజయ్ కీలక భేటీ
-
విజయ్ కు బ్రేక్! చావుదెబ్బ కొట్టిన VCK
-
VCK ఓకే అంటే నేడే దళపతి ప్రమాణం!
-
తమిళనాట మరో ట్విస్టు
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి నరాలు తెగే ట్విస్టులు చోటు చేసుకున్నాయి. జోసెఫ్ విజయ్ అనే నేనూ.. అంటూ శనివారం ప్రమాణ స్వీకారానికి విజయ్ సిద్ధమయ్యారన్న సంకేతాలు టీవీకే వర్గాల్లో జోష్‌ను నింపి సంబరాల్లో ముంచెత్తాయి. అదే సమయంలో మద్దతు ఇచ్చామని చెప్పి, తర్వాత యూ టర్న్ తీసుకున్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్), విడుదలై చిరుతైగళ్ కట్చి(వీసీకే) రూపంలో దళపతి విజయ్‌కు పెద్ద షాక్ తప్పలేదు.సీపీఎం, సీపీఐలు బయటి నుంచి మద్దతు ఇస్తూ అధికారికంగా లేఖలు ఇవ్వగా, ఐయూఎంఎల్, వీసీకే మాత్రం ఇంకా లేఖలు ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. తెరవెనుక బేరసారాల కోసమే మద్దతు విషయంలో వీసీకే తన అభిప్రాయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ 108 మంది ఎమ్మెల్యేలను(విజయ్ రెండు చోట్ల నెగ్గారు) గెల్చుకున్న సంగతి తెలిసిందే.మరో 10 మంది మద్దతు సంపాదించాల్సి ఉండగా, విజయ్ పార్టీకి అండగా నిలుస్తామని సీపీఐ(2), సీపీఎం(2), కాంగ్రెస్(5) ప్రకటించాయి. మొదట వీసీకే(2) నుంచి సానుకూల స్పందన రావడంతో మొత్తం బలం 118కి చేరింది. దాంతో ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ సిద్ధమయ్యారు. శుక్రవారం రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను కలిశారు. తమకు ప్రస్తుతం 116 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, మరో ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు లేఖలను పంపిస్తామని తెలియజేశారు. దాంతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలంటూ విజయ్‌ని గవర్నర్ ఆహ్వనించినట్లు వార్తలు వచ్చాయి.అయితే, విజయ్‌కి మద్దతు విషయంలో వీసీకే శుక్రవారం అర్ధరాత్రి దాకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మద్దతు లేఖ ఇవ్వలేదు. ఆ పార్టీ శనివారం తన తుది నిర్ణయాన్ని వెల్లడించనున్నట్లు సమాచారం. ఒకవేళ విజయ్‌కి మద్దతుగా ప్రకటన చేస్తే శనివారమే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. గవర్నర్‌తో భేటీ తర్వాత విజయ్ చెన్నైలో సీపీఎం, సీపీఐ కార్యాలయాలకు వెళ్లారు. ఆయా పార్టీల నేతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. వామపక్షాల ఆఫీసులను విజయ్ సందర్శించడం ఇదే మొదటిసారి. కాంగ్రెస్‌కు ఐదుగురు ఎమ్మెల్యేలు ఉండగా, వారిలో నలుగురు శుక్రవారం రాత్రి బెంగళూరుకు చేరుకోవడం గమనార్హం. వీసీకే నాలుగు డిమాండ్లు నూతన ప్రభుత్వంలో తమకు తప్పనిసరిగా భాగస్వామ్యం కావాలని వీసీకే సీనియర్ నేత వన్నియరసు పట్టుబట్టారు. ఆ పార్టీ నాలుగు డిమాండ్లు పెట్టినట్లు సమాచారం. ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు ఒక కేబినెట్ మంత్రిపదవి ఇవ్వాలని, ఎస్సీల సంక్షేమం కోసం చట్టం తీసుకురావాలని, రెండు చోట్ల గెల్చిన విజయ్ ఒకచోట రాజీనామా చేసిన పక్షంలో అక్కడి నుంచి వీసీకే అధినేత తిరుమావళవన్ పోటీ చేయడానికి అవకాశం కల్పించాలని తేల్చిచెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే, ఏదైనా కీలక శాఖ ఇచ్చేందుకు టీవీకే నాయకత్వం సుముఖంగా ఉన్నట్లు సమాచారం. వీసీకే అధినేత తిరుమావళవన్ డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో భేటీ నిమిత్తం ఆయన నివాసానికి వెళ్లడంతో కొత్త చర్చను తెరమీదకు వచ్చింది.మరోవైపు విజయ్ పార్టీకి బయటి నుంచే మద్దతు ఇస్తామని, ప్రభుత్వంలో చేరే ఉద్దేశం లేదని సీపీఎం, సీపీఐ ప్రకటించాయి. డీఎంకేతో ప్రయాణం కొనసాగిస్తామని వెల్లడించాయి. బీజేపీ దొడ్డిదారిన తమిళనాడులోకి అడుగుపెట్టకుండా నిరోధించడానికే టీవీకేకు బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు కమ్యూనిస్ట్ నేతలు స్పష్టంచేశారు. పది రోజుల్లోగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ఇదిలా ఉండగా, ఐయూఎంఎల్ మద్దతును సైతం కూడగట్టేందుకు టీవీకే నేతలు ప్రయత్నించగా సానుకూల ఫలితం రాలేదు. తాము మొదటి నుంచీ డీఎంకేతోనే ఉన్నామని, వారితో చర్చించకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని ఐయూఎంఎల్ తేల్చిచెప్పింది. దినకరన్ కొత్త ఎత్తుగడ ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి దినకరన్ గవర్నర్ ఆర్లేకర్‌ను శుక్రవారం రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో కలవడం కొత్త చర్చకు దారితీసింది. తన పార్టీ నుంచి గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే కామరాజర్ టీవీకేకు మద్దతు ఇచి్చనట్టుగా, ఆయన ప్రస్తుతం కనిపించకుండా పోవడం బట్టి చూస్తే తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు బేరాలు సాగుతున్నాయని గవర్నర్‌కు వివరించారు. విజయ్ పదవీ కాంక్షతో ఉన్నారని, తమ ఎమ్మెల్యే అమ్ముడుపోయాడని అనుమానం వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళని స్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వనించాలని దినకరన్ కోరడం గమనార్హం. పళని స్వామికి సంపూర్ణ మెజారిటీ ఉందని తెలిపారు. విజయ్ ప్రమాణ స్వీకారం సందిగ్ధంలో పడింది. ఈ నేపథ్యంలో టీవీకే శ్రేణులు, అభిమానులు చెన్నైకి రావొద్దని టీవీకే కార్యాలయం నుంచి శుక్రవారం రాత్రి ఎస్ఎంఎస్లు వెళ్లాయి. నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి చేపట్టిన ఏర్పాట్లను నిలిపివేశారు. -
తమిళనాడులో సంచలనం.. సీఎం అభ్యర్థిగా కొత్త పేరు..?
సాక్షి, చెన్నై: ప్రస్తుతం ఏ నోట చూసినా తమిళనాడు రాజకీయాల చర్చే.. ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తాడా లేదా అనేదే ఇప్పుడు అందరినీ వేదిస్తున్న ప్రశ్న.. తంబీల రాజకీయాలు ఇంత వేడిగా ఉన్న సమయంలో ఇప్పుడు మరోక ఆసక్తికర ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. ప్రస్తుత గందరగోళ పరిస్థితుల దృష్యా వీసీకే చీఫ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదించాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది.తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల వేళ వీసీకే ప్రధాన కార్యదర్శి చింతనై సెల్వన్ సంచలన ప్రతిపాదన తెరమీదకి తెచ్చారు." ప్రస్తుత అనిశ్చిత రాజకీయ స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలు కలిసి వీసీకే అధినేత థోల్ తిరుమావళవన్ పేరును ముఖ్యమంత్రిగా ప్రతిపాదించాలి" అని ఇరు పార్టీలను ఎక్స్ వేదికగా కోరారు. కేవలం అభిమానుల బలంపై ఆధారపడిన పాపులరిజం వల్ల రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని సెల్వన్ ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే అనుభవం ఉన్న, అవినీతి మరక లేని తిరుమావళవన్ వంటి నాయకుడిని ముఖ్యమంత్రిని చేయడం ద్వారా రాజకీయ స్థిరత్వం వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే కాదని, ప్రజల్లో ఉన్న బలమైన భావన అని పేర్కొన్నారు.ఒకవేళ ప్రజలు నిజంగా మార్పు కోరుకుంటే, అది కొత్తగా వచ్చిన తారల ద్వారా కాకుండా, ప్రజల కోసం ఎప్పటి నుంచో పోరాడుతున్న తిరుమావళవన్ ద్వారానే సాధ్యమని ఆయన అన్నారు.కాగా ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల్లో సినీ స్టార్ విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి 108 స్థానాలు వచ్చాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన సాధారణ మెజారిటీకి మరో 10 సీట్ల దూరంలో ఆయన నిలిచిపోయారు. దీంతో మిగతా ఎమ్మెల్యేల మద్దతు కోసం ఇప్పుడు ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. కాగా వీసీకే పార్టీ డీఎంకే కూటమిలో భాగంగా ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ పార్టీకి ఎన్నికల్లో 2 స్థానాలు వచ్చాయి. -
VCK నిర్ణయంపై స్టాలిన్ ఆగ్రహం
-
రౌడీషిటర్‌తో కౌన్సిలర్ వివాహేతర సంబంధం
తమిళనాడు: వీసీకే మహిళా కౌన్సిలర్ దారుణ హత్యకు గురైంది. రౌడీషిటర్‌తో ఇన్‌స్ట్రాగామ్‌లో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీయడంతో భర్త, పిల్లలను వదిలి రౌడీషిటర్‌తో సహజీవనం కొనసాగించడానికి సిద్ధమైన మహిళా కౌన్సిలర్‌ను భర్త దారుణంగా హతమా ర్చాడు. తిరువళ్లూరు జిల్లా తిరునిండ్రవూర్ పెద్దకాలనీకి చెందిన కోమది(28) తిరునిండ్రవూర్ 26వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్‌గా పని చేస్తున్నారు. ఈమె భర్త స్టీఫెన్‌రాజ్(38) తిరునిండ్రవూర్ పట్టణ వీసీకే కార్యదర్శిగా కొనసాగు తున్నారు. వీరిద్దరు 2015లో ప్రేమవివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె, ముగ్గురు కుమారులు. కాగా స్టీఫెన్‌రాజ్, భార్య కోమది, అతని సోదరుడు అజిత్, తల్లిదండ్రులు ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో కోమదికి తిరునిండ్రవూర్ రామదాస్పురం ప్రాంతానికి చెందిన రౌడీషిటర్ మోసస్దేవతో ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే రెండు నెలల క్రితం మోసస్‌దేవాతో కోమది సన్నిహితంగా ఉన్న ఫొటోలను అజిత్ సెల్‌ఫోన్‌కు పంపినట్టు తెలిసింది. అప్పటి నుంచి ఇంట్లో గొడవలు మొదలయ్యా యి. ఈ విషయమై కోమదిని భర్త స్టీఫెన్‌రాజ్ ప లుమార్లు మందలించినా మరింత సన్నిహితంగా ఉండడం ప్రారంభించింది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఇంట్లో నుంచి ఆటోలో కోమ ది బయలుదేరింది. అజిత్, స్టీఫెన్‌రాజ్ ఆమెను వెంబడించారు. కోమది ఆవడి సమీపంలోని నడుకుత్తగై ప్రాంతంలో మోసస్‌దేవాతో సన్నిహితంగా ఉన్నట్టు స్టీఫెన్‌రాజ్ గుర్తించి ఆగ్రహించి కత్తితో కోమదిని దారుణంగా నరికి పరారయ్యారు. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఇది చూసి రౌడీ షీటర్ పరారయ్యాడు. విషయం తెలిసి అసిస్టెంట్ కమిషనర్ గిరి, పోలీసులు మృతదేహాన్ని ప్రభు త్వాస్పత్రికి తరలించారు. స్టీఫెన్‌రాజ్, అజిత్, తల్లిని పోలీసులు అరెస్టు చేశారు. -
ప్లాన్ ప్రకారమే దాడి చేశారు- తమిళనాడు ఎంపీ
-
‘మా’ కూటమి
సాక్షి, చెన్నై: వీసీకే, సీపీఐ, కాంగ్రెస్‌లు కలసి కట్టుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయని టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ అన్నారు. ఒకే కూటమిగా అవతరించాల్సిన అవశ్యం కూడా ఉందన్నారు. ఇందుకు అద్దం పట్టే విధంగా వీసీకే, సీపీఐ నేతలు సైతం వ్యాఖ్యానించడం బట్టి చూస్తే, త్వరలో కొత్త కూటమి ఆవిర్భవించే అవకాశాలు కన్పిస్తున్నాయి. రాష్ట్రంలో అత్యంత బలహీనంగా ఉన్న పార్టీ కాంగ్రెస్. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీని డీఎంకే అక్కున చేర్చుకుంటుందా..? అన్న ప్రశ్న బయలు దేరింది. ఈ సమయంలో ఒకరు తమను అక్కున చేర్చుకోవడం ఏమిటీ...? తామే కూటమి ఏర్పాటు చేస్తామన్నట్టుగా టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ ప్రయత్నాల్లో పడ్డారు. ఇందుకు అద్దం పట్టే విధంగా డీఎంకేకు దూరంగా ఉన్న వాళ్లను అక్కున చేర్చుకునేందుకు సిద్ధం అయ్యారు. ఇందులో భాగంగా శుక్రవా రం సత్యమూర్తి భవన్లో జరిగిన ఓ వేడుకకు డీఎంకేకు దూరంగా ఉన్న వీసీకే నేత తిరుమావళవన్, సీపీఐ నాయకుడు సుబ్బరాయన్లను ఆహ్వానించారు. నేతలందరూ ఒకే వేదిక మీదకు రావడంతో ఆ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేశారన్న విషయం పక్కన పెట్టినా, నాయకులు రాజకీయాల్ని అందుకున్న కొత్త కూటమి ఆవిర్భావం లక్ష్యంగా వ్యాఖ్యలు చేయడం విశేషం. మా కూటమి: ఇక్కడ ఒకే వేదిక మీదకు సీపీఐ, వీసీకేలు , కాంగ్రెస్ రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఈవీకేఎస్ ఇళంగోవన్ వ్యాఖ్యానించారు. ఇక, 2004 ఎన్నికల పురాణం అందుకున్నారు. ఆ ఎన్నికల్లో వామపక్షాలు కాంగ్రెస్‌తో కలసి ఎన్నికల్ని ఎదుర్కొన్నాయని గుర్తు చేస్తూ, అధికార పగ్గాలు చేపట్టగానే ప్రజా సంక్షేమాన్ని కాంక్షించడం జరిగిందని గతాన్ని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు అదే కూటమి ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలోని అవినీతి పాలకులకు, పార్టీలకు చరమ గీతం పడాలంటే, ఒకే వేదిక మీదుగా కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. వీసీకే నేత తిరుమావళవన్ ప్రసంగిస్తూ, కాంగ్రెస్, వీసీకే మధ్య భేదాభిప్రాయాలు అనేక విషయాల్లో ఉన్నాయని వివరించారు. అయితే, వాటన్నింటిని ఇప్పుడు మళ్లీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ హయాంలో మైనారిటీలకు పూర్తి భద్రత ఉండేదని, అయితే, ఇప్పుడు ఆ భద్రత కరువైందన్నారు. రాజకీయ స్వలాభం కోసం కాకుండా, ప్రజా సంక్షేమాన్ని, మైనారిటీల భద్రతను కాంక్షించే విధంగా కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌తో పాటుగా అందరూ కలసి బీజేపీ పాలకులకు చరమ గీతం పడాల్సిన అవసరం ఉందని పిలుపు నివ్వడం గమనార్హం. ఇదే వ్యాఖ్యను సమర్థిస్తూ సీపీఐ నేత సుబ్బరాయన్ స్పందించడం విశేషం.


