veeraswami
-
వికసించిన వీరస్వామి
పల్లెటూరు విద్యార్థికి విదేశంలో డాక్టరేట్ ఉన్నత చదువుకు అడ్డురాని పేదరికం తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచిన రామచంద్రాపురం వాసి రామచంద్రాపురం (దేవరుప్పుల) : అంకితభావం, క్రమశిక్షణతో చదువుకుంటే విజయతీరాలను సులువుగా చేరుకోవచ్చని నిరూపించాడు ఓ విద్యార్థి. నిరుపేద కుటుంబంలో పుట్టినప్పటికీ పట్టుదలతో విద్యనభ్యసించి పొరుగు దేశంలో డాక్టరేట్ పొంది తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచాడు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని కోలుకొండ శివారు రామచంద్రాపురంలోని వ్యవసాయ కుటుంబానికి చెందిన గాజులపాటి రామయ్య, సత్తెమ్మ దంపతుల రెండో కుమారుడు వీరస్వామి చిన్నప్పటి నుంచే చదువులో ప్రతిభ కనబరుస్తూ వస్తున్నాడు. ఈ మేరకు స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి, దేవరుప్పుల హైస్కూల్లో పదో తరగతి వరకు చదివిన ఆయన హైదరాబాద్‌లోని భాగ్యనగర్ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ, నిజాం కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు. అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ ఫిజిక్స్ చదివాడు. అయితే అప్పటికే తన అన్నయ్య కొండాజీ.. కొరియా దేశంలో ఫిజిక్స్‌లో పీహెచ్డీ పూర్తి చేసి హైదరాబాద్‌లో ఓ ల్యాబ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. దీంతో అతడిని స్ఫూర్తిగా తీసుకున్న వీరస్వామి కొరియా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్స్ అండ్ బయో టెక్నాలజీ సౌత్ కొరియాలో పీహెచ్‌డీకి దరఖాస్తు చేసుకోవడంతో సీటు లభిం చింది. ఈ క్రమంలో ఆయన ‘సింథటిక్ అండ్ బయోలజీ ఆక్టివిట్ ఆఫ్ నోవల్ న్యూక్లోయోసీడ్స్ ఆజ్ ప్రొటెన్షియల్ యాంటీ స్కేమిక్ అండ్ యాంటీ వైరల్ ఏజెంట్’ అంశంపై సమర్పించిన పరిశోధనాత్మక సిద్ధాంత గ్రంథానికి కొరియా యూనివర్సిటీ ఇటీవల డాక్టరేట్ ప్రకటించింది. కాగా, ప్రొఫెసర్ యేంగ్కోసీకో చోయ్ పర్యవేక్షణలో వీరస్వామి పరి శోధనను పూర్తి చేసి డాక్టరేట్ పట్టా పొందాడు. మారుమూల పల్లెలో ప్రాథమిక విద్యనభ్యసించి విదేశాల్లో డాక్టరేట్ పొందడంపై కుటుంబ సభ్యులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి
చెన్నారావుపేట మండలం సూరిపల్లి గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గడ్డం వీరస్వామి(58) అనే గీతకార్మికుడు ప్రమాదవశాత్తూ తాటి చెట్టుపై నుంచి మృతిచెందాడు. తాటి చెట్టు మీద కల్లు తీస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. -
ఏసీబీ వలలో విద్యుత్ ఏఈ
రైతు నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వీరాస్వామి కొయ్యలగూడెం, న్యూస్‌లైన్ : ఏసీబీ వలకు శుక్రవారం గవరవరం విద్యుత్ సబ్‌స్టేషన్ ఏఈ వీరాస్వామి చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ ఐ.వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గవరవరానికి చెందిన రైతు గారపాటి శ్రీనివాసరావు పొలంలో ఈ నెల 22న తాడిచెట్టు కొడుతుండగా అది విరిగి 11 కేవీ విద్యుత్ వైర్లపై పడింది. దీంతో విద్యుత్ స్తంభం విరిగిపోయింది. దానిని సరిచేయటం కోసం గవరవరం సబ్‌స్టేషన్ ఏఈ వీరాస్వామి రైతను రూ.25 వేలు లంచం అడిగాడు. రూ.5 వేలకు మించి ఇచ్చుకోలేనని శ్రీనివాసరావు బతిమాలినా ఏఈ పట్టు వీడలేదు. దీంతో శుక్రవారం అతను ఏలూరులోని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు ఏఈపై వల పన్నారు. వారు రైతుకు రూ.10వేలు ఇచ్చి గవరవరంలో ఏఈ చాంబర్‌కు పంపించారు. లుంగీలు ధరించిన ఏసీబీ అధికారులు సబ్‌స్టేషన్ ఎదురుగా ఉన్న బడ్డీ కొట్టులో కూర్చున్నారు. శ్రీనివాసరావు సెల్‌ఫోన్ ఆన్‌చేసి ఏఈతో మాట్లాడుతూ ఏసీబీ అధికారులు రసాయనం పూసి ఇచ్చిన రూ.10వేలు ఆయనకు ఇచ్చి లెక్క చూసుకోండి అని అన్నాడు. సెల్ ఫోన్లో వారి సంభాషణ వింటున్న ఏసీబీ అధికారులు వెంటనే సబ్‌స్టేషన్‌లోకి వచ్చారు. అప్పటికి ఏఈ చేతిలో రైతు ఇచ్చిన నోట్లు ఉన్నాయి. వాటిని ఏసీబీ అధికారలు స్వాధీనం చేసుకున్నారు. రైతు శ్రీనివాసరావు, ఏఈ వీరాస్వామిలను డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ విల్సన్ విచారించారు. అనంతరం తాడిచెట్టు పడిన ప్రదేశం వద్దకు వారిద్దరినీ తీసుకెళ్లారు. స్థానిక రైతులను కూడా వివరాలు అడిగారు. అరెస్ట్ చేసిన ఏఈ వీరాస్వామిని శనివారం విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. తనతోపాటు అనేక మంది రైతులను ఏఈ వీరాస్వామి పీడించుకు తింటున్నారని శ్రీనివాసరావు చెప్పాడు. ట్రాన్స్ఫార్మర్ల మార్పు, విద్యుత్లైన్ల వేసే విషయంలో ఆయన చాలా మంది రైతులను లంచాల కోసం పీడించారని తెలిపాడు.