vehicle purchase
-
రవాణా ఆదాయం రయ్
సాక్షి, అమరావతి: కోవిడ్ సంక్షోభం నుంచి కోలుకోవడంతో రాష్ట్రంలో రవాణా ఆదాయం క్రమంగా పెరుగుతోంది. 2021–22 తొలి త్రైమాసికంతో పోల్చి చూస్తే ఈ ఆర్థిక ఏడాది అదే సమయంలో రవాణా ఆదాయంలో 58.70 శాతం వృద్ధి నమోదైంది. కోవిడ్‌కు ముందు అంటే 2019–20తో పోల్చితే 37.95 శాతం వృద్ధి నమోదైంది. వాహన విక్రయాలు పెరగడంతో జీవిత పన్ను, త్రైమాసిక పన్ను, ఎన్ఫోర్స్మెంట్ ద్వారా వచ్చే ఆదాయంలో పెరుగుదల నమోదైంది. గత ఐదేళ్లలో ఎప్పుడూ లేనంత వృద్ధి ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో నమోదు కావడం గమనార్హం. ద్విచక్రవాహనాలు మినహా మిగతా అన్ని రకాల వాహనాల విక్రయాల్లో వృద్ధి నమోదైంది. కార్ల జోరు.. ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో కార్ల విక్రయాల్లో 5.11 శాతం వృద్ధి నమోదైంది. ఆటోలు, ప్యాసింజర్ వాహనాలు, గూడ్స్ వాహనాల విక్రయాలు గణనీయంగా పెరిగాయి. ఆటోల విక్రయాల్లో 69.7 శాతం, ప్యాసింజర్ వాహనాలు 57.87 శాతం, గూడ్స్ వాహనాల విక్రయాల్లో 37.28 శాతం వృద్ధి నమోదైంది. ద్విచక్ర వాహనాల విక్రయాల్లో మాత్రం –3.75 శాతం వృద్ధి నమోదైంది. కోవిడ్‌కు ముందు 2019–20 తొలి త్రైమాసికంలో రూ.749.75 కోట్లు ఆదాయం రాగా ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో రూ.1,034.25 కోట్ల ఆదాయం సమకూరింది. జాతీయ స్థాయిలో అన్ని రకాల వాహనాల విక్రయాల్లో ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో భారీగా వృద్ధి నమోదైంది. కోవిడ్ సంక్షోభంలో ప్యాసింజర్ వాహనాలు కొనుగోళ్లు భారీగా పడిపోగా ఇప్పుడు పెరుగుతున్నాయి. -
కరోనా వేళ మంత్రులకు కొత్త కార్లు
ముంబై: కరోనా పంజా విసురుతుండగా, ప్రజాధనంతో కొత్త కార్లు కొనుక్కోవడానికి మంత్రులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం మహారాష్ట్రలో కలకలం సృష్టిస్తోంది. అధికారిక వాహనం కొనుగోలు చేసుకోవడానికి విద్యాశాఖ మంత్రి వర్షా గైక్వాడ్‌కు అనుమతి ఇస్తూ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే జూలై 3న ఉత్తర్వులు జారీ చేశారు. ప్రత్యేక కేసుగా పరిగణిస్తూ ఇందుకోసం రూ.22.83 లక్షలు మంజూరు చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్ష నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తప్పుపట్టారు. కరోనా బాధితులను ఆదుకోవాల్సింది పోయి మంత్రులకు కొత్త వాహనాలు సమకూర్చడం ఏమిటని మండిపడ్డారు. కరోనాపై పోరాడుతున్న ఆరోగ్య కార్యకర్తలు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించకుండా వాయిదా వేస్తూ.. మంత్రుల కోసం ప్రజాధనం ఫలహారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. -
వాహనం కొన్న వ్యక్తిపైనే ఒకశాతం పన్ను బాదుడు!
రూ.10 లక్షలపైబడిన కొనుగోళ్లపై స్పష్టత న్యూఢిల్లీ: ఇకపై రూ.10 లక్షల పైబడిన వాహనం కొనుగోలుచేసిన వినియోగదారుడు... 1% అదనపు పన్ను భారాన్ని భరించాల్సి ఉంటుంది. నిజానికి రూ.10 లక్షలు పైబడిన వాహనం కొనుగోలుపై 2016-17 బడ్జెట్ ఒక శాతం పన్ను ప్రతిపాదనను చేసింది. అయితే ఈ పన్నును కొనుగోలుదారుడు భరించాలా...? లేక అమ్మకందారు భరించాలా? అన్న అంశంపై అస్పష్టత నెలకొంది. దీనికి సంబంధించి గురువారం ఆమోదం పొందిన ఫైనాన్స్‌బిల్లు-2016లో ఆర్థికమంత్రి జైట్లీ ఒక సవరణ ద్వారా స్పష్టతనిచ్చారు. రూ. 10 లక్షలు దాటిన డివిడెండ్ ఆదాయానికి సంబంధించి కంపెనీలు చెల్లించే డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ పన్నుతోపాటు సదరు ఆదాయం పొందిన వ్యక్తి కూడా అదనపు డివిడెండ్ పన్ను 10 శాతం మేర చెల్లించాల్సి ఉంటుందని తాజా సవరణలో వివరించారు.