పింఛన్ రాలేదన్న బెంగతో ఇద్దరు మృతి
సాక్షి నెట్వర్క్: పింఛన్ రాలేదన్న బెంగతో వేర్వేరు జిల్లాల్లో ఇద్దరు మృతి చెందగా, మరొకరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండ ల కేంద్రానికి చెందిన వృద్ధురాలు మునిగెల వెంకటమల్లమ్మ(85) గురువారం రాత్రి, కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం దేశాయిపేట గ్రామానికి చెందిన సుద్దాల మల్లమ్మ(80) శుక్రవారం పింఛన్ రాలేదన్న బెంగతో మృతి చెందారు. ఇదే జిల్లా సారంగపూర్‌కు చెందిన జంగం రాజయ్య(65) పింఛన్ రావడం లేదన్న బెంగతో శుక్రవారం రాత్రి క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.