vehicle rules
-
Rear Seat Belt: ‘కారు సీటు బెల్ట్’పై తర్జనభర్జన!
సాక్షి, హైదరాబాద్: కారు ప్రయాణంలో సీటు బెల్ట్ పెట్టుకోకపోవటంతో జరిగే ప్రమాదాలను నివారించేందుకు కేంద్రం వాహన చట్టం నిబంధనలను మరింత కఠినతరం చేసింది. కారు నడిపే డ్రైవర్ మాత్రమే కాదు వెనకాల కూర్చున్న వ్యక్తులూ సీటు బెల్ట్ పెట్టుకోవాల్సిందేనని, లేకపోతే మోటారు వాహన చట్టం సెక్షన్ 194 బీ ప్రకారం రూ.1,000 జరిమానా విధించాలని నిర్ణయించింది. 8 సీట్ల లో పు ఉన్న అన్ని ప్యాసింజర్ వాహనాలకు ఈ చ ట్టం వర్తిస్తుంది. అయితే ఈ నిర్ణయం అమలులో క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు కలుగుతాయని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. దీంతో ఆయా నిబంధనల అమలుపై అధికారులు పునరాలోచనలో పడినట్లు తెలిసింది. విజన్ ఉండదు.. బైక్ రైడర్‌కి హెల్మెట్, కారు నడిపేవారికి సీటు బెల్ట్ రక్షణ కల్పిస్తుంది. కానీ, కారులో డ్రైవర్ మినహా ముందు, వెనక కూర్చున్న వారు సీటు బెల్ట్‌ను పెట్టుకోవటంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. పోలీసులు కూడా బెల్ట్ పెట్టుకోని డ్రైవర్‌ను మాత్రమే గుర్తించి జరిమానా విధించేవారు. కారు ప్రమాదంలో వెనకాల వ్యక్తులకూ ప్రాణ నష్టం వాటిల్లుతుండటంతో కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. అ యితే ఈ నిబంధన అమలు సాంకేతికంగా ట్రాఫిక్ సమస్యలకు కారణమవుతోంది. రోడ్డు మీద జంక్షన్లో ఉన్న కానిస్టేబుల్‌కు వేగం కారణంగా వాహనాల లోపల వ్యక్తులు స్పష్టంగా కనిపించరు. నిరిష్టంగా వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తే తప్ప వెనకాల వ్యక్తి సీటు బెల్టు పెట్టుకున్నాడో లేదో తెలియదు. పోనీ ప్రయాణంలో ఉన్న కారును రోడ్డు మీద ఆపి తనిఖీ చేస్తే ట్రాఫిక్ జాం అయ్యే ప్రమాదం ఉంది. ఇతర వాహనదారులకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉందని పలువురు ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఉన్నతాధికారుల వద్ద ప్రస్తావించారు. ఇలా చేస్తే బెటర్.. దీంతో ఈ నిబంధనను అమలు చేసేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించారు. ఇతర ట్రాఫిక్ నిబంధనల అతిక్రమణ సమయంలో కారును ఆపినప్పుడు వెనకాల వ్యక్తి సీటు బెల్టు పెట్టుకున్నాడో లేదా గమనించి, ఒకవేళ పెట్టుకోకుంటే చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. దీనికంటే ముందు సీటు బెల్ట్ ప్రాధాన్యతపై వాహనదారులకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. సీటు బెల్ట్ పెట్టుకోకపోవటం వల్ల జరిగే ప్రమాదాలను వివరిస్తూ ప్రత్యేక అవగాహన ఆల్బమ్‌ను రూపొందిస్తున్నారు. ట్రాఫిక్ జంక్షన్ల వద్ద అవగాహన కల్పించనున్నారు. డ్రైవ్ చేసే వారితో పాటు కారులోని మిగతా వారికీ ప్రమాదాల గురించి వివరించనున్నారు. కరపత్రాలు, డిజిటల్ సూచికలతో ప్రచారం చేసేలా ప్లాన్ చేశారు. -
ప్రైవేట్ ట్యాక్సీలపై ఆర్టీవో కొరడా
నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు * పీవీఎస్ఏ బ్యాడ్జీలు ఉన్న ట్యాక్సీలే తిరగాలని హుకుం * రేడియో ట్యాక్సీలకు సైతం బ్యాడ్జీలు తప్పనిసరి * త్వరలో ‘ట్యాక్సీ ఫర్ ష్యూర్’ ప్రారంభం సాక్షి, ముంబై: ఆర్టీవో అధికారులు వాహన నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ ట్యాక్సీ డ్రైవర్లపై చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. దీంతో నగరంలోని 27 శాతం ప్రైవేట్ ట్యాక్సీలు ఆగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సందర్భంగా రవాణా అధికారి ఒకరు మాట్లాడుతూ.. టూరిస్ట్ ట్యాక్సీలను నడిపేందుకు కావాల్సిన బ్యాడ్జీలు లేకపోవడంతో చాలా మంది డ్రైవర్లు సేవలకు దూరంగా ఉన్నారని తెలిపారు. ప్రతి డ్రైవరు పబ్లిక్ సర్వీస్ వెహికిల్ అథరైజేషన్ (పీవీఎస్ఏ) బ్యాడ్జీలను కలిగి ఉండాలన్నారు. రేడియో ట్యాక్సీలతోపాటు టూరిస్ట్ వాహన డ్రైవర్లు కూడా ఈ బ్యాడ్జీలను కలిగి ఉండాలని ఆయన పేర్కొన్నారు. తాము కొన్ని రోజులుగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో దాదాపు వెయ్యి మంది డ్రైవర్లకు బ్యాడ్జీలు లేనట్లుగా గుర్తించామని, వారిపై కేసులు నమోదు చేశామని చెప్పారు. అలాగే రేడియో ట్యాక్సీలు, టూరిస్టూ వాహనదారులకు కూడా బ్యాడ్జీలు లేని డ్రైవర్లకు వాహనాలు అప్పగించవద్దని రవాణా శాఖ నోటీసులు కూడా జారీ చేసిందన్నారు. అదేవిధంగా క్యాబ్‌లలో భద్రతాపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా క్యాబ్ కంపెనీలను ఆదేశించామని చెప్పారు. క్యాబ్‌ల్లో జీపీఎస్ వ్యవస్థ, మొబైల్ యాప్స్‌లలో ఎస్ఓఎస్ బటన్ తదితర ప్రాథమిక భద్రతా చర్యలను క్యాబ్‌లలో అందుబాటులో ఉంచనట్లయితే సదరు కంపెనీలు వాహనాలను నడిపేందుకు లెసైన్సులను సస్పెండ్ చేస్తామని హెచ్చరించామన్నారు. ఇటీవల రవాణా శాఖ కమిషనర్ మహేష్ జగాడే ట్యాక్సీ నిర్వాహకులతో ఓ సమావేశం నిర్వహించారు. ట్యాక్సీలలో భద్రతా పరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. సదరు క్యాబ్‌లలో ఏదైనా నేరం జరిగితే దానికి కంపెనీయే జవాబుదారీ వహించాల్సి వస్తుందన్నారు. అంతేకాకుండా కంపెనీ యాజమాన్యంపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని తెలిపారు. దీంతో ‘మేరు ప్లస్’ కంపెనీ తమ ఐదు ట్యాక్సీల్లో ప్రయోగాత్మకంగా ‘ప్యానిక్ స్విచ్’లను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రక్రియలో భాగంగా ‘ట్యాక్సీ ఫర్ ష్యూర్’ను కూడా ప్రారంభించనున్నట్లు ఆర్టీవో అధికారి పేర్కొన్నారు. ఈ వ్యవస్థతో ప్రయాణికులు పోలీసులను అప్రమత్తం చేస్తారన్నారు. ఇక్కడ స్విచ్ వేయడం ద్వారా జీపీఎప్ వ్యవస్థ ద్వారా కంట్రోల్ రూంలో ఉన్న పోలీసులకు సదరు డ్రైవరు పూర్తి వివరాలు, వాహనం ఏ ప్రాంతంలో ఉందో తెలుస్తుందని అధికారి తెలిపారు. నిర్భయ పథకం ద్వారా దీనిని వాహనాల్లో అమర్చనున్నట్లు అధికారి వివరించారు. -
