vertical robbery
-
బాదేపల్లి మార్కెట్లో నిలువు దోపిడీ
♦ అమ్మిన సరుకుకు కమీషన్3కు బదులు 6శాతం వసూలు ♦ నిలదీసిన రైతు.. ♦ మంత్రి హరీశ్‌రావుకు ఫ్యాక్స్‌లో ఫిర్యాదు ఇదో కమీషన్ ఏజెంట్ దందా..మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా..అమ్మిన సరుకుకు మూడు శాతం కమీషన్‌కు బదులు ఆరుశాతం వసూలు చేశాడు. తక్ పట్టీకి అదనంగా మరో తెల్లచీటీపై నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు కట్‌చేసి లెక్కపత్రం అందజేస్తుండడంతో గమనించిన రైతు నిలదీశాడు. ఈ విషయంపై మార్కెట్ కార్యాలయంలో, మంత్రి హరీశ్‌రావుకు ఫిర్యాదు చేశాడు. జడ్చర్ల : తాను అమ్మిన సరకుకు డబ్బులు చెల్లించాల్సిన కమీషన్ ఏజెంట్ మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా డబ్బులు వసూలు చేసిన ఘటనపై ఓ రైతు సంబ ంధిత అధికారులు, మంత్రికి ఫిర్యాదు చేసిన సంఘటన గురువారం బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో చో టుచేసుకుంది. బాధిత రైతు కథనం ప్రకారం.. రాజాపూర్ మండలం కల్లెపల్లికి చెందిన రైతు బ్రహ్మచారి గత నెల 30 న 25 క్వింటాళ్ల మొక్కజొన్నను బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో కమీషన్ ఏజెంట్ జగన్నాథం ద్వారా క్వింటాల్‌కు రూ.1,426 చొప్పున విక్రయించి.. తక్‌పట్టీ తీసుకున్నారు. అయితే తక్పట్టిలో పొందుపరిచిన నిబంధనలకు విరుద్ధంగా సదరు కమీషన్ ఏజెంట్ తన దగ్గర ను ంచి అదనంగా కమీషన్‌ను వసూలు చేశారని రైతు యార్డు కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అదనంగా కమీషన్ వసూలు ఎందుకు చేస్తున్నారని కమీషన్ ఏజెంట్‌ను ప్రశ్ని ంచగా సరైన సమాధానం కూడా ఇవ్వకుండా యార్డులో అందరు ఇలాగే వసూలు చేస్తారని నిర్లక్షంగా వ్యవహరించారని విలేకరులు, వైస్‌చైర్మన్ శ్రీశైలంయాదవ్‌కు వివరించారు. తనకు మొత్తంగా రూ.36 వేలు రాగా కమీషన్ కింద రూ.1,274 పట్టుకుని మిగతా డబ్బులకు చెక్ ఇచ్చారని తెలిపారు. నిబంధనల ప్రకారం 3 శాతం కమీషన్ మాత్రమే వసూలు చేయాల్సి ఉండగా 6.50 శాతం వసూలు చేస్తున్నారని ఆరోపించారు. షాద్‌నగర్ వ్యవసాయ మార్కెట్లో 3 నుంచి 4 శాతం మాత్రమే కమీషన్ వసూలు చేస్తుండగా బాదేపల్లి మార్కెట్లో అంతకు మించి వసూలు చేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. అంతేకాకుండా తక్ పట్టీకి అదనంగా మరో తెల్లచీటీపై నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు కట్‌చేసి లెక్కపత్రం అందజేస్తున్నారని, వాస్తవంగా సరకు అమ్మిన తర్వాత రైతులకు ఎన్నిరోజులకు డబ్బులు ముట్టజెప్పాలన్న దానిపై స్పష్టత లేదని వాపోయారు. అధికారులు స్పందించాలి.. స్థానిక మార్కెట్ యార్డులో భారీ స్థాయిలో అక్రమాలు చోటుచేసుకుంటున్నా పట్టించుకొనే నాథుడే కరువయ్యారని బాధిత రైతు ఆరోపించారు. ఇది తన ఒక్కడికి జరిగిన అన్యాయం కాదని.. వందలాది మంది అమాయక రైతులను ఇలాగే మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అన్యాయంపై సంబంధిత అధికారులతోపాటు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావుకు సైతం ఫ్యాక్స్‌లో ఫిర్యాదు చేశానన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రైతాంగానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా యార్డులో హమాలీలు, చాట కూలీ రేట్లు అధికంగా ఉన్నాయని వారికి చెల్లించే కూలీ తక్కువగా ఉండడంతో అదనంగా చెల్లించేందుకు రైతుల నుంచి వసూలు చేస్తున్నార ని వ్యాపార సంఘం అధ్యక్షుడు బాలస్వామి, కార్యదర్శి పరుశవేది పేర్కొన్నారు. దీనిపై అధికారులు, పాలకమండలి సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ శ్రీశైలంయాదవ్ తెలిపారు. -
వడ్డేపల్లి కట్టపై ప్రేమ జంటల నిలువు దోపిడీ
c చేస్తున్న హోంగార్డులు బాధితుల ఫిర్యాదుతో వెలుగులోకి కాజీపేట : వడ్డేపల్లి రిజర్వాయర్ కట్టపై నిల్చు ని ప్రకృతి అందాలను తిలకించడానికి వచ్చే జంటలను కొంతకాలంగా ఇద్దరు వ్యక్తులు పోలీసుల పేరుతో వేధింపులకు గురి చేస్తూ డబ్బులు గుంజుతున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. కట్టపైకి వచ్చే పర్యాటకులు నీళ్లలోకి దిగకుండా చర్యలు చేపట్టడానికి మున్సిపల్ అధికారులు ముగ్గురు హోంగార్డులను డిప్యూటేష¯ŒSపై తీసుకుని నియమించింది. వీరు కట్టపై పచ్చని గార్డె¯ŒS, చెరువునీటి సోయగాలను తిలకించడానికి వచ్చే ప్రేమ జంటలను పోలీసుల పేరుతో వేధిస్తూ బలవంతంగా జేబులు ఖాళీ చేస్తున్నారు. వీరు తొలుత ఎంచుకున్న జంటలను సెల్ఫో¯ŒSలో ఫొటోలు తీస్తున్నారు.. తర్వాత వారి దగ్గరికి వెళ్లి పోలీస్‌స్టేçÙ¯ŒSకు నడవండి అంటూ జీపు కోసం ఫో¯ŒS చేసినట్లు నటిస్తున్నారు. ఇంతలో మరో వ్యక్తి రంగ ప్రవేశం చేసి తాను పత్రికా విలేకరినని రేపు మీ ఇద్దరి ఫొటోలు పేపర్లలో వస్తాయంటూ భయభ్రాంతులకు గురిచేస్తుంటాడు. దీంతో ప్రేమజంటలు భయంతో వణికిపోతూ కాళ్లావేళ్లాపడినా వినకుండా వారిపై చేయి చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పత్రికల్లో ఫొటోలు వస్తే పరువు ఎక్కడ పోతుందనే భయంతో వారు అడిగినంతగా సమర్పించుకుని బతుకు జీవుడా అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు. ఎవరైనా ఎదురుతిరిగితే చేయి చేసుకోవడం, సెల్ఫోన్లు గుంజుకోవడం పరిపాటిగా మారింది.అయితే ఇన్నాళ్లు గుట్టుచప్పుడు కాకుండా సాగిస్తున్న ఈ దందాపై శుక్రవారం పోలీసులకు అందిన ఫిర్యాదుతో వెలుగు చూసింది. వెలుగు చూసిందిలా.. శుక్రవారం మధ్యాహ్నం కాజీపేట పట్టణానికి చెందిన ఓ యువకుడు తన అక్క కూతురును తీసుకొస్తుండగా వర్షం పడుతుండటంతో వడ్డెపల్లి కట్టపై ఉన్న సుబ్రహ్మణ్యస్వామి దేవాలయంలో అరుగులపైకి వెళ్లాడు. వారిని చూసిన పోలీసు, విలేకరినని చెప్పుకునే యువకులు ఇద్దరు వారిపై దాడి చేసి జేబులో ఉన్న డబ్బులు గుంజుకోవడంతోపాటు చేతిలో ఉన్న సెల్ఫో¯ŒSతో ఫొటోలు తీసి బెదిరించారు. అంతేగాక సెల్ఫో¯ŒSను నేలకేసి కొట్టడంతో పనికి రాకుండాపోయింది. దీంతో బాధితులు రోడ్డుపైకి వచ్చి ఏడుస్తూ బంధువులకు సమాచారమిచ్చారు. దీంతో వారు చేరుకొని కాజీ పేట పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా వర్షాలు బాగా పడుతున్నందున రెండు రోజుల తర్వాత వస్తే విచారించి నిందితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు బాధితులు ‘సాక్షి’కి తెలిపారు. ఈ విషయాన్ని పోలీసులు కూడా ధ్రువీకరించారు. -
అక్కర లేకున్నా వైద్యపరీక్షలు
డయాగ్నస్టిక్ సెంటర్లలో నిలువుదోపిడీ ఇష్టారాజ్యంగా ఫీజుల వసూళ్లు నిశ్చేష్టులై చూస్తున్న వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నల్లగొండ టౌన్ : జిల్లాలో సుస్తి చేసిందని వ్యక్తి అస్పత్రికి వచ్చాడంటే ల్యాబ్ నిర్వాహకులకు పండగే పండుగ.. అవసరం లేకున్నా సదరు డాక్టర్ రక్త, మూత్ర, ధైరాయిడ్, ఈసీజీ, షుగర్, స్కానింగ్ ఇతర పరీక్షలకు రెఫర్ చేయడం.. తప్పని సరి పరిస్థితులలో డాక్టర్ సూచించిన విధంగా పరీక్షలను నిర్వహించుకుని జేబులు ఖాళీ చేసుకోవడం రోగులకు పరిపాటిగా మారింది. వచ్చిన జబ్బుకు డాక్టర్ రాసే మందుల ఖర్చుకు మూడింతలు, నాలుగింతలు వైద్య పరీక్షలకు వెచ్చించాల్సి వస్తుంది. ఆస్పత్రికి వచ్చే వారి నుంచి పరీక్షల పేరుతో నిలువుదోపిడి చేస్తూ ల్యాబ్‌ల నిర్వాహకులు లక్షలాది రూపాయలను ఇష్టారాజ్యంగా వసూళ్లు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనుమతులు లేకుండానే... జిల్లాలోని ప్రధాన పట్టణాలైన నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, భువనగిరి, దేవరకొండ, హుజూర్నగర్, కోదాడ , చౌటుప్పల్, నకిరేకల్‌తో పాటు మండల కేంద్రాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున డయాగ్నస్టిక్ సెంటర్లు వెలిశాయి. నర్సింగ్హోమ్లతో పాటు ఇతర క్లినిక్‌లకు అనుబంధంగా ఇబ్బడి ముబ్బడిగా వందలాది ల్యాబ్‌లను ఏర్పాటు చేసి అమాయక ప్రజలను జలగల్లా పీల్చిపిప్పి చేస్తున్నారు. జిల్లాలో అధికారికంగా నర్సింగ్‌హోమ్‌లలో 215 డయాగ్నస్టిక్ సెంటర్లు ఉండగా, ఇతర ల్యాబ్‌లు 70 కలిపి మొత్తం 285కి మాత్రమే అనుమతులు ఉన్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వద్ద