vehicals
-
రోజు ఏమార్చి రోజు..!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఇంటింటికీ చెత్త సేకరణ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రభుత్వ ఆశయానికి ఆదిలోనే అడ్డంకులను సృష్టిస్తున్నారు. ప్రతి రోజూ చెత్త సేకరించాల్సిన క్లాప్ వాహనాలు కాస్తా ఏమార్చి... రెండు రోజులకు ఒక్కసారి చెత్తను సేకరిస్తున్నాయి. గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) పరిధిలోని కొన్ని కాలనీలల్లో ప్రతి రోజూ చెత్తను సేకరించడం లేదు. కాలనీ పెద్దగా ఉందన్న కారణంతో పాటు ఎత్తైన కొండవాలు ప్రాంతాలున్నాయన్న కారణాన్ని చూపుతూ చెత్త సేకరణను కాస్తా అటకెక్కిస్తున్నాయి. అసలే వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో క్లాప్ వాహనదారులు కాస్తా మొండికేస్తుండటం చెత్త సమస్యతో పాటు కొత్త రోగాల సమస్యలను కూడా తెచ్చిపెడుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రోజూ 30 కిలోమీటర్ల మేర వాహనాలను తిప్పుతున్నామన్న కారణాన్ని చూపుతూ రెండు రోజులకు ఒక్కసారి చెత్తను సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ విధంగా కొన్ని కాలనీలల్లో రెండు రోజులకు ఒక్కసారి చెత్తను సేకరిస్తున్నామన్న సమాచారం కాస్తా సదరు కాంట్రాక్టరు జీవీఎంసీ అధికారులకు ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సదరు వ్యవహారంపై జీవీఎంసీ ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నార న్నది చూడాల్సి ఉంది. ఇదీ అసలు ఉద్దేశం వాస్తవానికి ప్రతి ఇంటి నుంచి రోజూ చెత్తను సేకరించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం క్లాప్ వాహనాలను ప్రారంభించింది. ఇంటింటికీ సదరు క్లాప్ వాహనం వెళ్లి... పొడి చెత్త, తడిచెత్తను వేరు చేస్తూ చెత్తను సేకరించాల్సి ఉంటుంది. ఇందుకోసం జీవీఎంసీ పరిధిలో 629 వాహనాలు అవసరమని పేర్కొంటూ జీవీఎంసీ ప్రభుత్వానికి ప్రతిపాదనలను సమర్పించింది. ఇప్పటివరకు 625 వాహనాలను ప్రభుత్వం కేటాయించింది. ఈ వాహనాలను ఆయా వార్డులు, సచివాలయాల వారీగా కేటాయించారు. ఏ వాహనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెత్తను సేకరించాలి? ఎక్కడ డంప్ చేయాలనే విషయాన్ని కూడా పక్కాగా రూట్ మ్యాప్‌ను జీవీఎంసీ అధికారులు నిర్దేశించారు. ప్రతి రోజూ ఇంటింటి నుంచి చెత్తను సేకరించడం ద్వారా ఎక్కడికక్కడ చెత్తను పారవేసే అవకాశం ఉండకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉండదు. అంతేకాకుండా చెత్త పేరుకుపోయి నగరం దుర్గందభరితంగా మారకుండా క్లీన్ సిటీగా ఉంటుంది. మరోవైపు ఈ విధంగా సేకరించిన చెత్తను కాపులుప్పాడలోని డంపింగ్ యార్డుకు తరలించి... అక్కడ విద్యుత్‌ను కూడా ఉత్పత్తి చేస్తున్నారు. ఇప్పటికే అక్కడి ప్లాంటులో చెత్త నుంచి విద్యుత్ తయారవుతోంది. ఈ విద్యుత్‌ను జీవీఎంసీ కాస్తా తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్)కు విక్రయించడం ద్వారా యూనిట్‌కు రూ.6కుపైగా మొత్తాన్ని పొందుతోంది. ఒకవైపు ప్రజల ఆరోగ్యం మెరుగుపడటం... నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు విద్యుత్‌ను ఉత్పత్తి చేసి ఆదాయవనరుగా మార్చుకునే ఉద్దేశ్యంతో ఈ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రారంభించింది. అయితే, ఇందుకు విరుద్ధంగా కొన్ని కాలనీలల్లో జరుగుతుండటం గమనార్హం. పక్కాగా రూట్ ఉండాలంటూ...! చెత్త సేకరణ కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా చేపట్టేందుకు జీవీఎంసీ ఉన్నతాధికారులు గత నెలలో నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు అనుగుణంగా చెత్త సేకరణ వాహనాలకు పక్కాగా రూట్‌మ్యాప్ చేయాలని నిర్ణయించింది. ఏ సమయానికి ఎక్కడెక్కడ ఉండాలనే పక్కా ప్లానింగ్‌ను అమలు చేసేందుకు నిర్ణయించారు. ఉదయం 6 గంటలకు బయలుదేరే చెత్త సేకరణ వాహనం ఎక్కడి నుంచి మొదలై.... ఎక్కడెక్కడకు ఎంత సమయానికి చేరుకోవాలంటూ సమయాన్ని నిర్దేశించి పక్కా రూట్‌మ్యాప్‌ను అమలు చేయాలని ఆదేశించారు. తద్వారా చెత్త సేకరణకు ఏ సమయానికి ఎక్కడున్నాయో...తమ ఇంటికి ఏ సమయానికి వస్తుందన్న సమాచారం కూడా ప్రజలకు తెలియాలనేది ఆలోచన. ప్రస్తుతం ఒక్కో రోజు ఒక్కో సమయానికి చెత్త సేకరణ వాహనం ఇళ్ల వద్దకు వస్తుండటంతో ప్రజలు కాస్తా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జీవీఎంసీ తాజా నిర్ణయంతో ప్రజలకు కూడా ఇబ్బందులు లేకుండా నిర్దేశించిన సమయానికే ఇంటి వద్దకు వాహనం వస్తుందన్న ధీమా కలిగింది. దీని అమలు బాధ్యతను శానిటరీ సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు చూడాలని స్పష్టం చేశారు. అయితే, ఇది కాస్తా కొన్ని కాలనీల్లో పూర్తి విరుద్ధంగా తయారయ్యింది. రెండు రోజులకు ఒక్కసారి వాహనం వచ్చే పరిస్థితి ఏర్పడింది. దూరమవుతుందంటూ..! వాస్తవానికి జీవీఎంసీ పరిధిలో చెత్త సేకరణ కోసం 629 వాహనాలు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపారు. ఇందుకు అనుగుణంగా జీవీఎంసీకి ఇప్పటివరకు 625 వాహనాలను కేటాయించారు. అయితే, ఈ వాహనాలకు ఇప్పటికే రూట్‌మ్యాప్‌ను అందించారు. అయినప్పటికీ తమకు కేటాయించిన ప్రాంతంలో పార్కింగ్‌కు అవకాశం లేదంటూ ఎక్కడో దూరంగా పార్కింగ్ చేసుకుంటున్నారు. పార్కింగ్ ప్రాంతం నుంచి చెత్త సేకరణ కోసం బయలుదేరాల్సిన ప్రాంతానికే కొన్ని సమయాల్లో 10 నుంచి 15 కిలోమీటర్ల దూరం ఉంటోంది. ఈ దూరాన్ని కూడా ఇప్పుడు వాహనం తిరిగినట్టుగా సదరు కాంట్రాక్టరు లెక్కలు చూపుతున్నారు. ఫలితంగా ప్రతి రోజూ 50 నుంచి 60 కిలోమీటర్ల మేరకు వాహనం తిరిగినట్టుగా లెక్కలు తేలుతున్నాయి. ఈ మొత్తం దూరానికి కూడా జీవీఎంసీ అదనపు మొత్తం చెల్లించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో రోజూ 30 కిలోమీటర్ల మించి తిరగాల్సిన అవసరం లేకుండా దగ్గరలోనే పార్కింగ్‌కు ఏర్పాటు చేయాలని జీవీఎంసీ నిర్ణయించింది. దీనిని ఆసరాగా తీసుకుని క్లాప్ వాహనదారులు 30 కిలోమీటర్లు మించి పోతుందంటూ కొన్ని కాలనీలల్లో రెండు రోజులకు ఒక్కసారి చెత్త సేకరణ చేయడం ప్రారంభించారు. అయితే, ఈ సమాచారమేదీ కనీసం జీవీఎంసీ అధికారులకు సదరు కాంట్రాక్టరు అందించలేదని తెలుస్తోంది. మరోవైపు కొన్ని కాలనీల నుంచి జీవీఎంసీ అధికారులకు ఫిర్యాదులు కూడా అందుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చెత్త సేకరణపై ఇబ్బందులు లేకుండా చేసేందుకు జీవీఎంసీ అధికారులు ఏం చర్యలు తీసుకుంటారన్నది తేలాల్సి ఉంది. (చదవండి: అన్న.. చెల్లి.. అదుర్స్ .. జాతీయ స్థాయిలో పతకాల పంట) -
ప్రసవించిన ప్రతి తల్లి బిడ్డ క్షేమం కోసం...తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్
పార్వతీపురంటౌన్: ప్రసవానంతరం తల్లీబిడ్డలు ఆస్పత్రినుంచి వారి ఇళ్లకు క్షేమంగా వెళ్లాలని భావించి రాష్ట్రప్రభుత్వం ప్రారంభించిన తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ (102) సర్వీసులు వారికి బాగా సేవలందిస్తున్నాయి. గతంలోనూ ఉన్న ఈ పథకం వాహనాలను ఆధునీకరించి అందుబాటులోకి తీసుకువచ్చింది. బాలింత చేరేగమ్యం ఎంత దూరమైనా, ఏప్రాంతమైనా మేమున్నామంటూ వాహనం ముందుకు వచ్చి సేవలందిస్తోంది. ఒక్క రూపాయి ఖర్చులేకుండా ఉచితంగా వారిని ఇళ్లకు చేరవేస్తూ ఏప్రిల్1న ప్రశంసలు అందుకుంటోంది. రాష్ట్రప్రభుత్వం ఆధునీకరించిన తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహన సేవలు పార్వతీపురం నియోజకవర్గంలో దూసుకుపోతున్నాయి. గత ఏప్రిల్ 1న రాష్ట్రవ్యాప్తంగా 2వ తేదీన పార్వతీపురం పట్టణానికి ఈ వాహనాల సేవలు అందుబాటులోకి వచ్చాయి. తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో పార్వతీపురంలో ఈ సేవలు అరకొరగా ఉండేవి. గతంలో ఒక్కో వాహనంలో నలుగురైదుగురు బాలింతలు వెళ్లాల్సివచ్చేది. ఉదయం డిశ్చార్జ్ అయినా సాయంత్రం వరకు ఊళ్లకు వెళ్లే పరిస్థితి ఉండేది కాదు. ఇలాంటి పరిస్థితిని దూరం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రప్రభుత్వం పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి నాలుగు వాహనాలు, పార్వతీపురం మండలానికి ఒక వాహనం, సీతానగరం మండలానికి ఒకటి కేటాయించింది. ఆస్పత్రుల్లో ప్రసవించిన బాలింతలను పూర్తి ఉచితంగా ఈ వాహనాల ద్వారా ఇళ్లకు చేరవేస్తున్నారు. ఈ సేవలతో బాలింతలు, వారి కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. క్షేమంగా గమ్యం చేర్చడమే లక్ష్యం గతంలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన బాలింతలు ఎవరికి వారే సొంత వాహనాల్లో ఖర్చుపెట్టుకుని ఇళ్లకు వెళ్లేవారు. ఇప్పుడు రాష్ట్రప్రభుత్వం ఒక్కరూపాయి ఖర్చులేకుండా తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ ద్వారా సొంతిళ్లకు చేరుస్తోంది. ఈ సేవలను నియోజవకర్గ వ్యాప్తంగా అందిస్తున్నాం. ఎస్.మన్మథనాయుడు, 102 సర్వీసుల పర్యవేక్షకుడు -
తక్కువ ధరకు వాహనాలు ఇప్పిస్తానని మోసం
సాక్షి, హైదరాబాద్: సెంట్రల్ సబ్సిడీ వెహికల్ పాలసీ(సీఎస్‌వీపీ) కింద తక్కువ ధరకు వాహనాలు ఇప్పిస్తానంటూ తండ్రి కొడుకులు తమను మోసం చేశారంటూ బాధితులు సీసీఎస్ పోలీసులకు పిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. మహ్మద్ ఖుష్రో అహ్మద్ ఫారూఖీ అనే వ్యాపారికి దూరపు బంధువులైన ఖాజా నసీరుద్దీన్, అతడి కుమారుడు జియాయుద్దీన్ తమకు రాజకీయ పలుకుబడి ఉందని, ఆ పలుకుబడితో కార్లు, ట్రక్స్, మోటర్ సైకిల్స్ సబ్సిడీపై ఇప్పిస్తామని చెప్పారు. వీరి మాటలు నమ్మిన ఫారూకీ రూ. 1.61 కోట్లు వాహనాల కోసం చెల్లించాడు. అయితే వాహనాలు ఇప్పించక పోవడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ వారిపై ఒత్తిడి చేశాడు. దీంతో రూ. 66 లక్షలు తిరిగి చెల్లించి, మిగతా వాటికి గ్యారంటీగా చెక్కులు ఇచ్చారు. ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. తమతో పాటు మరికొందరిని స్కీమ్‌ల పేర్లతో మోసం చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. (చదవండి: ముందుగా బేరం.. కానీ మధ్యలో రూ. 5 వేలు చోరీ చేసిందని చంపేశాడు!) -
కార్డెన్ సర్చ్... 20 వాహనాలు స్వాధీనం
సాక్షి, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిరలో అదనపు డీసీపీ సంజీవకుమార్, రూరల్ ఏసీపీ ఉషారాణి ఆధ్వర్యంలో సోమవారం వేకువజామున కార్డెన్ సర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన ధృవపత్రాలు లేని 20 ద్విచక్ర వాహనాలు, ఒక టవేరా వాహనం, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. రూ.లక్ష రూపాయల విలువచేసే గుట్కా ప్యాకెట్లను, మిఠాయి దుకాణంలో కల్తీ ఆయిల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. -
సంక్రాంతి ఎఫెక్ట్, భారీగా ట్రాఫిక్ జాం
-
సంక్రాంతి ఎఫెక్ట్, భారీగా ట్రాఫిక్ జాం
హైదరాబాద్: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై గురువారం ఉదయం భారీగా ట్రాఫిక్ జాం అయింది. సంక్రాంతి పండగ పురస్కరించుకుని హైదరాబాద్ నగరం నుంచి ప్రజలు స్వస్థలాలకు చేరుకునేందుకు వాహనాల్లో బయలుదేరారు. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి వాహనాల రాకపోకలతో మరింత రద్దీ పెరిగింది. నల్గొండ జిల్లా చౌటుప్పల్ సమీపంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద పన్ను చెల్లించేందుకు వాహనాలు నిలపడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు అలాగే హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వచ్చే వాహనాలు బారులు తీరాయి. జాతీయ రహదారిపై సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. నకిరేకల్ సమీపంలోని కొర్లపాడు టోల్‌ప్లాజా వద్ద భారీగా వాహనాలు బారులు తీరాయి. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు ప్రయాణికులతో కిక్కిరిసి పోతున్నాయి. ఈ నేపథ్యంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం
హైదరాబాద్ :శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం హైదరాబాద్ నగరాన్ని కుదిపేసింది. నగర జీవనాన్ని అస్తవ్యస్థం చేసింది. సాయంత్రం 4 గంటల నుంచి దాదాపు రెండున్నర గంటల పాటు కురిసిన భారీ వర్షానికి నగరంలోని అనేక కాలనీలు జలమయమయ్యాయి. భారీ వర్షానికి రోడ్లన్నీ ఏరులై పారుతున్నాయి. వర్షం కారణంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, కూకట్పల్లి, మియాపూర్, గచ్చిబౌలి, మణికొండ, మాదాపూర్, ఖైరతాబాద్, కోఠి, నాంపల్లి, నారాయణగూడ, ఉప్పల్, ఎల్బీ నగర్ తదితర ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. అనేక ఇళ్లు నీట మునిగాయి. పలు కాలనీల్లో కరెంటు వైర్లు తెగిపడిన కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఇళ్లకు చేరుకోవాలనుకున్న ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో వర్షం కాస్తా తెరపినివ్వడంతో ఒక్కసారిగా వాహనాలు రోడ్లపైకి రావడంతో నగరంలో అన్ని చోట్లా విపరీతమైన ట్రాఫిక్ జాంలు ఏర్పడ్డాయి. ఎల్ బీ నగర్ నుంచి మియాపూర్ వరకు రహదారులన్నీ ట్రాఫిక్ తో నిండిపోయింది. కోటీ నుంచి చాదర్ ఘాట్ చేరుకోవడానికి వాహనదారులకు రెండు గంటలు పట్టింది. ఖైరతాబాద్ నుంచి అమీర్ పేట చేరుకోవడానికి అంతే సమయం పట్టింది. రద్దీ ఎక్కువగా ఉండే రోడ్లలో ఒక్క కిలోమీటర్ ముందుకు వెళ్లడానికి దాదాపు రెండు గంటల సమయం పట్టడంతో వాహనదారులు గగ్గోలు పెట్టారు. నగర రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయి ముందుకు కదలలేని పరిస్థితి తలెత్తింది. పలు చోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి. ఆదర్శ నగర్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ సమీపంలో భారీ వృక్షం కూలడంతో దానికింద మూడు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సమీపంలోనీ మిరాలం ట్యాంకులోకి వరద నీరు చేరుతుండటం, సమీపంలోని జూ పార్క్ లోకి భారీగా వరద నీరు చేరుతోంది. కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. సాయంత్రం ఏడు గంటలకు బాలానగర్ లో 68.25 మిల్లీమీటర్లు, కూకట్ పల్లి ప్రాంతంలో 48.5 మిమీ, అమీర్ పేటలో 41.25మిమీ, హిమాయత్ నగర్ లో 25.25 మిమీ వర్షపాతం నమోదైంది. ఈరోజు సాయంత్రం ఆయా ప్రాంతాల్లో కురిసిన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ ఇంకా ప్రకటించాల్సి ఉంది. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ఎండ రావడం, మరోవైపు గణేశ్ నిమజ్జనం సజావుగా పూర్తయి అంతా ఊపిరి తీసుకోగా, సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రెండున్నర గంటల పాటు భారీ వర్షం కురియడంతో పరిస్థితి అతలాకుతలంగా మారింది. ట్రాఫిక్ ను క్లియర్ చేయడానికి ఎక్కడా పోలీసులు కనిపించడంలేదని వాహనదారులు గగ్గోలు పెట్టారు. గడిచిన రెండు రోజుల్లో కురిసిన వర్షానికి రోడ్లన్నీ గుంతలేర్పడగా, తాజా వర్షానికి రోడ్లపై నీటి వరదలోనే వాహనాలు రోడ్లెక్కాయి. వర్షం తగ్గిన గంట తర్వాత కూడా ట్రాఫిక్ జాం పరిస్థితిలో ఏమాత్రం మార్పు కనిపించలేదు. భారీ వరద రావడంతో మూసీ పొంగి పొర్లుతోంది. భారీ వర్షంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం అయ్యారు. రోడ్లపై నీటిని తోడేయడానికి మున్సిపల్ సిబ్బంది నానా తంటాలు పడుతున్నారు. అధికారుల అనుమతి లేకుండా మ్యాన్‌హోల్స్ తెరవవద్దని, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి సంప్రదించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి సూచించారు. నమోదైన వర్షపాతం వివరాలు: బాలనగర్ 6.8 సెంటీమీటర్లు శేరిలింగంపల్లి 4.8 ఆసిఫ్ నగర్ 4.1 అమీర్ పేట 4.1 ఖైరతాబాద్ 4 సికింద్రాబాద్ 2.9 మారేడ్ పల్లి 2.5 హిమాయత్ నగర్ 2.2 కుత్బుల్లాపూర్ 1.9 గోల్కోండ 1.8 తిరుమలగిరి 1.2 అంబర్ పేట 1 సెంటీమీటరు వర్షపాతం -
హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం