VERY LOW
-
International Womens Day: అవగాహన ఉన్నా వినియోగం కొంతే..
ముంబై: ఆర్థిక సేవలపై మహిళలకు అవగాహన పెరుగుతున్నప్పటికీ వారు వాటిని వినియోగించుకోవడం తక్కువగానే ఉంటోంది. బీమా తదితర సాధనాల గురించి మూడో వంతు మందికి తెలిసినా కూడా డిజిటల్ విధానంలో కొనుగోలు చేసే వారి సంఖ్య ఒక్క శాతం కూడా ఉండటం లేదు. రిజర్వ్ బ్యాంక్‌లో భాగమైన రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్, డిజిటల్ చెల్లింపుల నెట్వర్క్ పేనియర్‌బై నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం మహిళల్లో .. ముఖ్యంగా 18–35 ఏళ్ల వారిలో బీమాపై అవగాహన గతేడాది 29 శాతం మేర పెరిగింది. కానీ పాలసీల వినియోగం 1 శాతానికి లోపే ఉంది. మహిళలు ఎక్కువగా జీవిత బీమా, ఆరోగ్య బీమా వైపు మొగ్గు చూపుతున్నారు. 5,000 రిటైల్ స్టోర్స్‌లో ఆర్థిక సేవలను వినియోగించుకున్న ఈ వయస్సు గ్రూప్ మహిళలపై నిర్వహించిన సర్వే ద్వారా అధ్యయన నివేదిక రూపొందింది. దీనికి సంబంధించిన మరిన్ని విశేషాలు.. ► రిటైల్ స్టోర్స్‌లో మహిళలు ఎక్కువగా నగదు విత్‌డ్రాయల్, మొబైల్ రీచార్జీలు, బిల్లుల చెల్లింపుల సర్వీసులను వినియోగించుకుంటున్నారు. ఇతర త్రా పాన్ కార్డు దరఖాస్తులు, వినోదం, ప్రయాణాలు, ఈ–కామర్స్ మొదలైన వాటి సంబంధిత లావాదేవీలూ చేస్తున్నారు. ► తమ పిల్లలకు మంచి చదువు ఇవ్వడానికి అత్యధిక శాతం మహిళలు ప్రాధాన్యమిస్తున్నారు. ఇందుకు పొదుపే లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు 68% మంది తెలిపారు. ఇక అత్యవసర వైద్యం, ఎలక్ట్రానిక్ గృహోపకరణాల కొనుగోలు కోసం పొదుపు చేసుకోవడమూ యవారికి ప్రాధాన్యతాంశాలు. ► నగదు లావాదేవీలను తగ్గించడానికి ప్రభుత్వం, ఆర్బీఐ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా చాలా మంది మహిళలు నగదు రూపంలో లావాదేవీలు జరపడానికే ప్రాధాన్యమిస్తున్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో సుమారు 48 శాతం మంది నగదువైపే మొగ్గు చూపారు. నగదు విత్‌డ్రాయల్ సర్వీసుల కోసమే రిటైల్ స్టోర్‌ను సందర్శిస్తామంటూ 78 శాతం మంది తెలిపారు. ► అయితే, అదే సమయంలో డిజిటల్ చెల్లింపుల కోసం యూపీఐ వినియోగమూ పెరుగుతోంది. 5–20% మంది మహిళలు దీనిని ఎంచుకుంటున్నారు. క్రెడిట్ కార్డుల వినియోగం దాదాపు శూన్యమే. ► డిజిటల్ మాధ్యమం వినియోగం.. 18–40 ఏళ్ల గ్రూప్ మహిళల్లో ఎక్కువగా ఉంటోంది. వారిలో 60%మందికి పైగా మహిళలకు స్మార్ట్ఫోన్లు, వాటి ద్వారా డిజిటల్ కంటెంట్ అందుబాటులో ఉంటోంది. -
క్షీరవిప్లవానికి నిర్లక్ష్యం దెబ్బ