రికార్డులు ఉన్నాయి. అయితే వీటికి అదనంగా అనుమతులు లేకుండా మరో 50 వరకు చిన్నాచితక ల్యాబ్‌లు పనిచేస్తున్నాయి. జిల్లాలో ఎక్కడైనా ప్రైవేటు ఆసుపత్రి లేదా ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలంటే కచ్చితంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అనుమతి తీసుకోవాలి. ఆస్పత్రి లేదా ల్యాబ్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రతినిధులు తొలుత తాత్కాలిక ధ్రవీకరణ పత్రం జారీ చేస్తారు. అనంతరం పదిరోజుల్లో ఆస్పత్రిని పరిశీలించి అర్హులైన వైద్యులు, మౌలిక వసతులు, అత్యవసర వైద్య పరికరాలు, వ్యర్థపదార్థాల నిర్మూలన వ్యవస్థ, పారిశుద్ధ్య నిర్వహణ వంటివన్నీ సక్రమంగా ఉంటే శాశ్వత నమోదు పత్రం జారీ చేస్తారు. కానీ జిల్లాలో ఎక్కడా ప్రభుత్వ నిబంధనలు పాటించిన ల్యాబ్‌లు ఉన్నట్లు కనబడడం లేదని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనబడని ఫీజుల పట్టికలు... ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్స్ రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులరైజేషన్ యాక్టు ప్రకారం ప్రతీ ప్రైవేటు ల్యాబ్ లోనూ వారు అందించే సేవలు, వాటికి వసూళ్లు చేస్తున్న ఫీజులను తెలిపే బోర్డులను తెలుగు, ఇంగ్లీష్లలో ఏర్పాటు చేయాలి. కానీ జిల్లాలో ఎక్కడ కూడా ల్యాబ్‌లలో ఈ విధమైన బోర్డులు కనిపించవు. కొరవడిన నిఘా జిల్లాలోని ప్రయివేటు ల్యాబ్‌లపై ఆయా ప్రాంతాలలోని సీనియర్ పబ్లిక్‌హెల్త్ ఆఫీసర్ల నిఘా కొరవడింది. ఎస్పీహెచ్ఓలు ప్రతి నెల వారి పరిధిలోని ల్యాబ్‌లను తనిఖీ చేయడంతో పాటు లింగనిర్ధారణ పరీక్షల వివరాలు, ఇతర పరీక్షల వివరాలు, డెంగ్యూ, స్వైన్‌ఫ్లూ వంటి పరీక్షల వివరాలను సేకరించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి నివేదించాలి. నిబంధనలకు వ్యతిరేకంగా పరీక్షలను నిర్వహిస్తే ల్యాబ్ అనుమతిని రద్దు చేయాలి. కానీ కాసులకు కక్కుర్తి పడిన సంబంధిత శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. దీనిని అసరాగా తీసుకున్న ల్యాబ్‌ల నిర్వాహకులు ఆడిందే ఆట.పాడిందే పాటగా వ్యవహరిస్తూ ప్రజలను నిలువుదోపిడి చేస్తున్నారు. నిబంధనలకు విరుద్దంగా వ్యహరిస్తే చర్యలు జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ప్రయివేటు ల్యాబ్‌లపై చర్యలు తీసుకుంటాం. అనుమతులు లేని వాటిని సీజ్ చేస్తాం. ల్యాబ్‌లలో అనుమతి పత్రంతో పాటు ఫీజుల వివరాలను తెలిపే బోర్డులను ఏర్పాటుచేయాలి. జిల్లా వ్యాప్తంగా రెండు మూడు రోజులలో అన్ని ప్రైవేట్ ల్యాబ్‌లను పరిశీలించడానికి ప్రత్యేక బృందాలను పంపిస్తాం. - డాక్టర్ పి.ఆమోస్, డీఎంహెచ్ఓ