Venkatapalli Pedatanda
-
వైఎస్ జగన్ ఆరో రోజు రైతు భరోసా యాత్ర
-
'రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు'
అనంతపురం:రైతులకు సరైన గిట్టుబాటు ధర రాకపోవడంతో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో శనివారం ఆరో రోజు రైతు భరోసా యాత్రలో భాగంగా కనేకల్ లో ధాన్యాన్ని వైఎస్ జగన్ పరిశీలించారు. ఈ సందర్భంగా వరిపంట సాగు చేసే రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాలని రైతులు జగన్ కు విన్నవించారు. ధాన్యానికి ప్రభుత్వం రూ. 1360 మద్దతు ధర ప్రకటించినా.. కనేకల్ లో మాత్రం రూ. 1300 లోపే ధాన్యాన్ని కొనుగోలు చేయడాన్ని జగన్ తప్పుబట్టారు. ఎరువుల ధరలు అమాంత పెరిగడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కనీసం పెట్టుబడులు సైతం గిట్టుబాటు కావకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
అనంతలో వైఎస్ జగన్ ఆరో రోజు భరోసా యాత్ర
అనంతపురం:వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లాలో చేపట్టిన రైతు భరోసా యాత్ర శనివారం ఆరో రోజుకు చేరుకుంది. దీనిలో భాగంగా ఉరవకొండ, రాయదుర్గం నియోజకవర్గాల్లో వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర కొనసాగుతోంది. ఉరవకొండ నుంచి ఆరంభమయ్యే భరోసా యాత్ర కనేకల్ వరకూ కొనసాగనుంది. కనేకల్ లో అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడ రైతు శర్మాస్ కుటాంబాన్ని జగన్ పరామర్శించనున్నారు. -
ఉరవకొండలో వైఎస్ జగన్ భరోసా యాత్ర
-
రైతు కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శ
అనంతపురం: రైతు భరోసా యాత్రలో భాగంగా జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఏపీ శాసనసభ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం పరామర్శించారు. వజ్రకరూరు మండలం పందికుంట ఓబులేసు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. తాను అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు. ఉరవకొండ మండలం వెంకటపల్లి పెదతండాలో ఆత్మహత్య చేసుకున్న గోవింద్ నాయక్ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. అన్నివిధాలా అండగా ఉంటామని వారికి ధైర్యం చెప్పారు.రైతు భరోసా యాత్ర చేస్తున్న వైఎస్ జగన్ను చూసేందుకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. యువకులు ఆయనతో కరచాలనం చేయడానికి పోటీపడుతున్నారు.