Vigilance Investigation
-
‘రూ.25 కోట్ల డిమాండ్’పై విజిలెన్స్ దర్యాప్తు
న్యూఢిల్లీ: ముంబై తీరంలో క్రూయిజ్ షిప్లో పట్టుబడిన డ్రగ్స్ కేసులో నిందితుడైన ఆర్యన్ ఖాన్‌ను విడిచిపెట్టడానికి రూ.25 కోట్లు డిమాండ్ చేశారంటూ ప్రభాకర్ సాయిల్ అనే సాక్షి సమర్పించిన అఫిడవిట్‌పై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) వేగంగా స్పందించింది. ఈ వ్యవహారంపై విజిలెన్స్ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్సీబీ ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడేతోపాటు మరికొందరు అధికారులపై ప్రభాకర్ సాయిల్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. విజిలెన్స్ దర్యాప్తు కోసం ఎన్సీబీ ఉత్తర రీజియన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జ్ఞానేశ్వర్ సింగ్ నేతృత్వంలో త్రిసభ్య బృందం ఏర్పాటయ్యింది. జ్ఞానేశ్వర్ సింగ్ ఎన్సీబీ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్(సీవీఓ)గానూ పనిచేస్తున్నారు. ఆర్యన్ ఖాన్‌ను విడిచిపెట్ట్టడానికి రూ.25 కోట్లు ఇవ్వాలంటూ ఎన్సీబీ కీలక అధికారులతోపాటు ఈ కేసులో సంబంధం ఉన్న కొందరు వ్యక్తులు డిమాండ్ చేశారని ప్రభాకర్ సాయిల్ ఆదివారం బాంబు పేల్చాడు. ఈ మేరకు ముంబై పోలీసులకు అఫిడవిట్ అందజేశాడు. డ్రగ్స్ కేసులో మరో సాక్షి అయిన కె.పి.గోసవికి ప్రభాకర్ సాయిల్ బాడీగార్డుగా పనిచేస్తున్నాడు. ప్రభాకర్ సాయిల్ చేస్తున్న ఆరోపణలు నిరాధారమని డ్రగ్స్ కేసులో మరో సాక్షి కిరణ్ గోసవి పేర్కొన్నాడు. క్రూయిజ్ షిప్‌పై ఎన్సీబీ దాడులు జరిగిన అక్టోబర్ 2 నుంచి పరారీలో ఉన్న అతడు సోమవారం గుర్తుతెలియని ప్రాంతం నుంచి టీవీ చానళ్లతో మాట్లాడాడు. తాను అతి త్వరలో లక్నో పోలీసుల ఎదుట లొంగిపోతానని చెప్పాడు. పారదర్శకంగా దర్యాప్తు ప్రభాకర్ సాయిల్ సమర్పించిన అఫిడవిట్, కేసు రిపోర్టు ముంబైలోని తమ అధికారుల నుంచి అందిందని జ్ఞానేశ్వర్ సింగ్ సోమవారం ఢిల్లీలో చెప్పారు. ఈ రిపోర్టును ఎన్సీబీ డైరెక్టర్ జనరల్పరిగణనలోకి తీసుకున్నారని, విజిలెన్స్ దర్యాప్తునకు ఆదేశించారని వెల్లడించారు. సిబ్బందిపై ఎలాంటి ఆరోపణలు వచ్చినా పారదర్శకంగా, నిజాయతీగా దర్యాప్తు జరుపుతామన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సమీర్ వాంఖెడేను డ్రగ్స్‌కేసు విచారణ నుంచి తప్పించడంపై ఇప్పుడే ఏమీ చెప్పలేమన్నారు. దర్యాప్తు పురోగతి, సాక్ష్యాధారాలను బట్టి చర్యలుంటాయన్నారు. విజిలెన్స్ దర్యాప్తులో భాగంగా వాంఖెడేను, ఇతర అధికారులను, సాయిల్‌ను నిశితంగా ప్రశ్నించనున్నట్లు ఎన్సీబీ వర్గాలు వెల్లడించాయి. కాగా, సమీర్ వాంఖెడే సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఎన్సీబీ ఉన్నతాధికారులెవరూ తనను పిలిపించలేదని, వేరే పని కోసం ఇక్కడికి వచ్చానన్నారు. సాయిల్‌కు పోలీసు భద్రత ముంబై డ్రగ్స్ కేసులో సాక్షి అయిన ప్రభాకర్ సాయిల్‌కు పోలీసు భద్రత కల్పిస్తామని మహారాష్ట్ర హోంమంత్రి దిలీప్‌వాల్సే పాటిల్ ప్రకటించారు. సాయిల్ సోమవారం ముంబై పోలీసు కమిషనర్ కార్యాలయానికి వచ్చాడు. జాయింట్ కమిషనర్(క్రైమ్) మిలింద్‌ను కలిసి మాట్లాడాడు. అనంతరం ముంబై శివారులోని సహర్ పోలీసులను కలిశాడు. తనకు భద్రత కల్పించాలని కోరాడు. విచారణకు అనన్య పాండే డుమ్మా డ్రగ్స్ కేసులో నటి అనన్య పాండే సోమవారం ఎన్సీబీ ఎదుట విచారణకు హాజరు కాలేదు. ఇంతకుముందే రెండు రోజులపాటు ఎన్సీబీ ఆమెను ప్రశ్నించింది. సోమవారం మళ్లీ రావాలని సూచించినప్పటికీ రాలేదు. వాంఖెడే ఫోర్జరీ సర్టిఫికెట్లు: నవాబ్ మాలిక్ ఎన్సీబీ జోనల్ డెరెక్టర్ సమీర్ వాంఖెడే పుట్టినతేదీ సహా సర్టిఫికెట్లను ఫోర్జరీ చేసి, ఉద్యోగంలో చేరారని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఆరో పించారు. సోమవారం సదరు సర్టిఫికెట్లను ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ ఆరోపణలను వాంఖెడే కొట్టిపారేశారు. ఈ కేసులో నవాబ్ మాలిక్ అల్లుడు సమీర్ ఖాన్‌ను వాంఖెడే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వాంఖెడేకు ఉపశమనం సాధ్యం కాదు: ప్రత్యేక కోర్టు ముంబై: డ్రగ్స్ కేసులో సాక్షి ప్రభాకర్ సాయిల్ అఫిడవిట్ ఆధారంగా న్యాయస్థానాలు తనపై ఎలాంటి చట్టపరమైన చర్యలు చేపట్టకుండా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ ముంబైలోని స్పెషల్ కోర్టును ఆశ్రయించిన సమీర్ వాంఖెడేకు నిరాశే ఎదురయ్యింది. అలాంటి ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదని న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఎన్సీబీ, సమీర్ వాంఖెడే సోమవారం ప్రత్యేక కోర్టులో రెండు వేర్వేరు అఫిడవిట్లు దాఖలు చేశారు. డ్రగ్స్ కేసులో విచారణకు అడ్డంకులు సృష్టించడానికి ప్రభాకర్ సాయిల్ ప్రయత్నిస్తున్నాడని, అందులో భాగంగా తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని ఎన్సీబీ, వాంఖెడే తమ అఫిడవిట్లలో పేర్కొన్నారు. తనపై, తన కుటుంబ సభ్యులపై పెద్ద కుట్ర జరుగుతోందని వాంఖెడే చెప్పారు. తమను నైతికంగా దెబ్బతీసే యత్నం జరుగుతోందన్నారు. అందుకే తమపై న్యాయస్థానాలు చట్టపరమైన చర్యలు ప్రారంభించకుండా సంపూర్ణ రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులివ్వాలని కోరారు. అయితే, ఈ కేసులో అలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని ప్రత్యేక జడ్జి వి.వి.పాటిల్ స్పష్టం చేశారు. -
ల్యాప్‌టాప్‌ల కొను‘గోల్మాల్’..!
సాక్షి, నూజివీడు: ఆర్జీయూ కేటీ పరిధిలోని ట్రిపుల్ ఐటీలలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే కాంట్రాక్ట్ అధ్యాపకుల నియామకాల్లో అవకతవకలు జరిగినట్లు వార్తలు రాగా.. ఇప్పుడు శ్రీకాకుళం, ఒంగోలు, ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలకు సంబంధించిన ల్యాప్‌టాప్ కొనుగోళ్లలో కోట్ల రూపాయలు గోల్మాల్ జరిగినట్లు విజిలెన్స్ గుర్తించింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో పనిచేసిన వైస్ చాన్స్‌లర్, వీసీ కార్యాలయంలో పనిచేసిన కొంతమంది కాంట్రాక్టు అధికారులు, అప్పటి ఆయా ట్రిపుల్‌ఐటీల డైరెక్టర్లు, ల్యాప్‌టాప్‌ల కొనుగోలు నిమిత్తం నియమించిన కమిటీ సభ్యులు ఈ తతంగంలో ప్రధాన పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కి ఒక కంపెనీకి అనుకూలంగా టెండర్ చేసి ఈ దోపిడీకి పాల్పడినట్లు సమాచారం. రూ. 8,500 అదనంగా.. శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ఐటీలకు ఒక్కోక్కటికీ 3,500, ఇడుపులపాయ ట్రిపుల్ఐటీకి 4వేలు.. మొత్తం 11,000 ఏఎండీ ప్రాసెసర్లు కల్గిన ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేశారు. వీటి ధర ఆన్లైన్లో రూ.20వేలు ఉండగా, ఆర్జీయూకేటీ అధికారులు మాత్రం రూ.28,500లకు కొన్నారు. సింగిల్ టెండర్ రాగా దానినే ఆమోదించారు. ఇంత ధర పెట్టి కొనుగోలు చేసినా.. ల్యాప్‌టాప్‌లు చాలా నాసిరకంగా ఉన్నాయని, ఏఎండీ ప్రాసెసర్ కావడంతో ఏమాత్రం పనిచేయడం లేదని విద్యార్థులు, ఫ్యాకల్టీ పేర్కొనడం గమనార్హం. నూతన ల్యాప్‌టాప్‌ల కంటే 2011, 2012 సంవత్సరాలలో కొనుగోలు చేసిన ల్యాప్‌టాప్‌లే బాగా పనిచేస్తున్నాయని విద్యార్థులు పేర్కొంటున్నారు. రిపీట్ ఆర్డర్‌పై ఆరా..! ముందుగా శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ఐటీలకు ల్యాప్‌టాప్‌ల కొనుగోలుకు టెండర్లు పిలిచి 7వేల ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేయగా, ఆ తర్వాత ఒంగోలు ట్రిపుల్ఐటీకి మాత్రం 4వేల ల్యాప్‌టాప్‌లను రిపీట్ ఆర్డర్‌పై కొనుగోలు చేయడం గమనార్హం. అప్పట్లో నూజివీడుకు కూడా రిపీట్ ఆర్డర్‌తో కొనుగోలు చేయాలని అప్పటి వైస్‌చాన్స్‌లర్ డైరెక్టర్‌పై తీవ్ర ఒత్తిడి చేసినప్పటికీ అందుకు ఒప్పుకోలేదు. తాను చెప్పిన మాట వినలేదనే ఆ తర్వాత నూజివీడు డైరెక్టర్‌కు రెండోసారి రెన్యువల్ చేయకుండా పంపించేశారు. దీనిపై అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. టెండర్ ఫైనలైజ్ అయినా రద్దు.. దీనికి ముందు 2017లో ల్యాప్‌టాప్ టెండర్‌ను పిలువగా, ఒక కంపెనీ న్యూజనరేషన్ ప్రాసెసర్‌తో 6 ఏళ్ల గ్యారెంటీతో బై బ్యాక్ పద్ధతిలో రూ.30,400ల ధరకు కోట్ చేయడం జరిగింది. అంతే కాకుండా వీటిని మార్చేటప్పుడు రూ.5,200లతో తానే కొనుగోలు చేస్తానని కూడా ఆ కంపెనీ పేర్కొంది. దీనికి సంబంధించిన టెండర్ కూడా ఫైనలైజ్ అయిన తర్వాత అప్పటి వీసీ ఈ టెండర్‌ను రద్దు చేసి మరలా టెండర్ పిలిచారు.దీనిపైనా అధికారులు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. బెంచ్‌మార్కు టెస్ట్‌లు లేకుండానే.. ఏ కంపెనీకి చెందినవైనా తప్పనిసరిగా వాటి పనితీరును పరిశీలించేందుకు బెంచ్‌మార్కు టెస్ట్‌లు నిర్వహించాల్సి ఉంటుంది. 11వేల ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేసేముందు ఇక్కడ ఎలాంటి బెంచ్‌మార్కు టెస్ట్‌లు జరపకుండా నాసిరకం ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేసి విద్యార్థులకు అంటగట్టేశారు. అయితే విజిలెన్స్ విచారణ కొనసాగుతుండటంతో మరిన్ని విషయాలు బహిర్గతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
అడ్డగోలుగా రైట్ రైట్..
రవాణా శాఖలో కలకలం ఆర్టీవో, మరో ఇద్దరు సస్పెన్షన్ ట్రాన్స్పోర్ట్ లెసైన్స్ బ్యాడ్జిల జారీలో అవినీతి విద్యార్హతలను పరిశీలించకుండా మంజూరు నెలరోజులుగా విజిలెన్స్ దర్యాప్తు అనకాపల్లి : వాహనాన్ని నడుపుతున్నప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన కూడళ్లలో సిగ్నల్స్‌ను గమనించాలి. మలుపుల్లో ప్రమాద హెచ్చరికలను అర్థం చేసుకోవాలి. అందుకే ట్రాన్స్పోర్ట్ లెసైన్స్ బ్యాడ్జి పొందాలంటే కనీస విద్యార్హత ఉండాలి. కానీ ఈ నిబంధన ఎక్కడా అమలు కాదు. డబ్బులిస్తే చాలు విద్యార్హతలను పరిశీలించరు. క్షేత్రస్థాయి దర్యాప్తు జరపరు. ట్రాన్స్‌పోర్టు లెసైన్స్‌లు జారీ చేస్తారు. అనకాపల్లి ఆర్టీవో కార్యాలయంలో కొన్నాళ్లుగా జరుగుతోందిదే. ఆర్టీవో మహ్మద్ సలీమ్ సహా కార్యాలయ పరిపాలనాధికారి నర్సింహులు, సీనియర్ అసిస్టెంట్ నాగమణిల సస్పెన్షన్‌కు కారణమిదే. వీరిని సస్పెండ్ చేస్తూ రవాణా శాఖ కమిషనర్ శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వులతో కలకలం రేగింది. అక్రమాలపై కమిషనర్‌కు ఫిర్యాదు: ట్రాన్స్‌పోర్టు లెసైన్సుల జారీలో సంబంధీకుల విద్యార్హత ధ్రువీకరణ పత్రాలపై క్షేత్రస్థాయి దర్యాప్తు జరపకుండా బ్యాడ్జీలను ఇస్తున్నారని ఓ వ్యక్తి నేరుగా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సుబ్రహ్మణ్యంకు ఫిర్యాదు చేశారు. ఆశాఖ ఉన్నతాధికారులృబందం అనకాపల్లి కార్యాలయంలో విచారణ చేపట్టింది. ఇటీవల విశాఖ పర్యటనకు వచ్చిన కమిషనర్ కూడా పరిస్థితిపై ఆరా తీశారు. ప్రధానంగా జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో జారీ చేసిన 312 లెసైన్సులకు సంబంధించిన 97 ఫైళ్ల అదృశ్యంపై ఉన్నతాధికారులు, విజిలెన్స్ృబందం నెలరోజులపాటు దర్యాప్తు చేపట్టారు. అధిక సంఖ్యలో లెసైన్స్‌ల బ్యాడ్జీ నంబర్లు నిబంధనలకు విరుద్ధంగా మంజూరు చేసినట్టు గ్రహించారు. విచారణలో నివేదికలనుబట్టి ఇందులో అనకాపల్లి ఆర్టీవో మహ్మద్ సలీమ్, ఏవో నర్సింహులు, సీనియర్ అసిస్టెంట్ నాగమణిల ప్రమేయం ఉన్నట్టు రుజువైంది. లెసైన్స్ బ్యాడ్జీల నంబర్ల మంజూరులో అక్రమాల డొంక బయటపడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. బ్యాడ్జి నంబర్ల అవినీతి అనకాపల్లి కార్యాలయానికి పరిమితం కాదని అన్ని కార్యాలయాలలో ఇదే పరిస్థితి ఉందని బహిరంగంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూడేళ్లుగా రికార్డులు పరిశీలిస్తే నిబంధనలకు విరుద్ధంగా వందల సంఖ్యలో బ్యాడ్జీ నంబర్ల జారీ ఉంటుందన్న వాదన వ్యక్తమవుతోంది. అయితే కమిషనర్ బ్యాడ్జీ నంబర్లపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారని తెలిసింది. విశాఖ, గాజువాక కార్యాలయాలలో ఆరా తీసే అవకాశం ఉందని సమాచారం. నా తప్పేమీ లేదు: ఆర్టీవో సలీం : బ్యాడ్జీల వివాదంలో తన తప్పులేదని ఆర్టీవో సలీం పేర్కొన్నారు. కిందిస్థాయిలో జరుగుతున్న అవకతవకలను గుర్తించి వెలుగులోకి తీసుకువచ్చానన్నారు. అయినా తనను శిక్షించారని, దేవుడే ఈ సమస్యకు పరిష్కారం చూపుతాడన్నారు. కాలమే సమాధానం చెబుతుందన్నారు.