vedam movie actor nagaiah
-
వేదం నటుడు నాగయ్య మృతి
-
విషాదం: ‘వేదం’ నటుడు నాగయ్య మృతి
‘వేదం’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రముఖ నటుడు నాగయ్య మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. గుంటూరు జిల్లా దేసవరం పేటకు చెందిన నాగయ్య ‘వేదం’ సినిమాతో పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఆయన తన నటన, డైలాగ్ డెలివరితో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దీంతో ఆయనకు తెలుగులో నాగవల్లి, ఒక్కడినే, స్టూడెంట్ సార్, ఏ మాయ చేశావే, రామయ్య వస్తావయ్యా, స్పైడర్, విరంజితో పాటు పలు చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది. ఇలా ఆయన దాదాపు 30 సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు. కాగా ఇటీవల ఆయన భార్య అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ తర్వాత సినిమా ఆఫర్లు లేక ఆర్థిక ఇబ్బందుల్లో నాగయ్యకు సీఎం కేసీఆర్, మా ఆసోసియేషన్ అండగా నిలిచింది. కాగా, నాగయ్య మృతిపై మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు. 'వేదం' సినిమాలో సిరిసిల్ల రాములు పాత్రతో లక్షలాది మందిని కదిలించారన్నారు. చదవండి: మోనాల్‌తో వీడియో కాల్, వైరల్‌గా మారిన అఖిల్ కామెంట్ రామ్ చరణ్ బర్త్‌డే: మెగాస్టార్ ఎమోషనల్ వీడియో -
'వేదం' నాగయ్యకు కేటీఆర్ రూ.లక్ష సాయం
హైదరాబాద్ : 'వేదం' సినిమాలో సిరిసిల్ల రాములుగా నటించిన నటుడు నాగయ్య దీనస్థితిపై పంచాయతీ, ఐటీశాఖ మంత్ర కేటీఆర్ స్పందించారు. నాగయ్యను తన నివాసానికి పిలిపించి అతనికి రూ.లక్ష చెక్కును అందించారు. కళాకారుల వృద్ధాప్య పింఛన్ కింద నెలకు నాగయ్యకు రూ.1500 అందిస్తామని కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. భవిష్యత్‌లో నాగయ్యకు ఇల్లు కూడా మంజూరు చేస్తామని ఆయన చెప్పారు. ప్రాంతమేదైనా వృద్ధ కళాకారులను ఆదుకుంటామని కేటీఆర్ తెలిపారు. దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహించిన వేదం చిత్రంలో రాములు పాత్ర ద్వారా నాగయ్య తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు. అతడికి అది తొలి చిత్రమే అయినా ఆ పాత్రలో ఒదిగిపోయి నటించాడు. నాగయ్య తన నటనకు ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత రెండు, మూడు చిత్రాల్లో నటించినా ఆ తర్వాత అవకాశాలు రాలేదు. దాంతో అటు సొంత ఊరుకు వెళ్లలేక, ఇటు సినిమా ఛాన్స్‌లు లేక చివరకు ఫిల్మ్ నగర్లో భిక్షాటన చేస్తూ కాలం గడుపుతున్నాడు. నాగయ్య దీనస్థితి గురించి తెలుసుకున్న కేటీఆర్...అతడికి ఆర్థిక సాయం అందించటంతో పాటు పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చారు.