VENKATAPURAM VILLEGE
-
ఆస్ట్రేలియా అతిథులు వచ్చేశాయ్!
వెంకటాపురం(పెనుగంచిప్రోలు): వెంకటాపురంలో విదేశీ విహంగాల సందడి మొదలైంది. ‘ఆస్ట్రేలియా’లోని ఎర్రకాళ్ల కొంగలు (పెయింటెడ్ స్టాక్స్) పక్షి ప్రేమికులను పలకరిస్తున్నాయి. గ్రామస్తులకు కనువిందు చేస్తున్నాయి. కొల్లేరు తర్వాత ఇక్కడికే.. ఏటా ఈ పక్షులు వేల మైళ్లు ప్రయాణించి నవంబర్, డిసెంబర్ నెలల్లో గ్రామానికి చేరుకుంటాయి. అయితే ఈ ఏడాది విదేశీ పక్షులు సుమారు వెయ్యికి పైగా చేరుకొని నాలుగైదు రోజులవుతోంది. ఇవి ఆరు నెలల పాటు ఇక్కడి చెట్లపై ఆవాసాలు ఏర్పాటు చేసుకొని గుడ్లుపెట్టి, సంతానత్పోత్తి చేసుకుని మే చివరి వారంలోగానీ, జూన్‌లోగానీ తిరిగి తమ ప్రాంతానికి వెళ్తాయి. కొల్లేరు తర్వాత విదేశీ పక్షులు అధికంగా వచ్చేది వెంకటాపురం గ్రామానికే. ఇది పెనుగంచిప్రోలుకు పది కిలోమీటర్ల దూరంలోనే ఉంది. పుట్టింటికి వచ్చిన ఆడబిడ్డలా విదేశీ పక్షుల రాకతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏటా గ్రామానికి వచ్చే పక్షులను గ్రామస్తులు పుట్టింటికి వచ్చిన ఆడబిడ్డలా చూసుకుంటారు. ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న ఈ పక్షుల కారణంగా గ్రామం పాడిపంటలు, సుఖ శాంతులతో వరి్ధల్లుతోందని వారి నమ్మకం. పక్షుల కోలాహలం రంగు రంగుల రెక్కలు, పొడవాటి ఎర్రని ముక్కు, పెద్ద కళ్లతో సందడి చేస్తున్నాయి. ముందుగా కొన్ని పక్షులు గ్రామానికి వచ్చి పరిసరాలు, ఆహార లభ్యత చూసుకొని అనువుగా ఉంటే వెనక్కు వెళ్లి తోటి పక్షులతో గ్రామానికి చేరుకుంటాయి. సమీపంలో దొరికే పుల్లలు, గడ్డిని తెచ్చి చెట్ల కొమ్మలపైకి చేర్చి గూళ్లు చేసి గుడ్లు పెడతాయి. గ్రామానికి తరలి వచ్చే విదేశీ పక్షుల సంరక్షణను పట్టించుకోవటం లేదు. గ్రామం మధ్య నుంచి వెళ్లే 11 కేవీ విద్యుత్ తీగల కారణంగా ఏటా పెద్ద సంఖ్యలో పక్షులు మృత్యువాత పడుతున్నాయి. దీనిపై గ్రీన్ టీం నిర్వాహకులు జూటూరి అప్పారావు, వైఎస్సార్ సీపీ నేత గూడపాటి శ్రీనివాసరావు సహకారంతో గతంలో తీగలకు ప్లాస్టిక్ పైపులు అమర్చారు. అయితే ఇంకా పైపులు తొడగాల్సి ఉంది. కోతుల వల్ల పక్షుల ఆవాసానికి అవరోధం కలుగుతోంది. -
భయం గుప్పిట్లో వెంకటాపురం
పద్మనాభం(భీమిలి): మండలంలోని వెంకటాపురం గ్రామస్తులు భయం గుప్పెట్లో ఉన్నారు. గ్రామంలో రెండు కరోనా పాజిటివ్ కేసులు రావడంతో ఆందోళన చెందుతున్నారు. పోలీసులు, అధికారులు గ్రామాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.ఎవరూ రాకుండా కట్టడి చేశారు. లండన్ నుంచి వచ్చిన యువకుడికి ఇప్పటికే పాజిటివ్ వచ్చింది. తాజాగా ఆయన తండ్రికి కూడా పాజిటివ్ నమోదైంది. వెంకటాపురం గ్రామానికి చెందిన 24 ఏళ్ల యువకుడు లండన్‌లో ఎంఎస్ చదువుతున్నాడు. లండన్‌లోని బర్మింగ్‌హామ్ నుంచి ఢిల్లీ మీదుగా విశాఖ విమానశ్రయానికి వచ్చాడు. ఇక్కడ నుంచి ఈ నెల 17న పద్మనాభం మండలంలో ఉన్న తన సొంత గ్రామమైన వెంకటాపురం వచ్చాడు. 20న కరోనా లక్షణాలు ఉన్నట్టు అనుమానం వచ్చింది. 21న విశాఖపట్నం చెస్టు ఆస్పత్రిలో చేరాడు. 22న ఇతనికి కరోనా పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. దీంతో యువకుడు కుటుంబంలోని నలుగురితో పాటు మొత్తం 23 మందిని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరికి పాజిటివ్‌రావడంతో 21 మంది గాయత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా యువకుడు తండ్రి(54)కి కరోనా పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. దీంతో శుక్రవారం మరో 10 మందిని ఐసోలేషన్‌కు తరలించారు. వైద్య బృందాల ఆరా దీంతో యువకుడు తండ్రి ఎవరెవరిని కలిశాడో వైద్య శాఖ అధికారులు తెలుసుకుంటున్నారు. ఇప్పటికే రేవిడి ఆస్పత్రికి ఎదురుగా ఉన్న హార్డ్ వేర్ షాపు వద్దకు వెళ్లడంతో పాటు అనేక మందిని కలిశాడు. ముందుస్తుగా అనుమానంతో పది మందిని గాయత్రి ఆస్పత్రికి తరలించారు. వెంకటాపురంలో కరోనా కల్లోలం సృష్టించడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఎవరికి కరోనా వైరస్ సోకుతుందోనని ప్రజలు భయ కంపితులవుతున్నారు. రేవిడి, పాండ్రంగి సచివాలయ పరిధిలోని పది గ్రామాల్లో వలంటీర్లు , ఆశలు 50 బృందాలుగా ఏర్పడి రీ సర్వే చేస్తున్నారు. కొనసాగుతున్న ఇంటింట సర్వే మండలంలోని 22 పంచాయతీ పరిధిలో ఆశలు, వలంటీర్లు ససర్వే చేశారు. గ్రామాల్లోకి ఇతర రాష్ట్రాల నుంచి 165 మంది, విదేశాల నుంచి పది మంది వచ్చినట్టు గుర్తించారు. వీరంతా ఇళ్లలోనే ఉండాలని వైద్య శాఖ అధికారులు, మండల స్థాయి అధికారులు సూచించారు. వెంకటాపురం గ్రామంలోకి ఇతరులను ఎవరనీ వెళ్లనివ్వలేదు. -
ఎర్రకాళ్ల కొంగ.. వచ్చెనుగా..
ఆస్ట్రేలియాకు చెందిన పెయింటెడ్ స్టార్క్(ఎర్రకాళ్ల కొంగల)ల సందడి ఆ గ్రామంలో మొదలైంది. సంతానోత్పత్తి కోసం వేల కిలోమీటర్లు దాటి వచ్చే విదేశీ అతిథుల కోసం గ్రామమంతా ఎదురు చూస్తుంది. అవి వచ్చాక తమ ఇంటి బిడ్డలే వచ్చారు అన్నంతగా గ్రామంలో పండుగ వాతావరణం కనిపిస్తుంది. సరైన రక్షణ చర్యలు, సౌకర్యాలు లేకపోయినా తామే వాటికి రక్షణ కవచంలా నిలబడతారు. దశాబ్దాలుగా తమ గ్రామానికి వస్తున్న పక్షులను వెంకటాపురం గ్రామస్తులు కంటికి రెప్పలా కాపాడుతున్నారు. చిన్న పక్షి నేలరాలినా విలవిలలాడతారు. వెంకటాపురం(పెనుగంచిప్రోలు): గ్రామంలో ఆస్ట్రేలియాకు చెందిన ఎర్రకాళ్ల కొంగల (పెయింటెడ్ స్టార్క్) సందడి మొదలైంది. ఏటా ఈపక్షులు వేల మైళ్లు ప్రయాణించి నవంబర్, డిసెంబర్ నెలల్లో గ్రామానికి చేరుకుంటాయి. ఈఏడాది కొంచెం ఆలస్యంగా గ్రామానికి చేరుకున్నాయి. నాలుగు రోజుల క్రితం ఇక్కడి నేలపై అడుగుపెట్టాయి. ఆరు నెలల పాటు ఇక్కడి చెట్లపై ఆవాసాలు ఏర్పాటు చేసుకొని గుడ్లుపెట్టి, పిల్లలను వృద్ధి చేసుకొని మే చివరి వారం లేదా జూన్‌లో తిరిగి తమ ప్రాంతానికి వెళ్లిపోతాయి. పక్షుల రాకతో గ్రామానికి మేలు ఏటేట తమ గ్రామానికి వచ్చే విదేశీ పక్షులను స్థానికులు తమ పిల్లల్లా చూసుకుంటారు. నవంబర్ మాసం వచ్చిందంటే పక్షులు ఇంకా రాలేదనే చర్చ నడుస్తుంది. అవి వచ్చేంత వరకు ఎదురు చూస్తారు. అవి వచ్చాక పుట్టింటికి వచ్చిన తమ బిడ్డల్లా చూసుకుంటారు. ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న ఈపక్షుల వల్లనే తమ గ్రామం పాడిపంటలు, సుఖశాంతులతో వర్ధిల్లుతుందని వారి నమ్మకం. దశాబ్దాల క్రితం ఈపక్షులు గ్రామానికి రావటం నాటి నుంచే గ్రామం సుభిక్షంగా ఉందని, వాటికి ఎవరైనా హాని తలపెడితే ఊరుకోమని గ్రామస్తులు అంటున్నారు. సంరక్షణ చర్యలు కరువు గ్రామానికి తరలి వచ్చే విదేశీ పక్షుల సంరక్షణను పట్టించుకోవటం లేదు. గ్రామం మధ్య నుంచి వెళ్లే 11 కేవీ విద్యుత్ తీగల వలన ప్రతి ఏడాది వందల సంఖ్యలో పక్షులు మృత్యువాత పడుతున్నాయి. దీనిపై గ్రీన్ టీం నిర్వాహకుడు జూటూరి అప్పారావు, వైఎస్సార్ సీపీ నాయకుడు గూడపాటి శ్రీనివాసరావు సహకారంతో గతంలో తీగలకు ప్లాస్టిక్ పైపులు అమర్చారు. అయితే ఇంకా పైపులు తొడగాల్సి ఉంది. గ్రామంలో చెట్లు కొట్టటం, నీటి వసతి లేకపోవటం కూడా పక్షుల ఆవాసానికి అవరోధంగా ఉన్నాయి. అయితే ఈఏడాది చెరువుల్లో, గ్రామంలో ఉన్న నీటి కుంటలో నీరు పుష్కలంగా ఉండటంతో పక్షులకు తాగునీటి కష్టాలు తొలిగినట్టే అని గ్రామస్తులు అంటున్నారు. గ్రామాన్ని పర్యాటక రంగంగా అభివృద్ధి చేస్తామని గత టీడీపీ ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన హామీలు నీటిమూటలుగా మిగిలి పోయాయి. ఇప్పటికైనా విదేశీ పక్షుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని పక్షి ప్రేమికులు కోరుతున్నారు. పక్షుల కోలాహలం రంగు రంగుల రెక్కలు, పొడవాటి ఎర్రని ముక్కులు, పెద్ద శరీరం, పెద్ద కళ్లతో చూపరులకు ఎంతో సంతోషాన్నిచ్చేలా ఉండే ఈపక్షులు సందడి చేస్తాయి. వాటి కోలాహలం మంత్ర ముగ్ధులను చేస్తుంది. రాత్రుళ్లు అవి చేసే పెద్ద అరుపులను సైతం పట్టించుకోకుండా గ్రామస్తులు వాటి సంరక్షణను తమ బాధ్యతగా చూసుకుంటారు. ముందుగా కొన్ని పక్షులు గ్రామానికి వచ్చి పరిసరాలు, ఆహార లభ్యత చూసుకొని అనువుగా ఉంటే వెనక్కి వెళ్లి తోటి పక్షులతో గ్రామానికి చేరుకుంటాయి. సమీపంలో దొరికే పుల్లలు, గడ్డిని తెచ్చి చెట్ల కొమ్మలపైకి చేర్చి గూడులు చేసి గుడ్లు పెడతాయి. చెరువులు, మునేరులో దొరికే చేపలు తిని బతుకుతాయి. అందమైన ఎర్రకాళ్ల కొంగలను చూసేందుకు వచ్చే సందర్శకులకు ఈ ప్రాంతంలో ఎటువంటి సౌకర్యాలు లేకపోవడం లోటు. -
పేదల భూములు.. పెద్దల సొంతం
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పేదల భూములపై అధి కార పార్టీ పెద్దల కన్నుపడింది. సుమారు రూ.5 కోట్ల విలువైన రెండెకరాల భూమిని అడ్డదారిలో సొంతం చేసుకున్నారు. దానిని ప్లాట్లుగా విభజించి రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగించేందుకు రంగం సిద్ధం చేశారు. అధికార పార్టీ నేత అండదండలతోనే ఈ తంతు నడుస్తోంది. దళితులకు కేటాయించిన అస్సైన్డ్ భూముల క్రయ విక్రయాలకు అవకాశం లేకపోయినా పంచాయతీ సిబ్బంది నిర్వాకంతో అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యవహా రం సాగిపోతోంది. వివరాల్లోకి వెళితే.. ఏలూరు మండలం వెంకటాపురం çపంచాయతీ పరిధిలోని సుంకరవారి తోటలో సుమారు 20 ఏళ్ల క్రితం నిరుపేద ఎస్సీ, బీసీ కుటుంబాలకు ప్రభుత్వం వ్యవసాయం భూమి పంపిణీ చేసింది. ఒక్కొక్కరికి 25 సెంట్ల చొప్పున మొత్తం 8 మందికి రెండెకరాల భూమిని అధికారులు అందించారు. వ్యవసాయం చేసుకోవాలని పేదలకు సూచించారు. కొన్నేళ్ల తర్వాత ఈ భూముల చుట్టూ ప్రభుత్వ, ప్రైవేట్ లేఅవుట్లు వెలిశాయి. దీంతో అక్కడి భూముల ధరలు పెరగడంతో కొందరు వ్యక్తుల కళ్లు ఈ భూమిపై పడింది. పేద కష్టాలను ఆసరా చేసుకుని తక్కువ మొత్తానికే ఆ భూమిని కొనుగోలు చేశారు. ఈ విషయం తెలిసి ఎస్సీ, బీసీ నాయకులమంటూ కొందరు రంగంలోకి దిగారు. అస్సైన్డ్ భూముల కొనుగోలు నేరమంటూ బ్లాక్మెయిల్ చేసి సొమ్ములు గుంజుకున్నారు. ఇలా భూములు చేతులు మారాయి. ఇప్పుడు ఆ భూమిని లే–అవుట్ చేసి ప్లాట్లుగా విభజించి విక్రయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం పంచాయతీ కార్యాలయం నుంచి లే–అవుట్ అనుమతులు సైతం పొందారు. నిజానికి అస్సైన్డ్ భూముల్ని వాణిజ్య అవసరాలకు ఉపయోగించకూడదు. అధికార పార్టీ కనుసన్నల్లో.. ఇప్పుడు ఈ వ్యవహారమంతా అధికార పార్టీ నేత చేతుల్లోకి వెళ్లింది. అస్సైన్డ్ భూమిని ప్లాట్లుగా విభజించి అమ్ముకోవాలంటే.. తనకు పర్సంటేజీ ఇవ్వాలని తన అనుచరుల ద్వారా ఆ నాయకుడు డిమాండ్ చేసినట్టు సమాచారం. నెల రోజులపాటు తర్జనభర్జనల అనంతరం ఆ భూమిని ప్లాట్లుగా విభజిస్తున్న వ్యక్తులు మాజీ ప్రజాప్రతి నిధి ద్వారా టీడీపీ నేతలకు మొత్తం లాభంలో 25 శాతం కమీషన్ ఇచ్చేం దుకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం. దీంతో ఇప్పటివరకు అడ్డంకులన్నీ తొలగిపోయాయి. పనులు వేగం పుంజుకున్నాయి. భూమిని పూడ్చటానికి మట్టి తోలకాలు చురుగ్గా సాగుతున్నాయి. కలెక్టర్‌కు ఫిర్యాదు తమ భూములను అక్రమంగా లే–అవుట్ చేసి విక్రయించేందుకు కొం దరు వ్యక్తులు ఏర్పాట్లు చేస్తున్నారని, ఆ భూములను తమకు తిరిగి ఇప్పించాలంటూ గతంలో భూములు పొందిన కొందరు కలెక్టర్ కాటంనేని భాస్కర్‌కు ఫిర్యాదు చేశారు. ఆర్ఎస్ నంబర్ 903–1బీ4లో ప్రభుత్వం 25 సెంట్ల చొప్పున భూమిని కేటాయిం చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కొంతమంది రాజకీయ నాయకులు, వెంకటాపురం పంచాయతీ సిబ్బంది కలిసి లే–అవుట్ చేసినట్టుగా పత్రాలు సృష్టించి తమ భూముల్ని కాజేస్తున్నారని వాపోయారు. ఇదేమని అడిగితే తమపై దౌర్జన్యానికి దిగుతున్నారని లబ్ధిదారులు కొత్తపల్లి కుటుంబరావు, ముల్లంగి వెంకటేశ్వరరావు, ఇమ్మల జ్యోతి తదితరులు కలెక్టర్‌కు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.