- c చేస్తున్న హోంగార్డులు
- బాధితుల ఫిర్యాదుతో వెలుగులోకి
వడ్డేపల్లి కట్టపై ప్రేమ జంటల నిలువు దోపిడీ
Published Sun, Sep 25 2016 12:09 AM | Last Updated on Mon, Sep 4 2017 2:48 PM
కాజీపేట : వడ్డేపల్లి రిజర్వాయర్ కట్టపై నిల్చు ని ప్రకృతి అందాలను తిలకించడానికి వచ్చే జంటలను కొంతకాలంగా ఇద్దరు వ్యక్తులు పోలీసుల పేరుతో వేధింపులకు గురి చేస్తూ డబ్బులు గుంజుతున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. కట్టపైకి వచ్చే పర్యాటకులు నీళ్లలోకి దిగకుండా చర్యలు చేపట్టడానికి మున్సిపల్ అధికారులు ముగ్గురు హోంగార్డులను డిప్యూటేష¯ŒSపై తీసుకుని నియమించింది. వీరు కట్టపై పచ్చని గార్డె¯ŒS, చెరువునీటి సోయగాలను తిలకించడానికి వచ్చే ప్రేమ జంటలను పోలీసుల పేరుతో వేధిస్తూ బలవంతంగా జేబులు ఖాళీ చేస్తున్నారు. వీరు తొలుత ఎంచుకున్న జంటలను సెల్‌ఫో¯ŒSలో ఫొటోలు తీస్తున్నారు.. తర్వాత వారి దగ్గరికి వెళ్లి పోలీస్‌స్టేçÙ¯ŒSకు నడవండి అంటూ జీపు కోసం ఫో¯ŒS చేసినట్లు నటిస్తున్నారు. ఇంతలో మరో వ్యక్తి రంగ ప్రవేశం చేసి తాను పత్రికా విలేకరినని రేపు మీ ఇద్దరి ఫొటోలు పేపర్లలో వస్తాయంటూ భయభ్రాంతులకు గురిచేస్తుంటాడు. దీంతో ప్రేమజంటలు భయంతో వణికిపోతూ కాళ్లావేళ్లాపడినా వినకుండా వారిపై చేయి చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పత్రికల్లో ఫొటోలు వస్తే పరువు ఎక్కడ పోతుందనే భయంతో వారు అడిగినంతగా సమర్పించుకుని బతుకు జీవుడా అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు. ఎవరైనా ఎదురుతిరిగితే చేయి చేసుకోవడం, సెల్‌ఫోన్లు గుంజుకోవడం పరిపాటిగా మారింది.అయితే ఇన్నాళ్లు గుట్టుచప్పుడు కాకుండా సాగిస్తున్న ఈ దందాపై శుక్రవారం పోలీసులకు అందిన ఫిర్యాదుతో వెలుగు చూసింది.
వెలుగు చూసిందిలా..
శుక్రవారం మధ్యాహ్నం కాజీపేట పట్టణానికి చెందిన ఓ యువకుడు తన అక్క కూతురును తీసుకొస్తుండగా వర్షం పడుతుండటంతో వడ్డెపల్లి కట్టపై ఉన్న సుబ్రహ్మణ్యస్వామి దేవాలయంలో అరుగులపైకి వెళ్లాడు. వారిని చూసిన పోలీసు, విలేకరినని చెప్పుకునే యువకులు ఇద్దరు వారిపై దాడి చేసి జేబులో ఉన్న డబ్బులు గుంజుకోవడంతోపాటు చేతిలో ఉన్న సెల్‌ఫో¯ŒSతో ఫొటోలు తీసి బెదిరించారు. అంతేగాక సెల్‌ఫో¯ŒSను నేలకేసి కొట్టడంతో పనికి రాకుండాపోయింది. దీంతో బాధితులు రోడ్డుపైకి వచ్చి ఏడుస్తూ బంధువులకు సమాచారమిచ్చారు. దీంతో వారు చేరుకొని కాజీ పేట పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా వర్షాలు బాగా పడుతున్నందున రెండు రోజుల తర్వాత వస్తే విచారించి నిందితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు బాధితులు ‘సాక్షి’కి తెలిపారు. ఈ విషయాన్ని పోలీసులు కూడా ధ్రువీకరించారు.
Advertisement
Advertisement