200 కేజీల గంజాయి పట్టివేత
విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా బుచ్చయ్యపేట మండలం విజయరామరాజుపేటలో 200 కేజీల గంజాయిని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.