సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో నిర్వహించబోయే ప్రపంచ ఆహార మేళాను దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. శుక్రవారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈ కార్యక్రమం మొదలుకానుంది.
కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ ఆధ్వర్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ శాఖ మూడు రోజులపాటు ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించనుంది. ప్రపంచం నలుమూలల నుంచి పలువురు వాణిజ్యవేత్తలు ఈ కార్యక్రమానికి హాజరు అవుతుండగా, కేంద్రం పెద్ద మొత్తంలో పెట్టుబడులను ఆశిస్తోంది. జర్మనీ, జపాన్, నెదర్లాండ్, ఇటలీ తదితర దేశాలు ఇందులో పాల్గొంటాయి. ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ ద్వారా ఇలాంటి ఈవెంట్‌ను భారత్ నిర్వహించటం ఇదే తొలిసారి కూడా. ఆహార ఉత్పత్తుల ద్వారా ఆర్థిక రంగంలో పెట్టుబడులను ఆకర్షించగలిగితే మాత్రం సుమారు 10 బిలియన్ల వరకు రాబట్టగలగ వచ్చనేది ఒక అంచనా.
ఫుడ్ ఫెయిర్‌ను ప్రారంభించిన తర్వాత నేషనల్ స్టేడియంలోని ఇండియా గేట్ లాన్‌లో ఏర్పాటు చేసే ఆహార స్టాల్‌లను మోదీ పరిశీలిస్తారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి సాధ్వీ నిరంజన్‌తోపాటు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గడ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. మొత్తం 30 దేశాలు, 200 కంపెనీలకు చెందిన రెండు వేల మంది ఈ భారీ ఈవెంట్‌లో తమ నైపుణ్యం ప్రదర్శించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment