vignan bhavan
-
జలసంరక్షణలో జాతీయ అవార్డు
సూపర్‌బజార్(కొత్తగూడెం) : జల సంరక్షణ విభాగంలో ములకలపల్లి మండలం జగన్నాథపురం గ్రామానికి జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు రాగా, ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ ప్లీనరీ హాల్లో ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ చేతుల మీదుగా గ్రామ సర్పంచ్ గడ్డం భవాని, కార్యదర్శి షేక్ ఇబ్రహీం శనివారం పురస్కారం స్వీకరించారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ 11 కేటగిరీల్లో 41 మంది విజేతలను ప్రకటించగా జల సంరక్షణలో ఉత్తమ పంచాయతీగా జగన్నాథపురం నిలిచిన విషయం తెలిసిందే. గ్రామానికి అవార్డు రావడం పట్ల కలెక్టర్ అనుదీప్ హర్షం వ్యక్తం చేశారు. ప్రశంసపత్రంతో పాటు నగదు బహుమతి అందుకున్నారని తెలిపారు. జాతీయస్థాయిలో జల సంరక్షణలో మొదటి స్థానం సాధించేందుకు కృషి చేసిన ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, సహకరించిన ప్రజలను ఆయన అభినందించారు. జలవనరులు, నదుల అభివృద్ధి, గంగా పునరుజ్జీవన శాఖ అధ్వర్యంలో 2018 నుంచి జల, నీటి వనరుల నిర్వహణ అవార్డులు అందజేస్తున్నారని పేర్కొన్నారు. -
నేటి నుంచి వరల్డ్ ఫుడ్ ఇండియా
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో నిర్వహించబోయే ప్రపంచ ఆహార మేళాను దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. శుక్రవారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఈ కార్యక్రమం మొదలుకానుంది. కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ ఆధ్వర్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ శాఖ మూడు రోజులపాటు ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించనుంది. ప్రపంచం నలుమూలల నుంచి పలువురు వాణిజ్యవేత్తలు ఈ కార్యక్రమానికి హాజరు అవుతుండగా, కేంద్రం పెద్ద మొత్తంలో పెట్టుబడులను ఆశిస్తోంది. జర్మనీ, జపాన్, నెదర్లాండ్, ఇటలీ తదితర దేశాలు ఇందులో పాల్గొంటాయి. ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ ద్వారా ఇలాంటి ఈవెంట్‌ను భారత్ నిర్వహించటం ఇదే తొలిసారి కూడా. ఆహార ఉత్పత్తుల ద్వారా ఆర్థిక రంగంలో పెట్టుబడులను ఆకర్షించగలిగితే మాత్రం సుమారు 10 బిలియన్ల వరకు రాబట్టగలగ వచ్చనేది ఒక అంచనా. ఫుడ్ ఫెయిర్‌ను ప్రారంభించిన తర్వాత నేషనల్ స్టేడియంలోని ఇండియా గేట్ లాన్లో ఏర్పాటు చేసే ఆహార స్టాల్లను మోదీ పరిశీలిస్తారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి సాధ్వీ నిరంజన్‌తోపాటు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గడ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. మొత్తం 30 దేశాలు, 200 కంపెనీలకు చెందిన రెండు వేల మంది ఈ భారీ ఈవెంట్లో తమ నైపుణ్యం ప్రదర్శించనున్నారు. -
జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానం
-
ఘనంగా సినిమా పండుగ
62వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రదానం చేసిన రాష్ట్రపతి ప్రణబ్ న్యూఢిల్లీ: 62వ జాతీయ సినిమా అవార్డుల ప్రదానోత్సవం అంగరంగవైభవంగా జరిగింది. ఆదివారమిక్కడ విజ్ఞాన్ భవన్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అవార్డు గ్రహీతలకు పురస్కారాలను అందజేశారు. చిత్రరంగంపై ఉత్తమ రచన(సెలైంట్ సినిమా)కుగాను రచయిత పసుపులేటి పూర్ణచంద్రరావు, ప్రచురణ కర్త ఎమెస్కో విజయ్‌కుమార్‌లు రాష్ట్రపతి చేతుల మీదుగా స్వర్ణకమలం, ప్రశంసాపత్రం అందుకున్నారు. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా తెలుగు భాష నుంచి ఎంపికైన ‘చందమామ కథలు’ సినిమా నిర్మాత చాణక్య బోనేటి, దర్శకుడు ప్రవీణ్ సత్తారు రాష్ట్రపతి చేతుల మీదుగా రజత కమలం, ప్రశంసా పత్రాలు స్వీకరించారు. ఉత్తమ నటుడు (నాను అవనల్లా అవాలు-కన్నడ చిత్రం)గా ఎంపికైన విజయ్, ఉత్తమ నటి(క్వీన్)గా ఎంపికైన బాలీవుడ్ తార కంగనా రనౌత్, ఉత్తమ దర్శకుడు(చోటుష్కొనే-బెంగాలీ చిత్రం)గా ఎంపికైన శ్రీజిత్ ముఖర్జీలు కూడా అవార్డులు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మం త్రులు అరుణ్‌జైట్లీ, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఆనారోగ్యం కారణంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకునేందుకు ప్రముఖ నటుడు శశికపూర్ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు. భారతసినీ రంగానికి కపూర్ కుటుంబం చేసిన సేవలను రాష్ట్రపతి ఈ సందర్భంగా కొనియాడారు. ఆయన్ను ‘లివింగ్ లెజెండ్’గా అభివర్ణిస్తూ.. త్వరగా కోలుకోవాలని అభిలషించారు. శశికపూర్‌కు ఆయన నివాసంలోనే ప్రభుత్వం తరఫున పురస్కారాన్ని అందజేసి గౌరవిస్తామని జైట్లీ వెల్లడించారు.