vegetation
-
ఇది ప్రకృతి వైపరీత్యం
సాక్షి, హైదరాబాద్ : వాతావరణంలో అనూహ్యంగా చోటుచేసుకున్న మార్పుల చేర్పులతోపాటు అరుదైన ప్రకృతి వైపరీత్యం కారణంగా ములుగు అడవుల్లో చెట్లకు భారీగా నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వానికి అటవీశాఖ నివేదిక సమర్పించింది. దీనిని ‘ఎకోలాజికల్ డిజాస్టర్’గానే పరిగణించాల్సి ఉంటుందని ఇందులో సూచించినట్టు సమాచారం. మొత్తంగా 204 హెక్టార్లలో (500 నుంచి 600 ఎకరాల్లో) దాదాపు 70 వేల దాకా వివిధ జాతుల చెట్లకు నష్టం వాటిల్లినట్టు పేర్కొంది. అటవీ పునరుద్ధరణతోపాటు, భూసార పరిరక్షణ చర్యలు, గ్యాప్ ఏర్పడిన చోట్ల వాటిని నింపేలా పెద్దమొత్తంలో మొక్కల పెంపకం, వంటివి చేపట్టాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ ప్రాంతంలో ఇంకా అడపాదడపా వర్షాలు కురుస్తుండడంతోపాటు, కొండ ప్రాంతాలు వంటివి ఉండడంతో జరిగిన నష్టం, కూలిన చెట్ల వివరాల సేకరణ అంత వేగంగా సాగడం లేదని అటవీ అధికారులు చెబుతున్నారు.వివిధ రూపాల్లో వాటిల్లిన నష్టంపై వారంరోజుల్లో క్షేత్రస్థాయి నుంచి ఒక స్పష్టమైన అంచనాకు వచ్చాక పర్యావరణం, అడవులతో సంబంధమున్న నిపుణులతో అధ్యయనం జరిపించాలని అటవీశాఖ నిర్ణయించింది. దేశంలోనే అత్యంత అరుదైన రీతిలో ములుగు అటవీప్రాంతంలో చెట్లకు నష్టం జరిగినందున, పూర్తి సమాచారం అందిన తర్వాతే అటవీ ఉన్నతాధికారులు ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి సవివరమైన నివేదిక అందజేయనున్నట్టు విశ్వసనీయ సమాచారం. ములు గులో సుడిగాలుల బీభత్సం సమయంలోనే ఆదిలా బాద్ జిల్లా ఉట్నూరులో, ఉమ్మడి మహబూబ్‌నగర్ పరిధిలోనూ స్వల్పస్థాయిలో చెట్లకు నష్టం జరిగినట్లు అటవీ అధికారులు గుర్తించారు. ఉపగ్రహ ఛాయాచిత్రాలు వస్తేనే...హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) నుంచి ఉపగ్రహ ఛాయాచిత్రాలను సేకరించడం ద్వారా ములుగు అటవీ విధ్వంసం కారణాలు వెల్లడి కాగలవని అటవీశాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి అవసరమైన డేటాను ఉపగ్రహం నుంచి సేకరిస్తున్నామని, రెండురోజుల్లో దీనిపై వివరాలు అందజేస్తామని ఎన్ఆర్ఎస్సీ అధికారులు చెప్పారు. ఈ సమాచారాన్ని తమ ఎర్త్ అండ్ క్లైమేట్ సైన్స్ ఏరియా డివిజన్ క్రోడీకరించి అందజేస్తామని అటవీ అధికారులకు చెప్పారు. అయితే భారత వాతావరణ శాఖ (ఐఎండీ)పై అటవీ అధికారులు పెట్టుకున్న ఆశలు మాత్రం నెరవేరలేదు.ములుగు పరిసర ప్రాంతాల్లో తమ అబ్జర్వేటరీ లేనందువల్ల, ఈ బీభత్సం చోటుచేసుకున్న రోజునాటి వివరాలు ఇవ్వలేకపోతున్నామని అధికారులకు ఐఎండీ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఐఎండీనే చేతులెత్తేస్తే ఇంకా తమకు ఎవరు వాతావరణ సాంకేతిక విషయాలు అందించగలరని అటవీ అధికారులు విస్తుపో తున్నారు. క్షేత్రస్థాయిలో జరిగిన నష్టంపై ఎన్యుమరేషన్ పూర్తయి, ఎన్ఆర్ఎస్సీ నుంచి సాంకేతిక సమాచారం అందాక 2,3 రోజుల్లో ములుగు జిల్లా అటవీ అధికారులు నివేదిక సమర్పించే అవకాశాలున్నాయి. -
కార్చిచ్చు కనిపించని ఉచ్చు..!
కార్చిచ్చులు ప్రపంచ దేశాలను భయపెడుతున్నాయి. ఏడాదికేడాది కార్చిచ్చులు పెరిగిపోతున్నాయి. అడవుల్లో మంటలు చెలరేగిన క్షణాల్లోనే సమీపంలో నగరాలకు విస్తరించి దగ్ధం చేస్తున్నాయి. అమెరికాలోని హవాయి దీవుల్లో రేగిన కార్చిచ్చుతో లహైనా రిసార్ట్ నగరం ఒక బూడిద కుప్పగా మిగిలింది. అగ్రరాజ్యం ఎదుర్కొంటున్న అతి పెద్ద విపత్తుల్లో ఒకటిగా మిగిలిపోయిన ఈ కార్చిచ్చు బీభత్సంలో 80 మందికి పైగా మరణించారు. మౌయి దీవిలో లహైనా పట్టణంలో మంగళవారం రాత్రి మొదలైన కార్చిచ్చు ఇప్పటికీ రగులుతూనే ఉంది. వాతావరణం పొడిగా ఉండడంతో పాటు హరికేన్ ఏర్పడడంతో ద్వీపంలో బలమైన గాలులు వీచాయి. దీంతో శరవేగంతో మంటలు వ్యాపించి అందాల నగరాన్ని దగ్ధం చేశాయి. మొదలైతే.. అంతే ► పశ్చిమ అమెరికా, దక్షిణ ఆ్రస్టేలియాలో తరచూ కార్చిచ్చులు సంభవిస్తూ ఉంటాయి. చరిత్రలో అతి పెద్ద కార్చిచ్చులన్నీ అక్కడే వ్యాపించాయి. గత కొన్నేళ్లుగా బ్రిటన్ అత్యధికంగా కార్చిచ్చుల బారినపడుతోంది. 2019లో బ్రిటన్‌లో 135 కార్చిచ్చులు వ్యాపించి 113 చదరపు మైళ్ల అడవిని దగ్ధం చేశాయి. రష్యా, కెనడా, బ్రెజిల్ దేశాలకు కూడా కార్చిచ్చు ముప్పు అధికంగా ఉంది. ► బ్రిటన్‌లో మాంచెస్టర్‌లో 2019లో సంభవించిన కార్చిచ్చు ఏకంగా మూడు వారాల పాటు కొనసాగింది. 50 లక్షల మంది వాయు కాలు ష్యంతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. 2000 సంవత్సరంలో ఆస్ట్రేలియాలో వ్యాపించిన కార్చిచ్చు వేలాది ఇళ్లను దగ్ధం చేసింది. 300 కోట్ల జంతువులు మరణించడమో లేదంటే పారిపోవడం జరిగింది. ► అమెరికాలో కాలిఫోరి్నయాలో ఎక్కువగా కార్చిచ్చులు వ్యాపిస్తూ ఉంటాయి. 2020లో కార్చిచ్చు 4 లక్షల హెక్టార్ల అడవుల్ని మింగేసింది. 1200 భవనాలు దగ్ధమయ్యాయి. ► 2021లో ప్రపంచ దేశాల్లో కార్చిచ్చుల వల్ల 176 వందల కోట్ల మెట్రిక్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ గాల్లో కలిసింది కార్చిచ్చులతో ఏర్పడిన కాలుష్యానికి ప్రపంచంలో ఏడాదికి దాదాపుగా 34 వేల మందికి ఆయుష్షు తగ్గి ముందుగానే మరణిస్తున్నారు. ► 1918లో అమెరికాలో మిన్నెసోటాలో ఏర్పడిన కార్చిచ్చు చరిత్రలో అతి పెద్దది. ఈ కార్చిచ్చు వెయ్యి మంది ప్రాణాలను బలి తీసుకుంది. ► యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంచనాల ప్రకారం ప్రపంచంలో ఏడాదికి 40 లక్షల చదరపు కిలోమీటర్ల అడవుల్ని కోల్పోతున్నాం. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం 2030 నాటికి పెరిగిపోనున్న కార్చిచ్చులు 14% 2050 నాటికి30%, ఈ శతాబ్దం అంతానికి 50%కార్చిచ్చులు పెరుగుతాయని యూఎన్ హెచ్చరించింది. ఎందుకీ మంటలు ? ► కార్చిచ్చులు ప్రకృతి విపత్తే అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న కార్చిచ్చుల్లో 10 నుంచి 15% మాత్రమే సహజంగా ఏర్పడుతున్నాయి. వాతావరణం పొడిగా ఉండి, కరువు పరిస్థితులు ఏర్పడి, చెట్లు ఎక్కువగా ఎండిపోయి ఉన్నప్పుడు మండే ఎండలతో పాటు ఒక మెరుపు మెరిసినా కార్చిచ్చులు ఏర్పడతాయి. బలమైన గాలులు వీస్తే అవి మరింత విస్తరిస్తాయి. ► మానవ తప్పిదాల కారణంగా 85 నుంచి 90% కార్చిచ్చులు సంభవిస్తున్నాయి. అడవుల్లో ఎంజాయ్ చేయడానికి వెళ్లి క్యాంప్‌ఫైర్ వేసుకొని దానిని ఆర్పేయకుండా వదిలేయడం, సిగరెట్లు పారేయడం, విద్యుత్ స్తంభాలు వంటివి కూడా కార్చిచ్చుకి కారణమవుతున్నాయి. ► ఇందనం లేదంటే మరే మండే గుణం ఉన్న పదార్థాలు చెట్లు, పొదలు, గడ్డి దుబ్బులు ఉన్న అటవీ ప్రాంత సమీపాల్లో ఉంటే కార్చిచ్చులు ఏర్పడతాయి. 2021లో కాలిఫోరి్నయాలో చమురు కారణంగా 7,396 కార్చిచ్చులు ఏర్పడి 26 లక్షల ఎకరాల అటవీ భూమి దగ్ధమైంది. ► ప్రస్తుతం అమెరికా హవాయి ద్వీపంలో కార్చిచ్చు మెరుపు వేగంతో వ్యాపించడానికి డొరైన్ టోర్నడో వల్ల ఏర్పడిన బలమైన గాలులే కారణం. కాలిఫోర్నియాలో ఎక్కువగా కార్చిచ్చులు వ్యాపించడానికి గాలులే ప్రధా న పాత్ర పోషించాయి. అగ్గి మరింత రాజేస్తున్న వాతావరణ మార్పులు సహజసిద్ధంగా ఏర్పడే కార్చిచ్చుల వల్ల అడవుల్లో ఎండిపోయిన వృక్ష సంపద దగ్ధమై భూమి తిరిగి పోషకాలతో నిండుతుంది. మానవ నిర్లక్ష్యంతో ఏర్పడే కార్చిచ్చులు ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగులుస్తున్నాయి. ఇవాళ రేపు వాతావరణ మార్పుల కారణంగా ఏర్పడే కార్చిచ్చులు ఎక్కువైపోతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ పరిస్థితులతో వాతావరణం పొడిగా ఉండడం, ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం, కర్బన ఉద్గారాల విడుదల ఎక్కువైపోవడం వంటి వాటితో దావానలాలు పెరిగిపోతున్నాయి. 1760లో పారిశ్రామిక విప్లవం వచి్చన తర్వాత భూ ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్ పెరిగిపోయాయి. దీని ప్రభావం ప్రకృతిపై తీవ్రంగా పడింది. అటవీ ప్రాంతాల్లో తేమ తగ్గిపోవడం వల్ల కార్చిచ్చులు మరింత ఎక్కువ కాలం పాటు సంభవిస్తున్నాయి. జనాభా పెరిగిపోవడం వల్ల అటవీ ప్రాంతాలకు దగ్గరగా నివాసం ఏర్పరచుకోవడంతో కార్చిచ్చులు జనావాసాలకు పాకి భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతోంది. వాతావరణ మార్పుల కారణంగా అమెరికాలోని కాలిఫోరి్నయాలో అత్యధికంగా కార్చిచ్చులు సంభవిస్తున్నాయి. భవిష్యత్‌లో వీటి తీవ్రత మరింత పెరిగిపోయే ఛాన్స్ కూడా ఉంది. మొత్తానికి ఏ సమస్య అయినా భూమి గుండ్రంగా ఉంది అన్నట్టుగా గ్లోబల్ వారి్మంగ్ దగ్గరకే వచ్చి ఆగుతోంది. భూతాపాన్ని అరికట్టడానికి ప్రపంచ దేశాలు చిత్తశుద్ధితో పని చేస్తే కార్చిచ్చులతో పాటు ఇతర సమస్యల్ని కూడా అధిగమించవచ్చు. చరిత్రలో భారీ కార్చిచ్చులు దేశం ఏడాది దగ్ధమైన అటవీ రష్యా 2003 2.2 కోట్ల హెక్టార్లు ఆ్రస్టేలియా 2020 1.7 కోట్ల హెక్టార్లు కెనడా 2014 45 లక్షల హెక్టార్లు అమెరికా 2004 26 లక్షల హెక్టార్లు – సాక్షి, నేషనల్ డెస్క్ -
అరణ్య రోదన!
పెరిగిన బీట్లు.. అరకొర సిబ్బంది రాష్ట్ర విభజనతో రెండేళ్లుగా నిలిచిన నియామకాలు ఏజెన్సీలో అడవికి రక్షణ కరవు విశాఖ మన్యంలో అడవికి రక్షణ కరువైంది. వృక్ష సంపదను.. జంతుజాలాన్ని అనునిత్యం కంటికి రెప్పలా కాపాడే అటవీ సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. రాష్ట్ర విభజన కారణంగా రెండేళ్లుగా అటవీ సిబ్బంది నియామకం అసలు జరగడంలేదు. మరో పక్క బీట్లు పరిధి పెరిగిపోయింది. దీంతో ఉన్న సిబ్బందే ఇబ్బందులు పడుతూ విధులు నిర్వహిస్తున్నారు. సిబ్బంది పెంపు ప్రతిపాదన అరణ్య రోదనగా మిగిలింది. కొయ్యూరు: రాష్ట్ర విభజన కారణంగా పోస్టుల భర్తీ ప్రక్రియ నిలిచిపోవడంతో అటవీ శాఖకు రక్షణ లేకుండా పోయింది. 2013లో నర్సీపట్నం అటవీ డివిజన్‌కు సంబంధించి 52 బీట్లను 117కు పెంచారు. 25 సెక్షన్లను 40 వరకు చేశారు. అయితే సిబ్బందినియామకాలు మాత్రం జరగలేదు. ఫలితంగా ఎక్కువ దూరంలో విస్తరించిన బీట్లలో కాపలా కాయడం అటవీ సిబ్బందికి కష్టంగా మారింది. నర్సీపట్నం అటవీ డివిజన్లో ఐదు లక్షల హెక్లార్ల వరకు అటవీ సంపద విస్తరించి ఉంది.ఒక్కో బీట్ 15 కిలోమీటర్ల పొడవు ఉంటే సిబ్బందికి కాపలాకాయడం పెద్ద కష్టం కాదు. కానీ అదే బీట్ 40 కిలోమీటర్లు దాటి ఉంటే కాపలా అసాధ్యం. దీనిని గుర్తించి బీట్ల సంఖ్య రెట్టింపు చేశారు. ఏడు రేంజ్‌లను ఎనిమిది చేశారు. అయితే ఆ స్థాయిలో సిబ్బంది నియామకం జరగలేదు. జిల్లాలో నర్సీపట్నం అటవీ డివిజన్ విస్తీర్ణంలో చాలా పెద్దది. దీని పరిధిలో మర్రిపాకలు, కేడీపేట, నర్సీపట్నం, ఆర్వీ నగర్, చింతపల్లి, లోతుగెడ్డ, సీలేరు, పెదవలస రేంజ్‌లున్నాయి. పెదవలస రేంజ్‌ను కొత్తగా ఏర్పాటు చేశారు. అదే విధంగా బీట్లను 117కు పెంచాలని ప్రతిపాదించారు. దీనికి ఆమోదం వచ్చింది. సెక్షన్లు పెంపు కూడా ఫలించింది. పెంచిన బీట్లు, సెక్షన్లకు అదనంగా సిబ్బందిని నియమిస్తారని అంతా భావించారు. ఇటు నిరుద్యోగులు కూడా ఉద్యోగాలు వస్తాయని ఆశించారు. కానీ రాష్ట్ర విభజన జరగడంతో ప్రక్రియ ఆగిపోయింది. సిబ్బంది లేకుంటే ముప్పే ఎంత దూరంలో బీట్ పరిధి ఉన్నా దానిని కాపలాకాయాల్సి వస్తోంది. లేకుంటే కలప అక్రమంగా తరలిపోతుంది. నర్సీపట్నం అటవీ డివిజన్లో రూ.కోట్ల విలువ చేసే సంపద ఉంది. నిఘా సరిగా లేకుంటే ఆ సంపదకు ముప్పు తప్పదు. సిబ్బంది తక్కువ కారణంగా రంగురాళ్ల క్వారీలపై కూడా పూర్తిస్థాయిలో దృష్టిపెట్టలేకపోతున్నారు. అటవీ సంప ద కొన్ని ప్రాం తాల్లో తరలిపోతోంది. దానిని నిలువరించాలంటే పెంచిన బీట్ల సంఖ్యకు అనుగునంగా సిబ్బందిని నియమించాల్సి ఉంది. విభజనే కారణం రాష్ట్ర విభజన కారణంగా మొత్తం భర్తీ ప్రక్రియ నిలిచింది. లేకుంటే ఈ పాటికి అంతా పూర్తయ్యేది. బీట్ల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది. ప్రతీ చోట కూడా బీట్లను రెట్టింపు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇది అమలైతే అటవీ సంపదకు పూర్తి స్థాయిలో రక్షణ ఉంటుంది. - డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు, ట్రైనీ డీఎఫ్‌వో, కేడిపేట రేంజ్ -
అంతం కాదు.. ఆరంభమే: బొజ్జల
హైదరాబాద్: ఎర్రచందనం వృక్ష సంపదను పరిరక్షించడంలో భాగంగా చేపట్టిన చర్యల్లో మంగళవారం చోటుచేసుకున్న ఎన్కౌంటర్ ఆరంభం మాత్రమేనని అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చెప్పారు. బుధవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ శేషాచలం అడవుల్లోకి సోమవారం భారీ ఎత్తున ఎర్రచందనం స్మగ్లర్లు చొరబడ్డారన్న సమాచారంతోనే టాస్క్‌ఫోర్స్ కూంబింగ్ చేపట్టిందన్నారు. కూంబింగ్ చేస్తోన్న బలగాలపై ఎర్రచందనం స్మగ్లర్లు విచక్షణారహితంగా దాడులు చేశారని.. ఆత్మరక్షణ కోసమే పోలీసులు కాల్పులు జరిపారని వివరించారు. ఆ కాల్పుల్లో 20 మంది ఎర్రచందనం స్మగ్లర్లు మరణించారని తెలిపారు. ఎన్కౌంటర్లో చనిపోయింది స్మగ్లర్లు కాదు తమిళనాడుకు చెందిన కూలీలే కదా అన్న ప్రశ్నకు బొజ్జల స్పందిస్తూ.. కూలీలకు అర్ధరాత్రి అడవిలో ఏం పనంటూ ఎదురుదాడికి దిగారు. కూలీలైతే అర్ధరాత్రి అడవిలో గడ్డికోసుకోవడానికి వెళ్లారా అంటూ ఎద్దేవా చేశారు. గతంలో పోలీసులు అరెస్టు చేసిన కూలీలనే ఎన్కౌంటర్లో చంపేశారన్న విమర్శలు వ్యక్తమవుతోండటాన్ని విలేకరులు ఆయన దృష్టికి తీసుకెళ్లగా.. అవన్నీ ఒట్టి పుకార్లేనంటూ కొట్టిపారేశారు. స్మగ్లర్లు ఎంతటి వారైనా, రాజకీయ అండదండలున్నా వదిలి పెట్టబోమన్నారు. రాజకీయ నాయకులకు స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నాయని ఆధారాలు దొరికితే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
టేకు చెట్లు అధికంగా ఉండే అరణ్యాలు?
ఆవరణ శాస్త్రం, ఆర్థిక వ్యవస్థల దృష్ట్యా భారత దేశంలోని అతి ముఖ్యమైన సహజ వనరుల్లో అడవులు ఒకటి. విలువైన కలప, వంట చెరకు రూపంలో అడవులు ఆకర్షణీయమైన ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి. ఆర్థికంగా అనేక విధాలుగా తోడ్పడుతున్నందు వల్ల వీటిని ‘జాతీయ సంపద’గా పరిగణిస్తారు. భారతదేశ సహజ ఉద్భిజ్జ సంపద భారతదేశంలోని వృక్ష సంపదను ఉష్ణోగ్రత, వర్షపాతం, నిమ్నోన్నతాలు ప్రభావితం చేస్తున్నాయి. వీటి ఆధారంగా భారతదేశంలో అడవులను ప్రధానంగా ఐదు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి: 1. సతత హరిత అరణ్యాలు: ఇవి ఉష్ణమండల తేమతో కూడిన సతత హరిత అడవులు, అర్ధసతత హరిత అడవులు అని రెండు రకాలుగా ఉంటాయి. ఇవి 500 - 1500 మీటర్ల ఎత్తులో, 200 సెం.మీ. కంటే ఎక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో పెరుగుతాయి. పశ్చిమ కనుమల దక్షిణ భాగం (కేరళ, కర్ణాటక రాష్ట్రాలు), ఈశాన్య రాష్ట్రాలు (అసోం, మేఘాలయ, త్రిపుర, మణిపూర్, నాగాలాండ్), అండమాన్ నికోబార్ దీవులు మొదలైన ప్రాంతాల్లో ఈ రకమైన అడవులు పెరుగుతాయి. పశ్చిమ బెంగాల్, ఒడిశా మైదానాల్లోనూ కనిపిస్తాయి. ఈ వృక్షాలు చాలా దట్టంగా ఉండి 45-60 మీటర్ల ఎత్తు వరకూ పెరుగుతాయి. రోజ్‌వుడ్ (నల్ల ఇరుగుడుచేవ), నల్లతుమ్మ (్కఅఊ), అయిని, తెల్సూర్, చంపక వృక్షం, టూన్, గుర్జాన్, ఐరన్ ఉడ్, ఎబోని, సిమార్, లారిల్ మొదలైనవి ఈ అడవుల్లో పెరిగే ప్రధాన వృక్ష జాతులు. ఈ అరణ్యాల కలప చాలా గట్టిగా ఉండటం వల్ల వీటిని ‘కఠినదారు వృక్షాలు’ అంటారు. వీటిని వినియోగించడం కష్టతరమైన పని కాబట్టి వీటి వాణిజ్య విలువ చాలా తక్కువ. వీటిని ఎక్కువగా కలప, కాగితం, అగ్గిపెట్టెలు మొదలైన వాటికి ఉపయోగిస్తారు. 2. ఆకురాల్చే అడవులు: ఇవి రెండు రకాలుగా ఉంటాయి. ఎ) ఉష్ణమండల తేమతో కూడిన ఆకురాల్చే అడవులు: ఇవి 100 - 200 సెం.మీ. వర్షపాతం ఉన్న కొండ ప్రాంతాలు, పీఠభూమి ఉపరితలాల్లో పెరుగుతాయి. ఇవి ముఖ్యంగా పశ్చిమ కనుమలు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఛోటానాగ్పూర్ పీఠభూమి, శివాలిక్ కొండల ప్రాంతాల్లో పెరుగుతాయి. ఇవి పొడవైన వృక్షాలుగా, పొదలు దగ్గర దగ్గరగా దట్టంగా పెరిగే విలక్షణమైన అడవులు. వీటిని ‘రుతుపవన అడవులు’, ‘బహిరంగ తృణ భూములు’ అని కూడా అంటారు. ఈ అడవుల్లోని వృక్షాలు 25-60 మీటర్ల ఎత్తు వరకూ పెరుగుతాయి. ఇవి వేడి శుష్క వాతావరణ కాలంలో 6-8 వారాలపాటు ఆకులను రాలుస్తాయి. ఈ అడవుల్లో ‘టేకు’ వృక్షాలు ప్రబలంగా ఉంటాయి. వీటితో పాటు గుగ్గిలం (శివాలిక్ కొండలు), మంచి గంధం (కర్ణాటక), షీషమ్, వెదురు, హుర్రా, ఖైర్ మొదలైన వృక్షాలు పెరుగుతాయి. వీటి ఉత్పత్తులను కలప, కొయ్య సామగ్రి, సబ్బులు, కాగితం పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. ఇవి భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. బి) ఉష్ణమండల శుష్క ఆకురాల్చే అడవులు: ఇవి 70 - 100 సెం.మీ. వర్షపాతం ఉండే పీఠభూమి, మైదానాల్లో కనిపిస్తాయి. ప్రధానంగా ద్వీపకల్ప పీఠభూమిలో అధికంగా ఉన్నాయి. గంగా మైదానం, పశ్చిమాన ‘థార్’ ఎడారి వరకు, హిమాలయాలు, పశ్చిమ కనుమలకు మధ్య ఉన్న విశాల భూభాగంలో ఈ అడవులున్నాయి. శుష్క (వేసవి) రుతువుల్లో ఆకులను విస్తారంగా రాల్చడం, వృక్షాలు బోడిగా కనపడటం ఈ అడవుల ముఖ్య లక్షణం. ఈ అడవుల్లో పెరిగే వృక్ష జాతులు - టేకు, వెదురు, గుగ్గిలం, ఖేర్ మొదలైనవి. 3. ఉష్ణమండల ముళ్ల జాతి అడవులు: ఈ రకమైన అరణ్యాలు ముఖ్యంగా 70 సెం.మీ. కంటే తక్కువ వర్షపాతం ఉండే శుష్క ప్రాంతాల్లో పెరుగుతాయి. పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని మైదానాలు, గుజరాత్లో కొన్ని ప్రాంతాలు, సముద్రానికి సమీపంగా ఉన్న దక్కన్ పీఠభూమి ప్రాంతాల్లో పెరుగుతాయి. ఇవి 6-10 మీటర్ల ఎత్తు వరకు పెరిగి ముళ్ల పొదలుగా, గిడసబారిన చెట్లుగా ఉంటాయి. ఈ అడవుల్లో అకేసియా, బ్రహ్మజెముడు, నాగజెముడు లాంటి మొక్కలు సర్వసాధారణంగా ఉంటాయి. ఈ అరణ్యాల్లో తుమ్మ (బాబుల్), నల్లతుమ్మ మొదలైన వృక్ష జాతులు ముఖ్యమైనవి. తేమతో కూడిన పల్లపు భూముల్లో అడవి ఖర్జూరం చెట్లు పెరుగుతాయి. ఆకురాల్చే అడవుల్లో ముఖ్యమైన జంతు సంపద ఉత్పత్తి లక్క. ఇది జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అధికంగా ఉత్పత్తి అవుతోంది. దీన్ని ఎక్కువగా విద్యుత్ నిరోధకంగా, సీల్స్ వేయడానికి ఉపయోగిస్తారు. 4. మడ అడవులు లేదా టైడల్ అడవులు: ఇవి ముఖ్యంగా బురద, ఒండ్రుతో కూడిన సముద్ర తరంగాలు, పోటుపాట్లకు గురయ్యే ఉప్పు నీటి, మంచి నీటి ప్రాంతాల్లో పెరుగుతాయి. ఇవి ప్రధానంగా తీరాంచల ప్రాంతాలు, గంగా, మహానది, గోదావరి, కృష్ణా డెల్టాల్లోని ఏరులు, దీవుల్లో పెరుగుతాయి. ఇవి 30 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. వీటికి శ్వాసవేర్లు ఉంటాయి. ఈ వేర్లు బురద నుంచి పైకి చొచ్చుకు వచ్చి ఉంటాయి. ‘మడ’ చెట్లు ఎక్కువగా ఉండటం వల్ల వీటిని ‘మడ అడవులు’ అంటారు. ‘బెంగాల్’ డెల్టాలో ‘సుందరి’ వృక్షాలు ఎక్కువగా పెరుగుతాయి. కాబట్టి వీటిని ‘సుందర వనాలు’ అంటారు. పేము, తాటి వృక్ష జాతులు వీటిలో ముఖ్యమైనవి. ఈ అడవులలోని వృక్షాలు మాంగ్రోవ్ వంశానికి చెందడం వల్ల వీటిని ‘మాంగ్రోవ్ అరణ్యాలు’ అని కూడా అంటారు. ఈ అరణ్యాల కలపను నౌకా నిర్మాణం, న్యూస్ పేపర్ తయారీలో ఉపయోగిస్తారు. 5. పర్వతీయ అరణ్యాలు: ఇవి రెండు రకాలు. ఎ) హిమాలయాల్లోని సమశీతోష్ణ అడవులు: ఇవి ముఖ్యంగా హిమాలయాల్లోని మధ్య హిమాలయ శ్రేణులు (హిమాచల్)లో 1600 - 3000 మీ. ఎత్తు వరకు, 100 - 200 సెం.మీ. వర్షపాతం ఉండే ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. వీటిలో ఓక్, తమాల (పొన్న), చెస్ట్నట్, వాల్నట్, మాపుల్, సంపెంగ జాతి, ఆల్డర్లు లాంటి వెడల్పాటి ఆకులున్న వృక్షాలు పెరుగుతాయి. వీటినే ‘శృంగాకార అరణ్యాలు’ అంటారు. బి) ఆల్ఫైన్ అడవులు: ఇవి ముఖ్యంగా 3,500 మీ. కంటే ఎత్తయిన ప్రాంతాల్లో (హిమాద్రి శ్రేణుల్లో) పెరుగుతాయి. వీటిలో ముఖ్యమైన వృక్ష జాతులు - దేవదారు, సిడారు, వెదురు, రోడో డెండ్రాన్లు, విల్లో, బిర్చ, జునిఫెర్, సిల్వర్ ఫెర్, పైన్ మొదలైనవి. ఈ అరణ్యాల్లోని కలపను అగ్గిపెట్టెలు, హస్తకళలు, జిగురు, కర్రగుజ్జు, టర్పంటైన్, రైల్వే స్వీపర్లు మొదలైన వాటిలో ఉపయోగిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో మడ అడవులు ఉన్న ప్రాంతం ‘కోరింగ’. అటవీ భూమి విస్తరణ భారతదేశంలో 2000-01 సంవత్సరం లెక్కల ప్రకారం 6,75,538 చ.కి.మీ. విస్తీర్ణంలో అటవీ భూమి ఉంది. ఇది దేశ మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 20.55 శాతం. 1952 - జాతీయ అటవీ విధానం’ ప్రకారం ఆవరణ సమతౌల్యాన్ని కాపాడటానికి మైదానాల్లో 20 శాతం, పర్వతాలు, కొండ ప్రాంతాల్లో 60 శాతం.. మొత్తం మీద దేశ బౌగోళిక విస్తీర్ణంలో 1/3వ వంతు భూభాగంలో (33.3 శాతం) అడవులు విస్తరించి ఉండాలి. 2000-01 లెక్కల ప్రకారం విస్తీర్ణ పరంగా అత్యధిక అడవులు ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్ (77,265 చ.కి.మీ.). అత్యల్ప విస్తీర్ణం ఉన్న రాష్ట్రం హర్యానా (1754 చ.కి.మీ.). ఆయా రాష్ట్రాల వైశాల్యంతో పోల్చి చూసినప్పుడు (శాతాల్లో) అడవులు అత్యధికంగా ఉన్న రాష్ట్రం అరుణాచల్‌ప్రదేశ్ (62.1 శాతం), అత్యల్ప అడవులున్న రాష్ట్రం హర్యానా (3.8 శాతం). ఇండియా స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట - 2013 దీని ప్రకారం భారతదేశంలో మొత్తం అడవుల విస్తీర్ణం 6,97,898 చ.కి.