ట్రంప్‌పై కోపంతో చెవి కొరికిపారేశాడు | man bites off another man ear in heated argument over donald trump | Sakshi
Sakshi News home page

ట్రంప్‌పై కోపంతో చెవి కొరికిపారేశాడు

Published Tue, Jan 24 2017 4:18 PM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

ట్రంప్‌పై కోపంతో చెవి కొరికిపారేశాడు - Sakshi

ట్రంప్‌పై కోపంతో చెవి కొరికిపారేశాడు

పిట్స్‌బర్గ్‌: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్ గురించి చర్చించుకుంటూ ఆ చర్చలు తారాస్థాయికి తీసుకెళ్లి పరస్పరం దాడులు చేసుకుంటున్నారు. ఇలాంటి గొడవ కారణంగా ఓ యువకుడు తన చెవిని కోల్పోయాడు. ట్రంప్‌పై జరుగుతున్న చర్చలో మాటామాటా పెరిగి ఓ యువకుడు తన రూమ్‌మేట్‌ చెవిని పూర్తిగా కొరికేశాడు. అతడి చేతి వేళ్లను మెలేసి విరిగిపోయేలా చేశాడు. కాలి వేళ్లను కూడా చితక్కొట్టాడు. ఈ ఘటన పిట్స్‌ బర్గ్‌లోని ఈస్ట్‌ లైబ్రరీ వైపు ఉన్న ఓ పెట్రోల్‌ బంక్‌ దగ్గర ఉన్న ఇంట్లో చోటు చేసుకుంది.

బాధితుడు (30) ఏళ్ల వ్యక్తి. అతడి మాటల ప్రకారం అతడికి రూమ్‌ మేట్‌గా ఉన్న యువకుడు మెక్సికోకు చెందినవాడిగా తెలుస్తోంది. పొద్దున్నే ఉదయం 6.45గంటల ప్రాంతంలో డోనాల్డ్‌ ట్రంప్ గురించి చర్చ పెట్టుకున్నారు. ఈ క్రమంలో ట్రంప్‌ మెక్సికన్లను అస్సలు ఓర్వడని దాడి చేసిన వ్యక్తి అన్నట్లు తెలిసింది. అయితే, బాధితుడు ట్రంప్‌కు మద్దతిచ్చాడా లేక వ్యతిరేకించాడా అనే విషయం మాత్రం పోలీసులకు చెప్పలేదు. వారిద్దరు మాట్లాడుకునే క్రమంలో చిర్రెత్తిపోయిన మరో యువకుడు వెంటనే దాడి చేశాడు.

చెవి కొరికి పీకి పారేయడంతో అతడుగట్టిగా అరుస్తూ పెట్రోల్‌ బంక్‌లోకి పరుగెత్తాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడి తెగిపోయిన చెవిభాగాన్ని తీసుకొని ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యులకు అందించగా తిరిగి అతికించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉంది. దాడి చేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement