verbal argument
-
అక్కడ మహిళలను దూషిస్తే జరిమానా..!
మద్యపానంపై నిషేధం విధించిన ఊళ్లు, ఆ నిషేధాన్ని ఉల్లంఘించిన వారిపై జరిమానాలు వేసే ఊళ్లు మనకు తెలుసు. గ్రామ పరిశుభ్రతలో భాగంగా ఎక్కడ పడితే అక్కడ చెత్తవేసే వారిపై జరిమానా వేసే ఊళ్లు, బహిరంగ ప్రదేశాలలో పొగ తాగేవారిపై జరిమానా వేసే ఊళ్ల గురించీ మనకు తెలుసు, అయితే మహారాష్ట్రలోని సౌందాల గ్రామం వినూత్న జరిమానాతో దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. బహుశా ఇలాంటి జరిమానా దేశచరిత్రలోనే మొదటిసారి కావచ్చు.మహారాష్ట్రలోని సౌందాల గ్రామంలో మహిళలను కించపరిచినట్లు మాట్లాడినా, తిట్టినా జరిమానా విధిస్తారు. అహల్యనగర్ జిల్లా నెవాసా తాలూకాలోని సౌందాల గ్రామ సభ మహిళలపై అసభ్య పదజాలానికి వ్యతిరేకంగా తీర్మానం చేసింది. ముంబైకి మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో వాదోపవాదాల సమయంలో, తగాదాలలో తల్లులు, సోదరీమణులను లక్ష్యంగా చేసుకొని బూతులు తిట్టడం సాధారణ దృశ్యంగా కనిపించేది.‘తమ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు అనే విషయం బూతులు మాట్లాడేవారు మరిచిపోతారు. బూతు పదాలు వాడిన వారిపై రూ.500 జరిమానా విధించాలని నిర్ణయించాం. సమాజంలో మహిళల గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడే ప్రయత్నమే ఈ నిర్ణయం’ అంటాడు తీర్మానం ప్రవేశపెట్టిన శరద్ ఆర్గాడే. వితంతువులను మతపరమైన, సామాజిక ఆచారాలలో భాగస్వామ్యం చేయడంలోనూ గ్రామం ముందుంటుంది.భర్త చనిపోయిన తరువాత సింధూరం తుడవడం, గాజులు పగల కొట్టడం, మంగళ సూత్రం తొలగించడంలాంటివి ఆ గ్రామంలో నిషిద్ధం. సౌందాల వివాదరహిత గ్రామంగా రాష్ట్రస్థాయిలో అవార్డ్ అందుకుంది. ‘జరిమానా వల్ల మార్పు వస్తుందా? అని మొదట్లో చాలామంది సందేహించారు. విధించే జరిమానా చిన్న మొత్తమే కావచ్చు. అయితే ఈ తీర్మానం వల్ల బూతు మాటలు మాట్లాడడం తప్పు అనే భావన గ్రామస్థుల మనసులో బలంగా నాటుకుపోతుంది. మహిళలను కించపరిచేలా మాట్లాడడం తగ్గిపోతుంది’ అంటుంది విమల అనే గృహిణి.(చదవండి: ఇండియా నన్ను స్వీకరిస్తే చాలు..!: జాక్వెలిన్ ఫెర్నాండేజ్) -
లైవ్‌లోనే న్యూస్ రీడర్ల మధ్య వాగ్వాదం
ఇస్లామాబాద్ : లైవ్‌లోనే ఇద్దరు న్యూస్ రీడర్లు వాగ్వాదానికి దిగిన వీడియో ఒకటి నెట్లో జోరుగా చక్కర్లు కొడుతోంది. ‘ఈమెతో నేనేలా బులిటెన్ చదవాలి?’ అంటూ యాష్ ట్యాగ్‌తో ఆ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. పాకిస్థాన్‌కు చెందిన ఓ న్యూస్ ఛానెల్ వీడియో అది. లాహోర్‌కు చెందిన సిటీ 42 ఛానెల్ న్యూస్ రీడర్లు ఈ వాగ్వాదానికి దిగారు. ‘ఈమెతో నేనెలా బులిటెన్ చదవాలి అంటూ మేల్ న్యూస్ రీడర్ మొదలుపెట్టగా.. తనతో మాట్లొద్దంటూ ఆమె చెప్పటం.. ఆపై నేను నీ గొంతు గురించి మాట్లాడుతున్నా అంటూ అతను బదులివ్వటం.. గౌరవమిచ్చి మాట్లాడమంటూ ఆమె అనటం... అలా ఆ మాటల యుద్ధం అలాగే కొనసాగటం చూడొచ్చు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ కాగా.. ఎవరికి తోచిన రీతిలో వాళ్లు కామెంట్ చేస్తున్నారు. ‘ఈ గొడవ అయ్యాక వారిద్దరు డిన్నర్‌కు వెళ్తారని ఒకరంటే.. ఆమె గొంతు అంత దారుణంగా ఏం లేదని మరికొందరు.. ఇక ఆమెకు పెళ్లయ్యి ఉంటే ఆమెను భరిస్తున్న భర్తకు జోహార్లు అంటూ ఇంకొందరు... ఛానెల్ వాళ్లు వీళ్లతో ఎలా వేగుతున్నారో అంటూ మరికొందరు... జోకులు పేలుస్తున్నారు. వీడియో ఎలా బయటకు వచ్చిందో స్పష్టత లేకపోయినా ఫేస్బుక్ లో అది ఇప్పుడు షేర్ల మీద షేర్లతో తెగ వైరల్ అవుతోంది. -
ట్రంప్‌పై కోపంతో చెవి కొరికిపారేశాడు
పిట్స్బర్గ్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గురించి చర్చించుకుంటూ ఆ చర్చలు తారాస్థాయికి తీసుకెళ్లి పరస్పరం దాడులు చేసుకుంటున్నారు. ఇలాంటి గొడవ కారణంగా ఓ యువకుడు తన చెవిని కోల్పోయాడు. ట్రంప్‌పై జరుగుతున్న చర్చలో మాటామాటా పెరిగి ఓ యువకుడు తన రూమ్మేట్ చెవిని పూర్తిగా కొరికేశాడు. అతడి చేతి వేళ్లను మెలేసి విరిగిపోయేలా చేశాడు. కాలి వేళ్లను కూడా చితక్కొట్టాడు. ఈ ఘటన పిట్స్ బర్గ్‌లోని ఈస్ట్ లైబ్రరీ వైపు ఉన్న ఓ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న ఇంట్లో చోటు చేసుకుంది. బాధితుడు (30) ఏళ్ల వ్యక్తి. అతడి మాటల ప్రకారం అతడికి రూమ్ మేట్‌గా ఉన్న యువకుడు మెక్సికోకు చెందినవాడిగా తెలుస్తోంది. పొద్దున్నే ఉదయం 6.45గంటల ప్రాంతంలో డోనాల్డ్ ట్రంప్ గురించి చర్చ పెట్టుకున్నారు. ఈ క్రమంలో ట్రంప్ మెక్సికన్లను అస్సలు ఓర్వడని దాడి చేసిన వ్యక్తి అన్నట్లు తెలిసింది. అయితే, బాధితుడు ట్రంప్‌కు మద్దతిచ్చాడా లేక వ్యతిరేకించాడా అనే విషయం మాత్రం పోలీసులకు చెప్పలేదు. వారిద్దరు మాట్లాడుకునే క్రమంలో చిర్రెత్తిపోయిన మరో యువకుడు వెంటనే దాడి చేశాడు. చెవి కొరికి పీకి పారేయడంతో అతడుగట్టిగా అరుస్తూ పెట్రోల్ బంక్‌లోకి పరుగెత్తాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడి తెగిపోయిన చెవిభాగాన్ని తీసుకొని ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యులకు అందించగా తిరిగి అతికించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉంది. దాడి చేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.