Vedam film
-
'నిప్పు' హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా?
దీక్షా సేత్.. ఈ పేరు చెప్తే గుర్తుపడతారో లేదో కానీ వేదం, నిప్పు, మిరపకాయ్, వాంటెడ్ సినిమాల హీరోయిన్ అంటే మాత్రం ఇట్టే గుర్తుపడతారు. కాలేజీ రోజుల్లోనే మోడలింగ్‌లో అడుగుపెట్టిందీ బ్యూటీ. హైదరాబాద్‌లో ఓ మోడలింగ్ అసైన్మెంట్ కోసం పని చేస్తున్న సమయంలో డైరెక్టర్ క్రిష్ కంట పడింది దీక్ష. వెంటనే ఆమెను వేదం సినిమాలో కేబుల్ రాజు(అల్లు అర్జున్) గర్ల్‌ఫ్రెండ్ రోల్ కోసం తీసుకున్నారు. ఆ సినిమా క్లిక్ అవ్వడంతో వెంటనే ఆమె మరో రెండు సినిమాలకు సంతకం చేసింది. అందులో మిరపకాయ్ బాక్సాఫీస్ దగ్గర బాగానే ఆడింది, కానీ అందులో దీక్షా సేత్ సైడ్ హీరోయిన్. ఇక గోపీచంద్‌తో చేసిన వాంటెడ్లో తొలిసారి కథానాయికగా నటించింది. కానీ ఆమె అంచనాలు తలకిందులు చేస్తూ వాంటెడ్ పెద్ద ఫెయిల్యూర్‌గా నిలిచిపోయింది. అలా ఆమె హీరోయిన్గా చేసిన సినిమాలేవీ పెద్దగా ఆడలేదు. దీంతో ఆమె నెమ్మదిగా టాలీవుడ్‌కు దూరమైపోయింది. ఆమె చివరగా తెలుగులో రెబల్(2012)లో, హిందీలో సాత్ కడమ్ (2016)లో నటించింది. ఆ తర్వాత సినిమాల్లో కనిపించకుండా పోయిన ఈ హీరోయిన్ సోషల్ మీడియాకు కూడా నెలల తరబడి దూరంగా ఉండేది. అప్పుడప్పుడు మాత్రమే తన ఫొటోలను పంచుకునేది. ఈ క్రమంలో దీక్ష తాజాగా పోస్ట్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇందులో బీచ్‌లో ఎంజాయ్ చేస్తోందీ హీరోయిన్. ఈ పోస్ట్ చూసిన సందీప్ కిషన్ 'సేత్ మళ్లీ వచ్చేసిందోచ్' అంటూ కామెంట్ చేశాడు. కొందరు మాత్రం దీక్ష ఇలా అయిపోయిదేంటని కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా ఆమె సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తే బాగుండు అంటున్నారు ఫ్యాన్స్. View this post on Instagram A post shared by Deeksha Seth (@deeksha721) View this post on Instagram A post shared by Deeksha Seth (@deeksha721) చదవండి: ఏడాది తిరిగేసరికి ఇల్లు అమ్మేసిన హీరో! ఆ సినిమా కోసం నాలుగేళ్లుగా గెడ్డం తీయలేదు : శరత్ కుమార్ -
వేదం నటుడు నాగయ్య మృతి
-
విషాదం: ‘వేదం’ నటుడు నాగయ్య మృతి
‘వేదం’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రముఖ నటుడు నాగయ్య మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. గుంటూరు జిల్లా దేసవరం పేటకు చెందిన నాగయ్య ‘వేదం’ సినిమాతో పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఆయన తన నటన, డైలాగ్ డెలివరితో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దీంతో ఆయనకు తెలుగులో నాగవల్లి, ఒక్కడినే, స్టూడెంట్ సార్, ఏ మాయ చేశావే, రామయ్య వస్తావయ్యా, స్పైడర్, విరంజితో పాటు పలు చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది. ఇలా ఆయన దాదాపు 30 సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు. కాగా ఇటీవల ఆయన భార్య అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ తర్వాత సినిమా ఆఫర్లు లేక ఆర్థిక ఇబ్బందుల్లో నాగయ్యకు సీఎం కేసీఆర్, మా ఆసోసియేషన్ అండగా నిలిచింది. కాగా, నాగయ్య మృతిపై మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు. 'వేదం' సినిమాలో సిరిసిల్ల రాములు పాత్రతో లక్షలాది మందిని కదిలించారన్నారు. చదవండి: మోనాల్‌తో వీడియో కాల్, వైరల్‌గా మారిన అఖిల్ కామెంట్ రామ్ చరణ్ బర్త్‌డే: మెగాస్టార్ ఎమోషనల్ వీడియో -
‘సిరిసిల్ల రాములు’కు ఆర్థిక సాయం
లక్ష రూపాయలను అందజేసిన మంత్రి కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: వేదం సినిమాలో సిరిసిల్ల రాములుగా నటించిన సినీ నటుడు నాగయ్యకు మంత్రి కె.తారకరామారావు రూ.లక్ష సాయం అందించారు. నాగయ్య అనారోగ్యంతో బాధపడుతున్నారని, అతని కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో సతమతమవుతుందని.. తన ట్వీటర్ ఖాతాకు ఒక నెటిజన్ పంపిన సమాచారానికి మంత్రి వెంటనే స్పందించారు. ప్రస్తుతం ఫిల్మ్‌నగర్‌లోని పీజేఆర్ బస్తీలో ఉంటున్న నాగయ్య(స్వస్థలం గుంటూరు జిల్లా)ను మంత్రి తన క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని రూ.లక్షను అందించారు. ప్రభుత్వ పరంగా సాయం చేయాలని సాంస్కృతిక శాఖ డెరైక్టర్‌ను ఆదేశించారు. ప్రభుత్వం వృద్ధ కళాకారులకు ఇస్తున్న రూ.1,500 పింఛన్ నాగయ్యకు కూడా వచ్చేలా చూస్తామన్నారు. నాగయ్య కుమారుడు సినీపరిశ్రమలో లైట్‌మేన్‌గా పనిచేస్తున్నందున, సినీ కళాకారులకు ఇచ్చే ఇళ్లలో అతనికి ఒకటి కేటాయిస్తామని హామీ ఇచ్చారు. వృద్ధ కళాకారుల సంక్షేమం కోసం ప్రణాళికలతో రావాలని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌కు మంత్రి సూచించారు.