పెరవలి/భీమడోలు : రెండేళ్ల క్రితం వరకు జిల్లాలో పాడి పశువులు సంఖ్య 18 లక్షలు. వీటిలో 12 లక్షల వరకు గేదెలు, 6 లక్షల వరకు ఆవులు ఉండేవి. ప్రస్తుతం వాటి సంఖ్య 8 లక్షలకు పడిపోయింది. ఇందులో గేదెలు 6 లక్షలు కాగా, మరో 2 లక్షల ఆవులు మాత్రమే ఉన్నాయి. వీటిలోనూ పాలిచ్చే గేదెలు 4 లక్షలు, ఆవులు లక్ష వరకూ ఉన్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఫలి తంగా పాల దిగుబడి గణనీ యంగా పడిపోయింది. దీంతో ప్రజలు ఇతర జిల్లాల నుంచి వచ్చే పాల ప్యాకెట్లపై ఆధారపడాల్సిన దుస్థితి నెలకొంది. కీలకమైన సమయాల్లో పాల ఉత్పత్తి సరిగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాయితీల ఎత్తివేతతో సమస్య పాడి రైతులకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పశుక్రాంతి తదితర పథకాల ద్వారా రాయితీ ఇచ్చేవారు. హర్యానా నుంచి పశువులను కొనుగోలు చేసి ఇక్కడి రైతులకు ఇచ్చేవారు. ఒక్కో పశువుకు 50 శాతంపైగా రాయితీ ఉండేది. మిగిలిన మొత్తాన్ని బ్యాంకుల ద్వారా రుణంగా సమకూర్చేవారు. పశుక్రాంతి పథకాన్ని టీడీపీ ప్రభుత్వం అటకెక్కిం చింది. ప్రస్తుతం కేవలం క్షీరసాగర పథ కం కింద చూడి పశువులకు మాత్రం దాణాను రాయితీపై ఇస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు మాత్రం ఒక్కో లబ్ధిదారుడికి ఒక్కో పాడిపశువు చొప్పున ఇస్తున్నారు. ఒక్కో గేదె రూ.60 వేలు కాగా దీనిలో రూ.45 వేలు రాయితీకాగా మిగిలింది లబ్ధి దారుడు చెల్లించాలి. ఈ పథకం మం చిదే అయినా క్షేత్రస్థాయిలో రైతులకు అందుబాటులో లేకుండాపోయింది. గతంలో డెయిరీ పెట్టే ఔత్సాహికులకు రాయితీలు ఉండేవి. ఇప్పుడు పూర్తిగా బ్యాంకులపై ఆధారపడాల్సిన దుస్థితి. ఈ పథకాలను పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రైవేటుకు ప్రోత్సాహం : భీమడోలులోని విజయ డెయిరీ పాలనే జిల్లాలో చాలామంది వినియోగిస్తారు. గతంలో ఈ డెయిరీ పరిధిలో 200 పాల సేకరణ కేంద్రాలు ఉండేవి. ప్రభుత్వం ప్రైవేటు డెయిరీలను ప్రోత్సహిస్తూ.. సహకార రంగంలోని విజయ డెయిరీని నిర్వీర్యం చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ డెయిరీకి 50 లీటర్ల పాలను శీతలీకరణ చేసే సామర్థ్యం ఉండగా.. ప్రస్తు తం 17 వేల లీటర్లతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. గత ఏడాది ఇదే సీజన్లో 23 వేల లీటర్ల వరకు పాలను సేకరించేవారు. ఇక్కడ ఉత్పత్తి పడిపోవడంతో ఇతర జిల్లాల పాలపై ఆధారపడాల్సి వస్తోంది. అవి నాణ్యంగా ఉండటం లేదని ప్రజలు వాపోతున్నారు. ఇక్కడ సేకరించిన పాలను జిల్లాలో డెయిరీలకు ఇవ్వకుండా కృష్ణా, తూర్పుగోదావరిలోని ఇతర డెయిరీలకు పంపిస్తున్నారు. ఇక్కడి రైతులను ఆకట్టుకుని పాల సేకరణ లక్ష్యాన్ని పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదు. కల్తీపాలతో అనారోగ్యం జిల్లాలో పాల ఉత్పత్తి పడిపోవడంతో కల్తీ పాలు మార్కెట్లో స్వైరవిహారం చేస్తున్నాయి. మిల్క్ పౌడర్, సోయాబీన్ పౌడర్‌ను నీటిలో కలిపి పాటినే అసలైన పాలుగా విక్రయిస్తున్నారు. వీటి రంగు మెరుగుపరచడానికి డిటర్జెంట్లు కలుపుతున్నారు. వీటిని తాగిన వారు గ్యాస్ట్రిక్, కిడ్నీ సంబంధిత సమస్యల బారిన పడుతున్నారు. పట్టించుకోవాల్ని ఆహార కల్తీ నిరోధక శాఖ మిన్నకుండిపోతోంది. ఆందోళన అవసరం లేదు విజయ డెయిరీకి గతంలో పాలు సరఫరా చేసిన రైతులతో సమావేశాలు నిర్వహిస్తున్నాం. విజయ పాలకు మంచి డిమాండ్ ఉంది. లక్ష్యాన్ని సాధించేందుకు కలెక్టర్ సారథ్యంలో ఉన్నతాధికారులు అన్ని చర్యలు తీసకుంటున్నారు. పాల ఉత్పత్తిదారుల సంఘం ధర పెంచాలని కోరుతోంది. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రైతులు ప్రైవేటు డెయిరీలను నమ్మి మోసపోకుండా ప్రభుత్వ పాల డెయిరీని బలోపేతం చేసేందుకు సహకరించాలి. పాడి రైతులు ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదు. – గుత్తా వెంకట శశాంక్ధర, ఏడీ, విజయ మిల్క్ డెయిరీ, భీమడోలు -
రియాక్ట్ అవ్వడానికి సెకన్ లేటైనా..
వేగంగా వస్తున్న విమానం ఫోటోను తీయడానికి ఓ వ్యక్తి చేసిన సాహసం ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. దీనికి సంబంధించిన 360 డిగ్రీల్లో తీసిన వీడియోను చూసిన వారంతా, వామ్మో రియాక్ట్ అవ్వడంలో సెకన్లలో తేడా వచ్చినా తల ఎగిరిపోయేదేమో అంటున్నారు. ఈ సంఘటన ఉత్తర అమెరికా ఖండంలో సెయింట్ బార్ట్స్ దీవిలోని గస్టఫ్ ఎయిర్ పోర్టు సమీపంలో చోటు చేసుకుంది. మెక్కీ జైదీ అనే పర్యాటకుడు ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవడానికి కిందకు దిగుతున్న విమానాన్ని దగ్గర నుంచి ఫోట్ తీయడానికి ప్రయత్నించి తృటిలో తప్పించుకున్నాడు. 'విమాన వేగాన్ని జడ్జ్ చేసి తప్పించుకోవడం కష్టమే, ఆ సమయంలో నేను కెమెరాలో విమానాన్ని బందించాలనుకున్నాను. విమానం సమీపిస్తుండగా సహజంగానే కిందికి వంగి తప్పించుకున్నాను' అని మెక్కీ జైదీ పేర్కొన్నాడు. ఎయిర్ పోర్టు అధికారులు ఆ ప్రదేశంలో వార్నింగ్ బోర్డులు కూడా పెట్టారు. అయితే తాను పబ్లిక్ రోడ్డుపై మాత్రమే ఉన్నానని, నిషిద్ధ ప్రాంతంలో కాదని వివరణ ఇచ్చుకున్నాడు. మిక్కీ జైదీ విమానం సమీపిస్తుండగా 360డిగ్రీలో మరో వ్యక్తి వీడియో తీశాడు. ఈ వీడియోలో విమానం ఆ వ్యక్తిని ఢీకొట్టినట్టుగా చాలా సమీపంలోంచి వెళ్లింది.