ఆర్టీసీ బస్సును ఢీకొని విద్యార్థి..
కదిరి అర్బన్: పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల సమీపంలో ఆర్టీసీ బస్సును బైక్ ఢీకొన్న ప్రమాదంలో డిగ్రీ విద్యార్థి మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. ఓబుళదేవరచెరువు మండలం తుమ్మలకుంట్లపల్లికి చెందిన విజయశేఖర్ (21) కదిరిలోని నారాయణ పాఠశాల వద్దనుంచి అడపాలవీధిలోకి వెళ్లేందుకు తన ద్విచక్ర వాహనంలో బయలుదేరాడు. రోడ్డు దాటే క్రమంలో తన ముందు పోతున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన విజయశేఖర్ను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగాఉండడంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం తీసుకెళుతుండగా మార్గం మధ్యలో మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.