కన్నా.. వెళ్లిపోయావా
చందానగర్ : హిమాచల్‌ప్రదేశ్ బియాస్ నది ప్రమాదంలో గల్లంతై మృతి చెందిన వెంకట్దుర్గ తరుణ్ మృతదేహాన్ని గురువారం చందానగర్‌లోని టెల్‌కట్స్ అపార్టుమెంట్‌కు తీసుకొచ్చారు. కన్నకొడుకు విగతజీవిగా రావడం చూసి తల్లిదండ్రులు సుబ్బారావు, విజయలక్ష్మీలు ఒక్కసారిగా బోరున విలపించారు. స్టడీటూర్కెళ్లి..ఇలా వస్తావనుకోలేదని కన్నీరుమున్నీరయ్యారు. తొమ్మిదేళ్లుగా వారు నివాసముంటున్న టెల్‌కట్స్ అపార్ట్‌మెంట్‌కు పరిసర ప్రాంతాల ప్రజలు, బంధువులు, స్నేహితులు పెద్దసంఖ్యలో తరలివచ్చి మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించేందుకు వారి స్వగ్రామమైన గుంటూరు జిల్లా మునగాల మండలం పెద్దపర్తిపాలెంకు తరలించారు.