Venigalla Rambabu
-
యువతరం అభిరుచుల్లో మార్పు రావాలి
‘సాక్షి’తో సినీగేయ రచయిత వెనిగళ్ళ రాంబాబు రాజమహేంద్రవరం :‘నాటి పాట హృదయాన్ని తట్టిలేపేది. నేటి పాట శరీరాన్ని పట్టి ఊపుతోంది. యువతరం అభిరుచుల్లో మార్పు వచ్చినప్పుడే మంచి సినిమా పాటలు వస్తాయ’ని ప్రముఖ సినీ గేయ రచయిత వెనిగళ్ళ రాంబాబు అన్నారు. ఆంధ్రకేసరి యువజన సమితి, తెలుగు వెలుగు సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో యువచైతన్య పురస్కారం అందుకోవడానికి వచ్చిన సందర్భంగా ఆయన ‘సాక్షి’తో తన సినీ గేయ ప్రస్థానాన్ని ఇలా వివరించారు. ‘‘మాది గుంటూరు జిల్లా రేపల్లె. ఎంఏ తెలుగు, ఎంఏ సంస్కృతం, ఎమ్మెస్సీ చదివాను. డి.రామానాయుడి ‘ప్రేయసి రావే’ సినిమాలో తొలిసారిగా ‘తెంచుకుంటే తెగి పోతుందా దేవుడు చేసిన బంధం’ అనే పాట రాశాను. ‘మీ శ్రేయోభిలాషి’ సినిమా కోసం ‘చిరునవ్వులతో బతకాలి.. చిరంజీవిగా బతకాలి’ తదితర పాటలను ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇప్పటివరకూ సుమారు 60 సినిమాలకు వందకు పైగా పాటలు రాశాను. ఇటీవల విడుదలయిన ‘రాజా చెయ్యి వేస్తే’ సినిమా కోసం ‘నీతోనే ఉంది ప్రపంచం.. నీ తీరు మార్చు నేడు కొంచెం’ పాట విమర్శకుల మెప్పు పొందింది.’’ -
గీత స్మరణం
తఝంతా తకిట తదుంతా తకిట తఝంత తరుంత తఝంత తఝంత దిత్తాంకిటతక తరికిట తకతోం కిటతకతాంకిటతక తరికిటతకతోం తత్తాంకిటతకతోం రిసనిప సనిపమ రిపమరి మపనిస మపనిస మపనిసా... శ్రీకృష్ణరాయా అభివందనం! మా కృష్ణరాయా అభివందనం! నినిసాస సాస నిని రీరి రీరి నిని సాస సాస సస సరినిస పనిపమరీ మమపాప పాప మమ నీని నీని మమ పాప పాప మప మపా రిమ సరినీ శ్రీకృష్ణరాయా అభివందనం! మా కృష్ణరాయా అభివందనం! శృంగార కవిరాజబమీ ప్రాంగణం సంగీత సాహిత్య సమరాంగణం! తెలుగింట వెలుగొందు సిరితోరణం! నీ కీర్తి చంద్రికలకభివందనం !! ఝం ఝం తరికిటతోం తఝం తరికిటతోం (2) నాప్రాణమే ఈ నర్తనం! నీ శౌర్యమే సంకీర్తనం! మనసారా మీ దాసిని నీ చరణ సహవాసిని నీ మమతకు నీ సమతకు అభివందనం! అభివందనం! శ్రీకృష్ణరాయా అభివందనం! మా దేవరాయా అభివందనం! తద్ధీం తకధిమి ఝణు తకధిమి తద్ధీం తకధిమి ఝణు తకధిమి తద్ధీం తకధిమి ఝణు తకధిమి తద్ధీం తకధిమి ఝణు తకధిమి తజోం తజోం తజోం తజోం పాప సాస నీని పాప మమ రిరి రీరి రీని పాపమామ రిరి సస రీరిసాస రీరి మామ పమరిరి రిసనిప సనిపమ నిపమరి మపనిస మపనిస మపనిసా... చిత్రం : దేవరాయ (2012) రచన : డా॥వెనిగళ్ల రాంబాబు సంగీతం : చక్రి గానం : మాళవిక, బృందం నిర్వహణ: నాగేశ్