veternary centres
-
తీరిన మూగవేదన
కడప అగ్రికల్చర్: నాడు అత్యవసర వైద్య సేవ లకు కోసం మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 108 అంబులెన్స్‌ను అందుబాటులోకి తెచ్చి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నోరు లేని మూగజీవాల వైద్య సేవల కోసం 1962 వాహనాన్ని తెచ్చి చరిత్రపుటల కెక్కనున్నారు. పశువులు వ్యాధుల బారిన పడితే 1962కు కాల్ చేస్తే ఎక్కడ వైద్య సేవలవసరమో అక్కడికే వాహనం రానుంది. ఈ అంబులెన్స్‌లో పశుసంవర్ధశాఖకు సంబంధించిన పశుౖవైద్యుడు, వెటర్నరీ అసిస్టెంట్, అటెండర్ కమ్ డ్రైవర్ ఉంటారు. రైతు సమాచారం అందించగానే వారు సంఘటన స్థలానికి వెళ్లి వైద్య సేవలు అందించేలా రూపకల్పన చేశారు. అలాంటి వాహనాలు జిల్లాకు 7 అందుబాటులోకి రానున్నాయి. దీంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. నియోజక వర్గానికి ఒకటి చొప్పున.. జిల్లాకు సంబంధించి వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవా పథకం కింద ఏడు వాహనాలు రానున్నాయి. వీటి ద్వారా ఆయా నియోజకవర్గ కేంద్రంలోని పశుసంవర్థశాఖ ఏడీ పర్యవేక్షణలో సేవలు అందనున్నాయి. మూగజీవాల ఆరోగ్యానికి భరోసా వైఎస్సార్ సంచార పశు ఆరోగ్యసేవ ద్వారా గ్రామాల్లోనే పశువులకు మెరుగైన వైద్యాన్ని అందించనున్నారు. అన్నదాతలను అదుకోవడమే లక్ష్యంగా త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 1962 వాహనాలను ప్రారంభించనున్నారు. జిల్లావ్యాప్తంగా 3.99 లక్షల గేదెలు ఉండగా అందులో 2.50 లక్షలు పాడిపశువులు, 13.56 లక్షల గొర్రెలు ఉన్నాయి. 11 లక్షలు కోళ్లు కూడా ఉన్నట్లు పశువైద్య అధికారులు తెలిపారు. ఈ మొబైల్ వాహనంతో మూగ జీవాల ఆరోగ్యానికి మరింత భరసా లభించనుంది. వైద్య సేవలు పొందేదిలా.. 108 తరహాలో 1962 నంబర్‌కు ఫోన్ చేయగానే పశువైద్యశాఖకు సంబంధించిన ప్రధాన కేంద్రానికి వెళుతుంది. అక్కడి నుంచి వారు రైతుకు సంబంధించిన వివరాలను నమోదు చేసుకుంటారు. దీంతోపాటు బాగాలేని పశువు, గెదె, మేక వంటి వాటి గురించి ఆరా తీసి సంబంధింత సమాచారాన్ని దగ్గరలోని రైతు భరోసా కేంద్రానికి చేరవేస్తారు.అక్కడ ఉన్న వైద్య సిబ్బంది వెళ్లి ప్రాథమికంగా పశువును పరీక్షించి వైద్య సేవలందిస్తారు. అత్యవసరమైతే అక్కడికి అంబులెన్స్ చేరుకుంటుంది. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం దగ్గరలోని పెద్దాసుపత్రికి తరలిస్తారు. మే రెండవ వారంలో... జిల్లాలో వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవ కింద మే రెండో వారంలో సేవలు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించగానే జిల్లాకు వాహనాలు వస్తాయి. అప్పటి నుంచి జిల్లాలో కూడా సేవలు ప్రారంభిస్తాం. మూగ జీవాలకు ఆరోగ్యం సరిగా లేదని సమాచారం రాగానే వాహనం అక్కడికి