veera sivareddy
-
వీర శివారెడ్డిని కలిసిన వైఎస్ఆర్సీపీ నేతలు
-
కిరణ్ వెంటే ఉంటా..
కిరణ్ కుమార్ రెడ్డి వెంటే తాను ఉంటానని ఎమ్మెల్యే వీరశివారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర విభజన చేసి కాంగ్రెస్ సీమాంధ్రకు ద్రోహం చేసిందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు దక్కవన్నారు. మలాపురం, : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి వెంటే తాను ఉంటానని కమలాపురం ఎమ్మెల్యే వీరశివారెడ్డి స్పష్టం చేశారు. తన కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కిరణ్ కొత్త పార్టీ పెట్టి కొత్త రక్తాన్ని తీసుకువస్తారని ఆయన అన్నారు. బీజేపీకి రాష్ట్రంలో పట్టులేని కారణంగా విభజనకు మద్దతు తెలిపిందని ఆయన మండిపడ్డారు. తప్పుడు నిర్ణయాలతోనే రాష్ట్ర విభజన చేశారని, త్వరలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించుకుంటుందన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో డిపాజిట్ కూడా రాదని ఆయన అన్నారు. టీబిల్లుకు సవరణలు చేసి ఆమోదించి ఉంటే విభజన వేరే విధంగా ఉండేదన్నారు. ప్రస్తుతం జరిగిన విభజనతో సీమాంధ్ర తీవ్రంగా నష్టపోయిందన్నారు. -
పదవుల కోసం పాకులాట ఎందుకు: వీరశివారెడ్డి
హైదరాబాద్ : రాష్ట్ర విభజనపై స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మల్యే వీరశివారెడ్డి డిమాండ్ చేశారు. విభజన జరుగుతుందని తెలిసినా సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు మిన్నకుండిపోయారని ఆయన బుధవారమిక్కడ ధ్వజమెత్తారు. ప్రజల మనోభావాలు నేతలకు పట్టవా అని ప్రశ్నించిన ఆయన రాజీనామాలు చేయకుండా పదవులు పట్టుకుని వేలాడేవారిని ప్రజలు క్షమించరని వీరశివారెడ్డి అన్నారు. నాలుగు నెలల మంత్రి పదవుల కోసం పాకులాట ఎందుకని ఆయన మండిపడ్డడారు. పనిలో పనిగా వీరశివారెడ్డి టీఆర్ఎస్ పార్టీపై శివాలెత్తారు. కేసీఆర్‌పై భౌతిక దాడి చేయాల్సిన పని రాష్ట్రంలో ఎవరికి లేదన్నారు. రాజకీయ వారసత్వం, ఆస్తుల కోసమో కేసీఆర్ కుటుంబ సభ్యుల్లో, లేక పార్టీ నేతలు హరీష్ రావు, ఈటెల రాజేందర్, కేకేలకే ఈ ఆలోచన ఉండొచ్చని ఆరోపించారు. విజయశాంతి ఇప్పటికే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారని, మరో ఎనిమిది మంది కాంగ్రెస్‌లో చేరుతారనే ఆందోళనలతోనే టీఆర్ఎస్ నేతలు కేసీఆర్‌ను హతమార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారని వీరశివరెడ్డి ఎద్దేవా చేశారు.