మీ. ఇది దేశ మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 21.23 శాతం. దేశంలో విస్తీర్ణపరంగా అడవులు అధికంగా ఉన్న రాష్ట్రాలు 1) మధ్యప్రదేశ్ (77,522 చ.కి.మీ.) 2) అరుణాచల్ ప్రదేశ్ (67,321 చ.కి.మీ.) దేశంలో విస్తీర్ణపరంగా అత్యల్పంగా అడవులున్న రాష్ట్రాలు 1) హర్యానా (1586 చ.కి.మీ.) 2) పంజాబ్ (1772 చ.కి.మీ.) ఆయా రాష్ట్రాల వైశాల్యంతో పోల్చి చూసినప్పుడు (శాతాల్లో) దేశంలో అత్యధికంగా అడవుల భూభాగం ఉన్న రాష్ట్రం మిజోరాం (90.38 శాతం). అతి తక్కువ అడవుల భూభాగం ఉన్న రాష్ట్రం పంజాబ్ (3.52 శాతం). కేంద్ర పాలిత ప్రాంతాల్లో విస్తీర్ణపరంగా అడవులు అండమాన్ నికోబార్ దీవుల్లో అధికంగా, డామన్ డయ్యూలో అత్యల్పంగా ఉన్నాయి. భారత ప్రభుత్వం 1988లో రెండో అటవీ విధానాన్ని ప్రకటించింది. 2006లో నూతన పర్యావరణ విధానాన్ని తీసుకొచ్చారు. {పపంచ పర్యావరణ దినోత్సవం ‘జూన్ 5’. సామాజిక అడవులు అనే కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం 5వ పంచవర్ష ప్రణాళిక (1974-79)లో ప్రారంభించింది. ఇది 6వ పంచవర్ష ప్రణాళికా కాలంలో (1980-85) లో ఎక్కువగా అమలైంది. కాంపిటీటివ్ కౌన్సెలింగ్ పోటీ పరీక్షల కోసం అడవులకు సంబంధించి ఏయే అంశాలను చదవాలి? - ఆర్.అలేఖ్య, ఆదిలాబాద్. భూగోళ శాస్త్రంలో ‘అడవులు’ పాఠ్యభాగానికి భౌగోళికంగా ప్రత్యేక స్థానం ఉంది. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వాలు ఇస్తున్న ప్రాధాన్యం దృష్ట్యా పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ నుంచి తరచుగా ప్రశ్నలు అడుగుతున్నారు. అందువల్ల ‘భారత దేశ సహజ ఉద్భిజ్జ సంపద’కు సంబం ధించిన అన్ని అంశాలపై పట్టు సాధించాలి. దేశంలో ఏయే ప్రాంతాల్లో ఏయే రకమైన అడవులున్నాయి? అవి ఆయా ప్రదేశాల్లోనే పెరగడానికి కారణాలు, వాటిలోని ముఖ్యమైన వృక్షజాతులు, అటవీ ఉత్పత్తులు - వినియోగిస్తున్న పరిశ్రమలు తదితర అంశాలను క్షుణ్నంగా చదవాలి. వీటి కోసం 6 నుంచి 10 వ తరగతి వరకు ఉన్న సాంఘికశాస్త్ర పుస్తకాలు ఉపయుక్తంగా ఉంటాయి. మనదేశంలో ప్రధానంగా ఉష్ణమండల, సమశీతోష్ణస్థితికి చెందిన రకాలైన అడవులు ఉన్నాయి. ఇవి ప్రధానంగా ప్రదేశ ఎత్తు, వర్షపాతం, ఉష్ణోగ్రతలపై ఆధారపడి ఉన్నాయి. అందువల్ల అభ్యర్థులు ఈ అంశాలన్నింటినీ అనుసంధానం చేసుకుంటూ అధ్యయనం చేయాలి. భారతదేశ నైసర్గిక స్వరూపంపై పూర్తిగా అవగాహన పెంచు కుంటే చదివిన అంశాలు బాగా గుర్తుంటాయి. మాదిరి ప్రశ్నలు 1. 2001 లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక అడవుల విస్తీర్ణం ఉన్న రాష్ట్రం? 1) హర్యానా 2) పంజాబ్ 3) ఛత్తీస్‌గఢ్ 4) మధ్యప్రదేశ్ 2. హిమాలయాల్లో 3000 మీటర్ల కంటే ఎత్తయిన ప్రాంతాల్లో పెరిగే అడవులను ఏమంటారు? 1) టైడల్ అడవులు 2) ముళ్లజాతి అడవులు 3) ఆల్ఫైన్ అడవులు 4) ఆకురాల్చే అడవులు 3. టేకు చెట్లు అధికంగా ఉండే అరణ్యాలు? 1) మడ అడవులు 2) ఆల్ఫైన్ అడవులు 3) ఆకురాల్చే అడవులు 4) సతత హరిత అడవులు సమాధానాలు: 1) 4; 2) 3; 3) 3. ముల్కల రమేష్ సీనియర్ ఫ్యాకల్టీ, హరీష్ అకాడమీ, హన్మకొండ.