వెళ్లి అక్కడికక్కడే సేవలు అందిచి అన్నదాతను ఆదుకుంటుంది. – తెలుగు. వెంకట రమణయ్య, జిల్లా పశు వైద్యాధికారి,వైఎస్సార్‌జిల్లా సూపర్ స్పెషాలిటీ వెటర్నరీ అసుపత్రి: 01 వెటర్నరీ పాలిక్లినిక్: 01 ఏరియా వెటర్నీరీ హాస్పిటల్స్: 17 వెటర్నరీ డిస్షెన్సరీస్: 79 రూరల్ లైవ్ స్టాక్ యూనిట్లు: 78 డివిజనల్ ఆఫీసర్లు: 03 పశు వైద్యులు: 117 వెటర్నరీ అసిస్టెంట్లు: 108 జిల్లాలో ఆర్బీకేలు : 414 -
తిరుపతిలో కరోనా వైరస్ నిర్ధారిత పరీక్షలు
-
14 పశుచికిత్సా కేంద్రాల అప్‌గ్రేడ్
-పశువైద్యశాలలుగా మారుస్తూ ఉత్తర్వులు – త్వరలో ఏడీ స్థాయి డాక్టర్ల నియామకం అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలో ఉన్న 14 పశుచికిత్సా కేంద్రాల (వెటర్నరీ డిస్పెన్సరీ–వీడీ)ను పశువైద్యశాలలు (వెటర్నరీ హాస్పిటల్స్–వీహెచ్)గా అప్‌గ్రేడ్ చేస్తూ పశుశాఖ డైరెక్టరేట్ నుంచి రెండు రోజుల కిందట ఉత్తర్వులు జారీ అయినట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. బుక్కరాయసముద్రం, రాప్తాడు, బత్తలపల్లి, యల్లనూరు, గోరంట్ల, అమరాపురం, పరిగి, తలుపుల, నల్లచెరువు, కనేకల్లు, శెట్టూరు, గుమ్మగట్ట, కొత్తచెరువు, లేపాక్షి పశువైద్య చికిత్సా కేంద్రాలు పశువైద్యశాలలుగా అప్‌గ్రేడ్ అయ్యాయి. అక్కడ ఇప్పటి వరకు పశువైద్యాధికారులు పనిచేస్తుండగా ఇపుడు అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ) స్థాయి పశువైద్యాధికారులు విధులు నిర్వర్తించాల్సి ఉంది. ప్రస్తుతం అక్కడ పనిచేస్తున్న పశువైద్యాధికారులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. కొందరు ఏడీ స్థాయి అధికారులను ఇన్‌చార్జ్‌లుగా నియమించగా త్వరలోనే 14 ఆస్పత్రులకు రెగ్యులర్ ఏడీలను నియమించే అవకాశం ఉందని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. వీటితో పాటు ఎనిమిది గ్రామీణ పశువైద్య కేంద్రాల (రూరల్ లైవ్‌స్టాక్ యూనిట్స్–ఆర్‌ఎల్‌యు)ను పశుచికిత్సా కేంద్రాలు (వీడీ)గా అప్‌గ్రేడ్ చేశారు. అందులో చియ్యేడు, పంపనూరు, నాగసముద్రం, కల్లూరు, చలివెందల, కె.బసవనపల్లి, సిద్ధగూరపల్లి, కె.బ్రాహ్మణపల్లి ఆర్‌ఎల్‌యూలు ఉన్నాయి. ఇక్కడ ప్రస్తుతం కాంపౌండర్ స్థాయి అధికారులు పనిచేస్తుండగా వారి స్థానంలో పశువైద్యాధికారులను ఇన్‌చార్జ్‌లుగా నియమిస్తూ ఆ శాఖ జేడీ డాక్టర్ వి.రవీంద్రనాథ్ఠాగూర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం బుక్కరాయసముద్రంలో పనిచేస్తున్న డాక్టర్ రామచంద్రారెడ్డిని చియ్యేడుకు, రాప్తాడులో పనిచేస్తున్న డాక్టర్ శ్రీనివాసులును పంపనూరుకు బదిలీ చేశారు. అలాగే బుక్కరాయసముద్రం ఆస్పత్రికి ఇన్చార్జ్ ఏడీగా శింగనమల ఏడీ డాక్టర్ స్వరూపారాణికి, అనంతపురం ఏడీ డాక్టర్ దేవరాజులును రాప్తాడు ఆస్పత్రికి ఇన్చార్జిగా నియమించారు.