నిషేధాలు ఉల్లంఘిస్తున్న ఈ రిక్షాలు
న్యూఢిల్లీ: నగరంలో ఈ రిక్షాలు నడుస్తున్నా ట్రాఫిక్ పోలీసులు, ట్రాన్స్‌పోర్టు విభాగం అధికారులు పట్టించుకోకపోవడాన్ని ఢిల్లీ హైకోర్టు తప్పుపట్టింది. ఈ మేరకు మంగళవారం షోకాజ్ నోటీసులను జారీ చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 9వ తేదీ నుంచి నగరంలో ఈ రిక్షాలపై హైకోర్టు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తూ నగరంలో ఈ రిక్షాలు నడుస్తున్నా పై రెండు విభాగాలు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ కారణంగా కోర్టు ధిక్కార చర్యలు ఎందు తీసుకోకూడదని ఆయా విభాగాలను ప్రశ్నించింది. ఈ రిక్షాల సైజులో సాంకేతికలోపంతోపాటు, వాటి టైర్లు ఉబ్బి ఉన్నాయని, ఇవి నగర రోడ్లపై తిరగడం సరైందకాదని ఆయా విభాగాలకు సూచిస్తూ సెప్టెంబర్ 9వ తేదీన హైకోర్టు నిషేధం విధించింది. హైకోర్టు ఆదేశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన జాయింట్ పోలీస్ కమిషనర్(ట్రాఫిక్) అనిల్‌కుమార్, ట్రాన్స్‌పోర్టు కమిషనర్ సతీష్ మాధుర్‌లను ప్రతివాదులుగా పేర్కొంటూ హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నాలుగువారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. డిసెంబర్ 18వ తేదీలోగా సమర్పించాలని జస్టిస్ వీకే షాలీ చెప్పారు. ఈ రిక్షాలు వివిధ తేదీల్లో నగరంలో తిరిగినట్లు ఆధారాలు చూపే దృశ్య చిత్రాలను పిటిషనర్ షహనావాజ్ ఖాన్ కోర్టు సమర్పించారని పేర్కొన్నారు. ఇప్పటి వరకూ పోలీసులు ఈ రిక్షాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిటిషనర్ పేర్కొన్నారు. చాందీచౌక్ ప్రాంతంలో ఈ రిక్షాలు తిరిగినట్లు కోర్టు పరిశీలనలో కూడా వెల్లడైందన్నారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీమ్సేన్ బాసీతోపాటు ప్రతివాదుల తరఫున న్యాయవాది జుబేదా బేగం వాదించారు. ట్రాన్స్‌పోర్టు విభాగం అక్టోబర్ 8వ తేదీన నగరంలో ఈ రిక్షాలు నడవడానికి అనుమతి ఇస్తూ నోటిఫికేషన్ విడుదల చేసిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈ రిక్షాలకు వ్యతిరేకంగా వచ్చిన అభ్యంతరాలను స్వీకరించినట్లు తెలిపారు. తదుపరి నోటిఫికేషన్ త్వరలో విడుదల చేయనున్నట్లు కోర్టుకు సూచించారు. న్యాయవాది సుగ్రీవ్ దుబే ద్వారా పిటిషనర్ షహనావాజ్ వేసిన కోర్టు ధిక్కార ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కోర్టు సెప్టెంబర్ 9వ తేదీన నగరంలో ఈ రిక్షాలను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా ఈ రిక్షాలు నగరంలో కొనసాగుతున్నాయి. దీనిపై నిర్ణీత గడువులోగా కోర్టుకు సమాధానం చెప్పాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది.