లైవ్‌లోనే న్యూస్‌ రీడర్ల మధ్య వాగ్వాదం | Pakistan News Readers Verbal Spat Viral | Sakshi
Sakshi News home page

Published Mon, Feb 26 2018 6:36 PM | Last Updated on Mon, Feb 26 2018 6:37 PM

Pakistan News Readers Verbal Spat Viral - Sakshi

ఇస్లామాబాద్‌ : లైవ్‌లోనే ఇద్దరు న్యూస్‌ రీడర్లు వాగ్వాదానికి దిగిన వీడియో ఒకటి నెట్‌లో జోరుగా చక్కర్లు కొడుతోంది. ‘ఈమెతో నేనేలా బులిటెన్‌ చదవాలి?’ అంటూ యాష్‌ ట్యాగ్‌తో ఆ వీడియోను తెగ వైరల్‌ చేస్తున్నారు. పాకిస్థాన్‌కు చెందిన ఓ న్యూస్‌ ఛానెల్‌ వీడియో అది. 

లాహోర్‌కు చెందిన సిటీ 42 ఛానెల్‌ న్యూస్‌ రీడర్లు ఈ వాగ్వాదానికి దిగారు. ‘ఈమెతో నేనెలా బులిటెన్‌ చదవాలి అంటూ మేల్‌ న్యూస్‌ రీడర్‌ మొదలుపెట్టగా.. తనతో మాట్లొద్దంటూ ఆమె చెప్పటం.. ఆపై నేను నీ గొంతు గురించి మాట్లాడుతున్నా అంటూ అతను బదులివ్వటం.. గౌరవమిచ్చి మాట్లాడమంటూ ఆమె అనటం... అలా ఆ మాటల యుద్ధం అలాగే కొనసాగటం చూడొచ్చు. 

ఆ వీడియో సోషల్‌ మీడియాలో షేర్‌ కాగా.. ఎవరికి తోచిన రీతిలో వాళ్లు కామెంట్‌ చేస్తున్నారు. ‘ఈ గొడవ అయ్యాక వారిద్దరు డిన్నర్‌కు వెళ్తారని ఒకరంటే.. ఆమె గొంతు అంత దారుణంగా ఏం లేదని మరికొందరు.. ఇక ఆమెకు పెళ్లయ్యి ఉంటే ఆమెను భరిస్తున్న భర్తకు జోహార్లు అంటూ ఇంకొందరు... ఛానెల్‌ వాళ్లు వీళ్లతో ఎలా వేగుతున్నారో అంటూ మరికొందరు... జోకులు పేలుస్తున్నారు. వీడియో ఎలా బయటకు వచ్చిందో స్పష్టత లేకపోయినా ఫేస్‌బుక్‌ లో అది ఇప్పుడు షేర్‌ల మీద షేర్‌లతో తెగ వైరల్‌ అవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement