Vedagiri RAMBABU
-
సీనియర్ జర్నలిస్ట్ వేదగిరి రాంబాబు కన్నుమూత
-
తెలుగు భాష పరిరక్షణకు కృషి
► సాహితీవేత్త డాక్టర్ వేదగిరి రాంబాబు విశాఖ–కల్చరల్ : తెలుగు భాష పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ వేదగిరి రాంబాబు పిలుపునిచ్చారు. గురుద్వార్ జంక్షన్ సమీప శాంతినగర్‌లోని పరవస్తు పద్య పీఠం కార్యాలయంలో ఆదివారం ‘తెలుగు భాష–రక్షణ’ అనే అంశంపై ఆయన ముఖ్య ప్రసంగం చేశారు. చాలా మందికి తెలుగు మాధ్యమాల్లో చదివితే మంచి ఉద్యోగాలు రావన్న అపోహ ఉందన్నారు. మాతృభాషలో పట్టు సాధిస్తే ఎన్ని భాషలైనా సులువుగా నేర్చుకోవచ్చని చెప్పారు. కమ్మనైన అమ్మభాషను మనమే చులకన చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాచీన హోదా కోసం పట్టుబట్టిన మనమే.. అది దక్కాక బోధన భాషగా కూడా పనికి రాదనడంలో అర్ధముందా? అని ప్రశ్నించారు. తెలుగు వైభవాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటేందుకు భాగస్వామ్యులై ఉద్యమించాలన్నారు. విజయ్ నిర్మాణ్ కంపెనీ అధినేతి డాక్టర్ సూరపనేని విజయకుమార్ మాట్లాడుతూ తెలుగు సంస్కృతి సంప్రదాయాలు, కళల పరిరక్షణ, అధ్యయనమే ధ్యేయంగా తెలుగు భాష ఖ్యాతిని ఇనుముడింపజేయాలన్న లక్ష్యంతో నిఘంటువును రూపొందిస్తున్నామన్నారు. ముందుగా తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పీఠం అధ్యక్షుడు సూరి, తదితరులు పాల్గొన్నారు. -
గిడుగు నిజంగా పిడుగే!
జీవితమంటే చాలా మందికి ఆరాటం. చాలా కొద్ది మందికే పోరాటం! ఆ పోరాటం కూడా బతుకుదె రువు కోసమో, కీర్తి ప్రతిష్టల కోసమో కానే కాదు - పుట్టి పెరిగిన సమాజానికి ఏ మేలు ఎలా చేయాల న్నదే ఆ పోరాటం వెనుక ఆరాటం! ఆయన ఆరాట మంతా ఆంధ్ర ప్రజల కోసం, వాళ్ల భాష ఎలా ఉం డాలన్న ఆలోచనతో వాడుక భాషకు పట్టం కట్టడం కోసమే! అందుకే జీవితాంతం గిడుగు పిడుగులా విజృంభించాడు. 1863, ఆగస్టు 29న శ్రీకాకుళం జిల్లాలో శ్రీము ఖలింగ క్షేత్రానికి రెండు మైళ్ల దూరంలో ఉన్న పర్వ తాలపేట గ్రామంలో వీరరాజు, వెంకాయమ్మ దంప తులకు జన్మించారు గిడుగు వేంకటరామమూర్తి. విజయనగరం మహారాజా కళాశాలలో లోయర్ ఫోర్త్‌లో చేరారు. లోయర్ ఫోర్త్, అప్పర్ ఫిఫ్త్ మెట్రి క్యులేషన్ వరకు అక్కడే చదివారు. తండ్రి చనిపోవ డంతో మెట్రిక్యులేషన్లో ఉత్తీర్ణుడు కాగానే సంపా దన కోసం ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. పెళ్లయి ఉద్యోగం చేస్తున్నా, కష్టపడి ప్రైవేటుగా చదివి, ఇం టర్ పాసయ్యారు. తర్వాత 1890లో గిడుగు బీఏ చరిత్ర విభాగంలో మొత్తం యూనివర్సిటీలో రెండో రాంక్‌తో పాసై ఉపాధ్యాయుడు కాస్తా లెక్చరయ్యా రు. పర్లాకిమిడి రాజా వారి పాఠశాల కాలేజీలోనే డిగ్రీ పూర్తి చేసుకుని లెక్చ రర్ అయ్యారు. జీవన పర్యంతం ఆయ న మూఢనమ్మకాలను, దురాచారాల్ని తీవ్రంగా ఖండిస్తూ వచ్చారు. ఎవరూ వెళ్లకపోతే హరిజన పాఠశాలలకు స్వ యంగా పాఠాలు చెప్పేవారు. గిరిజన సాహిత్యాన్ని మొదటిసారిగా సేకరిం చిన ఘనత గిడుగుదే. సవరలకు నిఘంటువులను, మాన్యువల్‌ని రాశారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గిడుగు మొట్టమొదటి భాషా శాస్త్రవేత్త. మొదట్లో వ్యావహారిక భాషావా దాన్ని గురజాడ, ఏట్స్, శ్రీనివాసయ్యంగార్ లాంటి వాళ్లతో కలసి చేశారు. గురజాడ మరణించిన తర్వా త దాదాపు పాతికేళ్లు ఒంటరి పోరాటం చేశారు. ఆ రోజుల్లో ఆయన కుమారుడు సీతాపతే ఆయనకి అం డగా నిలిచాడు. వ్యావహారిక భాషలోనే గ్రంథ రచ న, బోధనా భాషగా కూడా వ్యావహారిక భాషే ఉం డాలని ఉద్యమ రీతిలో ఆయన సాగిపోతున్నప్పుడు రాజమండ్రిలో ఓ సభలో గ్రాంథికవాదు లు బాగా గొడవచేశారట. ‘‘మీరెంతగా గోల చేసినా నాకు వినిపించదు. నేను చెప్పదలచుకున్నది చెప్పకమానను’’ అన్నారట కరాఖండిగా. తొలినుంచీ పర్లాకిమిడి రాజాతో సత్సంబంధాలు న్న గిడుగు- పర్లాకిమిడితోబాటు మరో వంద గ్రామాల్ని కొత్తగా ఏర్పడే ఒడిశా రాష్ట్రంలో కలపాలని ప్రయత్నిస్తున్న రాజా చర్యలను వ్యతిరేకించారు. దీంతో గిడుగు ఆయనకు శత్రువ య్యారు. గిడుగును రాజా నానా విధాలా హింసించ సాగాడు. అయినా గిడుగు పట్టువిడవలేదు. న్యాయ పరంగా కూడా రాజాతో పోరాడాడు. ఆఖరికి పర్లా కిమిడి ఒడిశాలో కలవకుండా కాపాడలేకపోయాడు. మహేంద్ర తనయ నదికి ఇవతలున్న గ్రామాలు కొన్నింటిని మాత్రం కొత్త రాష్ట్రంలో కలవకుండా కాపాడగలిగాడు. అంతకుముందు కంబైన్డ్ మద్రాస్ స్టేట్‌లో రెండో పౌరులుగా ఉన్న ఆంధ్రులు, మళ్లీ ఒడిశాలో కలసి ద్వితీయస్థాయి పౌరులుగానే ఉం డాలా? అన్నది ఆయన బాధ. పర్లాకిమిడి ఒడిశాలో కలిసే రోజు ఉదయమే ఆయన నదిలో తర్పణాలు విడిచి ‘పర రాష్ట్రంలో ఉన్న ఆ ప్రాంతానికి మళ్లీ రానని’’ రాజమండ్రి వచ్చేశారు. గిడుగు అక్కడ నుంచే వ్యావహారిక భాషా వా దాన్ని ప్రచారం చేయసాగారు. ఒంట్లో బాగుండక పోవడంతో చెన్నై తీసుకువెళ్లారు పిల్లలు. అక్కడే ఆయన క్యాన్సర్‌తో 1940 జనవరి 22వ తేదీన మద్రాస్‌లో కుమారుడు సీతాపతి గారింట్లో కన్ను మూశారు. సవరలకు గిడుగు చేసిన సేవల్ని ప్రభు త్వం గుర్తించి కైజర్-ఇ-హింద్ బంగారు పతకంతో సత్కరించింది. 1919లో రావు సాహెబ్ బిరుదు నిచ్చి గౌరవించింది. ఇటీవల ఆయన సాహిత్య సర్వ స్వ ప్రచురణ జరిగింది. సవర డిక్షనరీలు, మాన్యు వల్ సంపుటి రావాలి. లేకపోతే అవి జీర్ణమై కాలగ ర్భంలో కలసిపోయే ప్రమాదముంది. మెమోరియల్ స్టాంప్‌ని ప్రభుత్వం తేవాలి. అప్పుడే ఆయనకు పూర్తి నివాళులర్పించినట్టు! (ఆగస్టు 29న గిడుగు రామమూర్తి 152వ జయంతి సందర్భంగా) డా॥వేదగిరి రాంబాబు, రచయిత మొబైల్: 93913 43916. -
మాతృభాషను శ్వాసించిన మాననీయుడు!!
సందర్భం మాతృమూర్తి మీద ఎం త ప్రేమ ఉందో, మాతృ భాష మీద అంతే ప్రేమ ఉండేది శ్రీపాద సుబ్రహ్మ ణ్యశాస్త్రిగారికి. తన రచన ల ద్వారా స్త్రీలలో ఆలోచ నాశక్తిని పెంపొందించాల నే ఉద్దేశంతో మధ్యతరగ తి ఆడవాళ్లు ఇళ్లలో మాట్లా డుకునే భాషనే, తన రచనా భాషగా ఎంచుకున్నారా యన. హిందీని వ్యతిరేకించడంలో ఉద్దేశం ఆ భాష మీద కోపం కాదు. ఆ భాష వల్ల తెలుగుకి అపకారం జరుగుతోందనే! తమ ప్రబుద్ధాంధ్ర పద్యరచనలు పంపించవద్దన్నది వాటి మీద కోపంతో కాదు! వచ న రచనైతే ఎక్కువ మందికి చేరుతుందనే అభి లాషతో! సంస్కృతాంధ్రాలు తప్ప ఆయనకి పాశ్చా త్య భాషలతో సంబంధం లేకపోవడం మన అదృ ష్టం. అందుకే చక్కటి, చిక్కటి తెలుగు సాహిత్యాన్ని అందించారు. ‘తెలుగువాళ్లకు మాత్రమే శ్రీపాద రచనలు చదివే అదృష్టం’ ఉంది అన్నారు మల్లాది రామకృష్ణశాస్త్రి. తెలుగు ఆప్యాయతలు తెలుసుకోవా లన్నా ఆయన రచనలే ఆధారాలు అన్నారు. ‘కొత్త చూపు’ చిన్న కథ నిజంగా మనకు కొత్త చూపును కలిగిస్తుంది. ఆ కథలో మగపెళ్లివారు ఆడ పెళ్లివారిని రకరకాల కోరికలు కోరుతారు. ఆడపెళ్లి వారు అన్నింటికీ అంగీకరిస్తారు. అప్పు డు పెళ్లికూతురు అన్నపూర్ణ ఏమని ప్రశ్నిస్తుందంటే, ‘నాకు జవాబు చెప్పం డి. ఉత్తర భారత భూముల్లో మన వాళ్లెందరికో అలాంటిది తటస్థపడుతోంది. తెలుగు స్త్రీలకిది చావుబతుకుల సమస్య. మేమిది చూసీ చూడకుండా విడిచి పెట్టడానికి వల్లకాదు. మరి మీ కళ్ల ఎదుట మీఆత్మీయులకున్నూ అలాంటిదే తట స్థపడితే, తరవాత మాట ఏదయినా ముందు కళ్లు మూసుకుని శత్రువుల మీద పడగలరా?’ అంతేకాదు, అన్నపూర్ణ ‘తెనుగు కన్యలం మేమి ప్పుడు చూసుకోవలిసిన సరియోగ్యత చక్కదనం కాదు. చదువూ కాదు. ఐశ్వర్యం అసలు కానేకాదు. ఇవన్నీ తెనుగు యువతిని బానిసను చేశాయి’ అంటుంది. వారు ఎంతటి స్త్రీ పక్షపాతో తెలుసుకోవ డానికి ఈ రెండు విషయాలు చాలు. ఆయనకు వీరేశలింగం పంతులు గారంటే వల్ల మాలిన అభిమానం. తన ‘అరికాళ్ల కింద మంటలు’ రచనలో కం దుకూరి సంస్కరణకు అక్షర ప్రోత్సాహ మిచ్చారు. పుట్టింటిలోని బాధల్ని భరిం చలేక ఒక వితంతువు రాత్రిపూట ఇంటి బయటికొచ్చి జట్కా అతడితో కందు కూరి ఉంటున్న తోటకు వెళ్లాలని చెబు తుంది. తల చెడిన తన కూతురుకు పంతులు గారు పునర్జన్మ ఇచ్చారన్న కృతజ్ఞతతో, అక్కడికి వెళ్లడానికి తనకేమీ ఇవ్వవద్దంటాడతను. పైగా నీకూ ఆయన దగ్గర మేలు జరుగుతుందని హామీ ఇస్తాడు. వీరేశ లింగంనే పాత్రగా చేసి రచనలు చేశారు శ్రీపాద. ‘కలుపు మొక్కలు,’ ‘జూనియర్ కాదు అల్లుడు,’ ‘జాగ్రత్తపడవలసిన ఘట్టాలు,’ ‘తులసి మొక్క’ వంటి శాస్త్రిగారి కథలు స్త్రీకి మంచి భవిష్యత్తు కోరు తూ రాసినవే. ఆయన దిగిన ఫొటోలో భార్య కూర్చు ని ఉండటం, ఆయన నిల్చుని ఉండటమే ఆయన సంస్కరణకి తార్కాణం. స్త్రీల పట్ల ఇంతటి అభిమా నం పెంచుకోవడానికి తల్లీ, భార్యే కారణం. శ్రీపాదవారికి తల్లి అంటే దేవత కంటే ఎక్కువ అభిమానం. ఎందుకంటే వైదిక విద్యను వ్యతి రేకించడంతో ఎన్నోసార్లు తండ్రి ఆగ్రహానికి గురైతే తల్లి అనేక విధాలా సహకరించి, కల్లోల సమయంలో కూడా ఆయన కవితా సాధనకి బలం చేకూర్చారు. ఇక భార్య సంగతి చెప్పనే అక్కరలేదు. జీవిత చరమాంకంలో మిత్రుడు పురిపండా వారికి ఉత్తరం రాస్తూ ‘నా భార్య నన్ను అనేక విధా లా కాపాడింది. చిన్నప్పట్నుండి దాన్ని కష్టపెట్టాను, సుఖపెట్టలేకపోయాను, ఈ అంతిమ దశలో ఇక ఆ ఊసే లేదు కదా... సాపు చేసిన నా రచనలన్నింటినీ ఏదో ఒక ధరకు అమ్మేసి నాగేశ్వరరావు గారికి బాకీ ఉన్న రూ. 4 వేల చిల్లర ఇచ్చేసి, అదనంగా ఏమన్నా మిగిలితే దానిని నా భార్యకివ్వండి. నా కుటుంబం చెట్టుకింద ఉంది..’ అంటూ బాధపడ్డారు. తెలుగు భాషా సాహిత్యాలకి ఎన్నో సేవలు అం దించిన ఆ మహనీయుడి చివరి ఘడియలు అలా గడిచాయంటే తెలుగు భాషా సాహిత్యాభిమానులం దరం తలలు వంచుకోవలసిందే! (నేడు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి 124వ జయంతి) (వ్యాసకర్త రచయిత, విమర్శకుడు మొబైల్: 9391343916) డా. వేదగిరి రాంబాబు